cost of living
-
ముంబై.. చాలా కాస్ట్లీ గురూ!
సాక్షి, అమరావతి: ప్రముఖ హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్– ‘2024 కాస్ట్ ఆఫ్ లివింగ్’ సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై అగ్రస్థానంలో నిలిచింది.దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో జీవించే ప్రవాసుల జీవన వ్యయం గణనీయంగా పెరిగినట్టు ఈ సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 11 స్థానాలు ఎగబాకి 136వ స్థానానికి చేరుకుంది. ఢిల్లీ 164, చెన్నై ఐదు స్థానాలు దిగజారి 189వ స్థానానికి, అలాగే బెంగళూరు ఆరు స్థానాలు క్షీణించి 195వ స్థానానికి చేరుకున్నాయి. హైదరాబాద్ 202వ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది.ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వేరొక నగరం, దేశానికి వలస వెళ్లి జీవించడంలో జీవన వ్యయం కీలక పాత్ర పోషిస్తున్నది. స్థానిక ఆర్థిక పరిస్థితులు కొన్ని నగరాలను ప్రవాసులకు మరింత ఖరీదైనవిగా చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ వరుసలోనే పూణే ఎనిమిది స్థానాలు ఎగబాకి 205వ, కోల్‌కతా నాలుగు స్థానాలు ఎగబాకి 207వ స్థానానికి చేరుకున్నాయి. ఇక్కడ ఈ ఖర్చులు ఎక్కువ ఆసియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై 21వ స్థానం, ఢిల్లీ 30వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీలో ఈ ఏడాది గృహాల అద్దెలు 12–15 శాతం పెరిగాయి. ముంబైలో 6–8 శాతం, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నైలలో 2–6 శాతం పెరుగుదల నమోదైనట్లు నివేదిక చెబుతున్నది. ఇక ముంబైలో రవాణా ఖర్చులు భారీగా ఉంటున్నాయి. ఆ తర్వాత బెంగళూరు ఉంది.పాల ఉత్పత్తులు, రొట్టెలు, పానీయాలు, నూనెలు, పండ్లు, కూరగాయలు వంటి రోజువారీ నిత్యావసరాల కోసం కోల్‌కతాలో పొదుపుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కేవలం ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు ఢిల్లీలో అత్యంత తక్కువ ధరలకు లభిస్తున్నాయి. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ఖర్చుల్లో మాత్రం ముంబై అందనంత ఎత్తులో ఉంది. దీని వెనుకే చెన్నై ఉంది. ఎనర్జీ, యుటిలిటీ ఖర్చుల్లో ముంబై, పూణేలు భయపెడుతున్నట్లు నివేదిక పేర్కొంది. హాంకాంగ్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాన్ని పరిశీలిస్తే మొదటి ఐదు నగరాలు ర్యాంకింగ్‌లో ఎటువంటి మార్పు కనిపించలేదు. హాంకాంగ్ (చైనా) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, సింగపూర్, జ్యూరిచ్, జెనీవా, బాసెల్, బెర్న్ (స్విట్జర్లాండ్), న్యూయార్క్ సిటీ (యూఎస్), లండన్ (యూకే), నసావు (బహామాస్), లాస్ ఏంజిల్స్ (యూఎస్) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మెర్సర్ సర్వే ప్రపంచ వ్యాప్తంగా 227 నగరాల్లో జీవన వ్యయాన్ని అంచనా వేసింది. గృహనిర్మాణం, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. 2024లో అధిక జీవన వ్యయాన్ని ఖరీదైన గృహ వినియోగం, అధిక రవాణా ఖర్చులు, వస్తువులు, సేవల అధిక ధర, ద్రవ్యోల్బణం, మారకపు రేటు హెచ్చుతగ్గులు, యుటిలిటీలు, స్థానిక పన్నులు, విద్య తీవ్రంగా ప్రభావితం చేసినట్టు వివరించింది. అధిక జీవన వ్యయాలకు ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ నగరం ఈ జాబితాలో ఏడో స్థానాన్ని పొందింది. ఆసియా–పసిఫిక్ ప్రాంతాల్లోని నగరాలు టాప్–10లో ఎక్కువ సంఖ్యలో ఉండడం విశేషం. ఇందులో టోక్యో 5వ, బీజింగ్ 9వ స్థానంలో ఉన్నాయి. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఇవే! భారత్ నుంచి మాత్రం..
