భారత్ లోనే 4 ప్రపంచ చవకైన నగరాలు...
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత తక్కువ ఖర్చుతో నివాసయోగ్యానికి వీలున్న నగరాల టాప్ టెన్ జాబితాలో నాలుగు భారత్ నగరాలు చోటుదక్కించుకున్నాయి. మొత్తంగా ఈ జాబితాలో ప్రపంచంలోనే మోస్ట్ చీపెస్ట్ సిటీగా జింబాబ్వే లోని లుసాకా నగరం నిలిచింది. ఇండియా టెక్నాలజీ కేంద్రంగా పిలుచుకునే కర్ణాటక లోని బెంగళూరు నగరం భారత్ నుంచి తొలిస్థానం సాధించగా, ఓవరాల్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ముంబై మూడో స్థానం, చెన్నై ఆరో స్థానం, న్యూఢిల్లీ ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి. 160 రకాల ప్రాడక్ట్స్, సర్వీసులు, 400 రకాల వస్తువుల ధరలను పోల్చిచూసి ఫార్ట్యూన్.కామ్ ఈ వివరాలు వెల్లడించింది.
చీపెస్ట్ సిటీస్ టాప్ టెన్ లిస్ట్:
1. లుసాకా
2. బెంగళూరు
3. ముంబై
4. అలమాటి
5. అల్జీర్స్
6. చెన్నై
7. కరాచీ
8. న్యూఢిల్లీ
9. డమాస్కస్
10. కరాకస్
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముచ్చటగా మూడోసారి సింగపూర్ నగరం తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జ్యూరిచ్, హాంకాంగ్, జెనీవా, ప్యారిస్ నగరాలు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. అయితే గతేడాది 22వ స్థానంలో ఉన్న న్యూయార్క్ నగరం మాత్రం ఈ ఏడాది ఏడో స్థానానికి ఎగబాకి.. మొదటి పది నగరాల్లో చోటు సంపాదించింది.
హై కాస్ట్ సిటీస్ టాప్ టెన్ లిస్ట్:
1. సింగపూర్
2. జ్యూరిచ్
3. హాంకాంగ్
4. జెనీవా
5. ప్యారిస్
6. లండన్
7. న్యూయార్క్
8. కోపెన్ హాగెన్
9. సియోల్
10. లాస్ ఏంజిలెస్