cotton price hikes
-
స్వల్పంగా పెరిగిన పత్తి ధర
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. గత శుక్రవారం క్వింటాల్‌కు రూ.7,900 పలుకగా, సోమవారం రూ.100 పెరిగి గరిష్ట ధర రూ.8,000 పలికింది. మార్కెట్‌కు 66 వాహనాల్లో 1,027 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకురాగా క్వింటాల్‌కు మోడల్ ధర రూ.7,900, కనిష్ట ధర రూ.7,000 చెల్లించారు. గన్నీ సంచుల్లో ఐదుగురు రైతులు 5 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకురాగా క్వింటాల్‌కు గర్టిష్ట ధర రూ.7,300, మోడల్ ధర రూ.7,000, కనిష్ట ధర రూ.6,000 పలికింది. మార్కెట్లో క్రయ విక్రయాలను కార్యదర్శి గూగులోతు రెడ్డినాయక్ పర్యవేక్షించారు. -
మెరిసిన తెల్లబంగారం
జడ్చర్ల, న్యూస్‌లైన్: ఇన్నాళ్లూ మసకబారిన తెల్లబంగారానికి వన్నె వస్తోం ది. పత్తిధరలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతుండటంతో రైతన్న ముఖా ల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బుధవారం బాదేపల్లి మార్కెట్లో పత్తి క్వింటాలు కు రూ.5072 పలికింది. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి పత్తి మార్కెట్‌కు ఐ దువేల క్వింటాళ్ల పత్తి విక్రయానికి రావడం తో ఆవరణమంతా బస్తాలతో నిండిపోయిం ది. క్వింటాలుకు గరిష్టంగా రూ.5072 ధర పలకగా, కనిష్టంగా రూ.4209 ధర లభిం చింది. గత శనివారం మార్కెట్లో పత్తికి గరి ష్టంగా రూ.4869 ధర లభించింది. కాగా పత్తి కి గరిష్టంగా ఇంతధర రావడం ఈ సీజన్లో ఇదే మొదటిసారి. గతేడాది కూడా ఇంత ధర లు మార్కెట్లో లభించలేదు. ప్రభుత్వం ప త్తికి గరిష్టంగా రూ.4000, కనిష్టంగా రూ. 3800 మద్దతుధరలను కేటాయించింది. అయితే ఇక్కడి మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధరలను మించి రికార్డుస్థాయిలో పత్తికి ధర లభిస్తుండటంతో రై తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇది వరకే అమ్ముకున్న రైతులు మాత్రం ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ ఏడాది పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిన నేపథ్యం లో రైతుల దగ్గర ఇక పత్తి నిల్వలు లేవని భావించిన వ్యాపారులు పోటీపడి ధరలను పెంచినట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్క రోజే మార్కెట్లో రూ.2.25కోట్ల పత్తి వ్యాపారం జరిగింది. దీంతో యార్డుకు రూ.2.25లక్షల ఆదాయం ఒక్కరోజే లభించిందని యార్డు అధికారులు పేర్కొన్నారు. మున్ముందు కూడా ఇవే ధరలు ఉంటాయో లేదో వేచిచూడాలి.