లండన్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్ అగ్రభాగంలో నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయం ఆధారంగా చేసుకొని లండన్‌కు చెందిన ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) 172 నగరాల జాబితాను రూపొందించింది.ఈ నగరాల్లో గత ఏడాదితో పోల్చి చూస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ సగటున 8.1% పెరిగినట్టు తాను విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరం గత ఏడాది మొదటి స్థానంలో ఉంటే ఈ సారి మూడో స్థానానికి తగ్గింది. ఆసియా దేశాల్లో ఏడాదిలో జీవన వ్యయం సగటున 4.5% పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. న్యూయార్క్, సింగపూర్ మొదటి స్థానాన్ని పంచుకుంటే నాలుగో స్థానంలో హాంకాంగ్, లాస్ఏంజెలెస్ నిలిచాయి. సర్వే ఎలా చేశారంటే.! ప్రపంచవ్యాప్తంగా 172 నగరాల్లోని 200కిపైగా నిత్యావసర వస్తువుల ధరలు, 400 వరకు రవాణా, వైద్య చికిత్స వంటి సేవల ధరల్ని పోల్చి చూస్తూ ఈ జాబితాను రూపొందించారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ సర్వే నిర్వహించినట్టుగా ఈఐయూ సంస్థ చీఫ్ ఉపాసన దత్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు, చైనాలో జీరో కోవిడ్ విధానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వస్తు సామాగ్రి రవాణాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగిపోయాయని , గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఎప్పుడూ చూడలేదని ఆమె తెలిపారు. అమెరికాలో ధరాభారం విపరీతంగా పెరిగిపోవడంతో ఆ దేశంలోని మూడు నగరాల్లో మొదటి పది స్థానాల్లో నిలిచాయని ఉపాసన వివరించారు. మన నగరాలు చౌక ఇక భారత్‌లోని నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువని ఈ సర్వేలో తేలింది. మొత్తం 172 దేశాలకు గాను మన దేశంలో బెంగుళూరు 161 స్థానంలోనూ చెన్నై 164, అహ్మదాబాద్ 165 స్థానంలోనూ నిలిచాయి. అత్యంత చౌక నగరాలుగా సిరియా రాజధాని డమాస్కస్, లిబియాలోని ట్రిపోలీ అట్టడుగున వరసగా 172, 171 స్థానాల్లో నిలిచాయి. టాప్–10 ఖరీదైన నగరాలు ఇవే 1. న్యూయార్క్ (అమెరికా) 1. సింగపూర్ 3. టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) 4. హాంకాంగ్ 4. లాస్ ఏంజెలెస్ (అమెరికా) 6. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) 7. జెనీవా ( స్విట్జర్లాండ్) 8. శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా) 9. పారిస్ (ఫ్రాన్స్) 10. కోపెన్హగెన్ (డెన్మార్క్) 10. సిడ్నీ (ఆస్ట్రేలియా) -
బ్రిటన్ సంక్షోభం.. తిండికి దూరంగా లక్షల మంది!
లండన్: బ్రిటన్ ఆర్థిక సంక్షోభం.. నానాటికీ దిగజారుగుతోంది. ప్రధాని లిజ్ ట్రస్ నిర్ణయంతో పతనం దిశగా దేశం పయనిస్తోందని సొంత పార్టీ సభ్యులే విమర్శిస్తున్నారు. తాజాగా హోం సెక్రెటరీ సుయెల్లా బ్రేవర్మన్ తప్పుకోగా.. రాజీనామా లేఖలో ఆమె ఆర్థిక సంక్షోభ విషయంలో యూకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా నిప్పులు చెరిగారు. బ్రిటన్‌లో లక్షలాది మంది ఈ జీవన వ్యయ సంక్షోభాన్ని(Cost Of Living Crisis) నుంచి గట్టెక్కేందుకు భోజనాన్ని దాటవేస్తున్నారట. ఇక ఇంధన పేదరికం ఇది వరకే అంచనా వేసినట్లుగా తీవ్ర రూపం దాలుస్తోంది. చాలావరకు ఇళ్లలో విద్యుత్, హీటర్ ఈ విషయాలను విచ్ (Which?) అనే వినియోగదారుల సంస్థ తన సర్వే ద్వారా వెల్లడించింది. మూడు వేల మందిని సర్వే చేసిన ఈ సంస్థ.. ఆ అంచనా ఆధారంగా సగం యూకే ఇళ్లలో ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది. ఒక్కపూట భోజనానికి దూరం కావడం మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన ఆహారం విషయంలోనూ ఆర్థిక కష్టాల ప్రభావం కనిపిస్తోంది. బ్రిటన్ వాసులు(80 శాతం దాకా) హెల్తీ మీల్స్‌కు దూరంగా ఉంటున్నారని విచ్ ప్రతినిధి సూ డేవీస్ చెప్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ దేశంలో ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 10.1 శాతానికి చేరుకుంది. ఇదిగాక.. ఇంధన ధరల ప్రభావంతో లక్షల ఇళ్లపై పడిందని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో సరఫరా వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పెచ్చుమీరింది. లో ఇన్కమ్ కేటగిరీలో.. ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబం ఆహార కొరత సమస్యతో అతలాకుతలమవుతోంది. 2022వ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఆహార సంక్షోభం కనిపించింది. అయితే సెప్టెంబరులో 18 శాతం కుటుంబాలు తమ ఆహార వినియోగాన్ని తగ్గించుకోవలసిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ప్రధాని లిజ్ ట్రస్ ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్లో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదీ చదవండి: బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు! -
దేశంలోనే.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు తక్కువే!
