
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. గత శుక్రవారం క్వింటాల్‌కు రూ.7,900 పలుకగా, సోమవారం రూ.100 పెరిగి గరిష్ట ధర రూ.8,000 పలికింది. మార్కెట్‌కు 66 వాహనాల్లో 1,027 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకురాగా క్వింటాల్‌కు మోడల్ ధర రూ.7,900, కనిష్ట ధర రూ.7,000 చెల్లించారు. గన్నీ సంచుల్లో ఐదుగురు రైతులు 5 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకురాగా క్వింటాల్‌కు గర్టిష్ట ధర రూ.7,300, మోడల్ ధర రూ.7,000, కనిష్ట ధర రూ.6,000 పలికింది. మార్కెట్‌లో క్రయ విక్రయాలను కార్యదర్శి గూగులోతు రెడ్డినాయక్ పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment