కొనసాగుతున్న ఎస్కేయూసెట్ కౌన్సెలింగ్
ఎస్కేయూ : పీజీ ప్రవేశాలు నిమిత్తం నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్ –2017 సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. రూరల్ డెవలప్మెంట్ విభాగంలో 185 మంది విద్యార్థులకు గాను, 87 మంది, సోషల్ వర్క్‌లో 204 మందికి గాను 104 మంది, సోషియాలజీ విభాగానికి 69 మంది అభ్యర్థులకు గాను 40 మంది, తెలుగు విభాగంలో 278 మందికి గాను 166 మంది అభ్యర్థులు ఆదివారం హాజరైనట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. 30న ప్రత్యేక కేటగిరి అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకవాలని కోరారు.