ముంబై: ముంబై అధిక ఖర్చుతో కూడుకున్న మెట్రోగా, హైదరాబాద్‌ను చౌకగా ప్రవాస భారతీయులు భావిస్తున్నారు. జీవన వ్యయాలు, నివాసానికి అయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ముంబైకి ఈ రేటింగ్ ఇచ్చారు. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ముంబై, ఢిల్లీ వ్యయాల పరంగా ఆకర్షణీయంగా ఉన్నట్టు ‘మెర్సర్స్ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’లో తెలిసింది. అంతర్జాతీయంగా చూస్తే ముంబై ర్యాంకు 127. ఢిల్లీ 155, చెన్నై 177, బెంగళూరు 178, హైదరాబాద్ 192వ స్థానంలో ఉన్నాయి. పుణె 201, కోల్‌కతా 203 ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ పట్టణాల్లో నివాస, జీవన వ్యయాలు చౌకగా ఉన్నాయని ప్రవాసులు భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయంగా హాంగ్‌కాంగ్ అత్యంత ఖర్చుతో కూడుకున్న నగరంగా నిలిచింది. ఆ తర్వాత జ్యురిచ్, జెనీవా, స్విట్జర్లాండ్‌లోని బాసెల్, బెర్న్, ఇజ్రాయెల్ టెల్ అవీవ్, అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్, టోక్యో, బీజింగ్ నగరాలు అధిక వ్యయాలతో అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో మెర్సర్స్ ఈ సర్వే నిర్వహించింది. 200కు పైగా కమోడిటీల ధరలు, ఇళ్లు, రవాణా, ఆహారం, వస్త్రాలు, ఇంట్లోని వస్తువులు, వినోదానికి చేసే ఖర్చు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 227 పట్టణాలను ర్యాంకుల్లోకి తీసుకుంది. హైదరాబాద్ అనుకూలతలు ప్రముఖ బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముంబైని అత్యంత అనుకూల నగరంగా భావిస్తున్నాయి. అదే సమయంలో తక్కువ వ్యయాలు ఉండే హైదరాబాద్, చెన్నై, పుణె పట్ల కూడా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముంబైలో అధిక వ్యయాలు ఉండడంతో.. హైదరాబాద్, చెన్నై, పుణె నగరాలు తక్కువ వ్యయాలతో ఆకర్షణీయమైన మెట్రోలుగా సర్వే పేర్కొంది. కోల్‌కతాలో జీవన వ్యయాలు తక్కువగా ఉన్నాయి. పాలు, బ్రెడ్, కూరగాయలు, పండ్లను ధరలను పరిగణనలోకి ఈ ర్యాంకులను నిర్ణయించారు. ఢిల్లీ, ముంబైలో మాత్రం వీటి ధరలు అధికంగా ఉన్నాయి. ముంబైలో అధిక వ్యయాలు ఉంటే, చెన్నై, హైదరాబాద్‌లో తక్కువగా ఉన్నాయి. సినిమా చూడాలంటే ముంబైలో చాలా ఖర్చు చేయాలి. హైదరాబాద్‌లో సినిమా చూసేందుకు చేసే ఖర్చు తక్కువ. ఇళ్ల ధరలు తక్కువ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోకి హైదరాబాద్, ఇళ్ల ధరల పరంగా చౌకగా ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. కానీ, జీవన వ్యయాలు, నివాస వ్యయాలు (ఇళ్ల అద్దెలు/ధరలు) కలిపి చూస్తే పుణె, కోల్‌కతా కంటే హైదరాబాద్ వెనుక ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఇళ్ల అద్దెలు దేశంలోనే అత్యంత ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ జీవన వ్యయాలు చాలా ఎక్కువ ఖర్చుతో కూడినవిగా సర్వే పేర్కొంది. చదవండి👉 తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్, ఆ ప్రాంతంలోని ఇళ్లకు భారీ డిమాండ్! -
