కాలం చెల్లిన బీర్ల విక్రయాలు
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌లోని ఓ వైన్స్ దుకాణంలో కాలం చెల్లిన బీర్లు విక్రయించడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం రాత్రి సమయంలో బండలింగాపూర్‌లోని ఓ వైన్స్ దుకాణం వద్దకెళ్లాడు. అక్కడ కేఎఫ్ ఆల్ట్రా, కేఆఫ్ స్ట్రాంగ్ బీర్లు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఓ చోటుకు వెళ్లి కొనుగోలు చేసిన బీర్లను తాగుతున్నారు. ఆ సమయంలో అందులోని కేఎఫ్ ఆల్ట్రా బీరు కాలం చెల్లిన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని మరో వ్యక్తికి తెలియజేయడంతో.. వైన్స్ వద్దకు వెళ్లిన మరొకరు కేఎఫ్ ఆల్ట్రా బీరును మరోమారు కొనుగోలు చేశాడు. రెండో వ్యక్తి కొనుగోలు చేసిన బీరు సైతం కాలం చెల్లినట్లుగా ఉండడంతో వైన్స్ షాపులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో ఆయన ఏమి కాదని నిర్లక్ష్య సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి బీరు తయారీ తేదీ నుంచి ఆరు నెలల్లోపే వినియోగించాలి. ఆ తర్వాత వాటిని వినియోగించొద్దు. అయినా అక్కడి వైన్స్ దుకాణంలో కాలం చెల్లిన బీర్లు విక్రయించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారం ఎకై ్సజ్ అధికారుల దృష్టికి వెళ్లినా.. వైన్స్ దుకాణం వద్దకెళ్లి తనిఖీలు చేయకపోవడం గమనార్హం. ఈ విషయంపై ఎకై ్సజ్ సీఐ వినోద్‌రాథోడ్‌ను వివరణ అడగగా.. ఆయన సెలవుపై వెళ్లినట్లు చెప్పారు. ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఎస్సై సందీప్‌రావును అడగగా.. తమ దృష్టికి వచ్చింది కానీ ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.
కాలం చెల్లిన బీర్ల విక్రయాలు
Comments
Please login to add a commentAdd a comment