జీవన వ్యయంలో విశాఖ బెస్ట్
సాక్షి, అమరావతి: ఉపాధి, ఉద్యోగాల కోసం నగరాలకు వలసపోయే సామాన్య, పేద వర్గాలు ముందుగా అడిగేది అక్కడి ప్రజల జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) గురించే. జీవనవ్యయం ఎక్కువగా ఉన్న నగరాల్లో వచ్చే జీతంలో మూడోంతులు ఖర్చులకే పోతుంటే.. ఇక పేదవాడి కష్టాలు చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని 352 నగరాల్లో ప్రజల జీవన వ్యయంపై ‘నంబియో’ సంస్థ నిర్వహించిన సర్వేలో మన రాష్ట్రానికి చెందిన విజయవాడ, విశాఖపట్నంలలో తక్కువ జీవన వ్యయంతో సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయని తేలింది. మన దేశంలోని నగరాల్లో జీవన వ్యయం అంతకంతకూ పెరుగుతున్నా, ప్రపంచంలోని ఇతర నగరాలతో పోల్చినప్పుడు సామాన్యుడికి కాస్త అందుబాటులో ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. నివేదికలో విజయవాడ, విశాఖపట్నం నగరాలకు 350, 351 ర్యాంకులు దక్కగా.. ముంబై 316, ఢిల్లీ 323, బెంగుళూరు 327, పూణె 328, హైదరాబాద్ 333, చెన్నై 334, కోల్‌కతాలు 336 ర్యాంకుల్లో నిలిచాయి. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, బేసల్, లాసన్నె, జెనీవా, బెర్న్ నగరాలు అత్యధిక జీవన వ్యయంతో జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. విశాఖ నగరం ఎలా అంచనా వేశారు? న్యూయార్క్ నగర జీవన వ్యయం ప్రాతిపదికగా ఇతర నగరాల స్థాయిని నిర్ణయించారు. ఇందుకోసం నిత్యవసర వస్తువులు, ఆభరణాల ధరలు, రెస్టారెంట్లలో రేట్లు, రవాణా, ఇతర అవసరాల ధరల్ని లెక్కించి న్యూయార్క్ నగరం సూచీని వందగా అంచనా వేశారు. ఆ ధరల్ని ఇతర నగరాల ధరలతో పోల్చి ర్యాంకింగ్ నిర్ధారించారు. ఉదాహరణకు జెనీవా ధరలను న్యూయార్క్‌తో పోల్చగా.. సూచీ 121 శాతంగా వచ్చింది. అంటే జెనీవాలో న్యూయార్క్ కంటె జీవన వ్యయం 21 శాతం ఎక్కువ. పారిస్ నగరం ఇండెక్స్ 85 శాతం కాగా న్యూయార్క్ కంటే అక్కడ 15 శాతం తక్కువగా జీవనవ్యయం ఉన్నట్లు లెక్కించారు. విజయవాడ, విశాఖపట్నంలో సూచీలు 21.64, 21.21 శాతంగా ఉండడంతో న్యూయార్క్ కంటే ఈ రెండు నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ 78.36, 78.79 శాతం తక్కువ ఉందని తేల్చారు. అద్దెల్లో మాత్రం రివర్స్ విజయవాడలో జీవన వ్యయం తక్కువగా ఉన్నా అద్దెల్లో ఎక్కువగా ఉన్నాయి. అద్దెల్లో విజయవాడ సూచీ 5.01 శాతంగా ఉండగా.. విశాఖ నగరానికి 4.07గా వచ్చింది. లక్నో, సూరత్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, కోయంబత్తూర్, జైపూర్ నగరాల్లో అద్దె విజయవాడలో కంటే తక్కువగా ఉంది. ఇక్కడి వరకూ ఇదే ఎక్కువ అంతర్జాతీయ స్థాయిలో మన నగరాల్లో జీవన వ్యయం తక్కువున్నా, ఇక్కడి పరిస్థితులతో పోల్చితే అది చాలా ఎక్కువ. పేదలకు ఈ నగరాలు అందుబాటులో లేవు. –డాక్టర్ రామనాథ్ ఝా, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ రీసెర్చ్ ఫెలో -
బెంగళూరులో చౌకగా బతికేయొచ్చట!
లండన్: ప్రపంచంలోని అత్యంత చౌకైన నగరాల జాబితాలో బెంగళూరుకు చోటు దక్కింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతో బతికేయగల 10 నగరాల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఇందులో వెనిజులా రాజధాని కరాకస్ మొదటి స్థానాన్ని సంపాదించుకోగా సిరియా రాజధాని డమాస్కస్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్ నుంచి 3 నగరాలు చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు 5వ స్థానంలో ఉండగా చెన్నై, ఢిల్లీ 8, 10వ స్థానాల్లో నిలిచాయి. 2019 సంవత్సరానికిగాను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, జీవన వ్యయం ఆధారంగా ఈ జాబితాను తయారు చేసింది. కాగా బెంగళూరును చౌకైన నగరంగా గుర్తించడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ, చెన్నై నగరాల కన్నా బెంగుళూరు అత్యంత ఖరీదైన నగరమని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచంలోని అత్యంత చౌకైన నగరాలు 1. కరాకస్ (వెనెజులా) 2. డమాస్కస్ (సిరియా) 3. తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్) 4. అల్మాటి (కజకిస్థాన్) 5. బెంగళూరు (భారత్) 6. కరాచి (పాకిస్తాన్) 6. లాగోస్ (నైజీరియా) 8. బ్యూనస్ ఐరిస్(అర్జెంటీనా) 8. చెన్నై (భారత్) 10. న్యూఢిల్లీ (భారత్) -
భారత్ లోనే 4 ప్రపంచ చవకైన నగరాలు...
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత తక్కువ ఖర్చుతో నివాసయోగ్యానికి వీలున్న నగరాల టాప్ టెన్ జాబితాలో నాలుగు భారత్ నగరాలు చోటుదక్కించుకున్నాయి. మొత్తంగా ఈ జాబితాలో ప్రపంచంలోనే మోస్ట్ చీపెస్ట్ సిటీగా జింబాబ్వే లోని లుసాకా నగరం నిలిచింది. ఇండియా టెక్నాలజీ కేంద్రంగా పిలుచుకునే కర్ణాటక లోని బెంగళూరు నగరం భారత్ నుంచి తొలిస్థానం సాధించగా, ఓవరాల్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ముంబై మూడో స్థానం, చెన్నై ఆరో స్థానం, న్యూఢిల్లీ ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. 160 రకాల ప్రాడక్ట్స్, సర్వీసులు, 400 రకాల వస్తువుల ధరలను పోల్చిచూసి ఫార్ట్యూన్.కామ్ ఈ వివరాలు వెల్లడించింది. చీపెస్ట్ సిటీస్ టాప్ టెన్ లిస్ట్: 1. లుసాకా 2. బెంగళూరు 3. ముంబై 4. అలమాటి 5. అల్జీర్స్ 6. చెన్నై 7. కరాచీ 8. న్యూఢిల్లీ 9. డమాస్కస్ 10. కరాకస్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముచ్చటగా మూడోసారి సింగపూర్ నగరం తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జ్యూరిచ్, హాంకాంగ్, జెనీవా, ప్యారిస్ నగరాలు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. అయితే గతేడాది 22వ స్థానంలో ఉన్న న్యూయార్క్ నగరం మాత్రం ఈ ఏడాది ఏడో స్థానానికి ఎగబాకి.. మొదటి పది నగరాల్లో చోటు సంపాదించింది. హై కాస్ట్ సిటీస్ టాప్ టెన్ లిస్ట్: 1. సింగపూర్ 2. జ్యూరిచ్ 3. హాంకాంగ్ 4. జెనీవా 5. ప్యారిస్ 6. లండన్ 7. న్యూయార్క్ 8. కోపెన్ హాగెన్ 9. సియోల్ 10. లాస్ ఏంజిలెస్