Courier Services
-
రవాణా ఛార్జీలు పెంపు!
ప్రముఖ కొరియర్ సర్వీస్ ప్రొవైడర్ బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ రవాణా ఛార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది. 2025 జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న కార్యాచరణ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటనలో స్పష్టం చేసింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..ఎయిర్‌లైన్ నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాలు, ఇన్పుట్ ఖర్చులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా దీర్ఘకాలిక వ్యయాలు అధికం అవుతున్నాయి. దాంతో ప్రస్తుతం ఉన్న రవాణా ఛార్జీలను దాదాపు 9-12 శాతం పెంచాలని నిర్ణయించారు. జనవరి 1, 2025 నుంచి ఈ ధరల పెంపు అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్లూ డార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బాల్ఫోర్ మాన్యుయెల్ మాట్లాడుతూ..‘వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి, వారికి మరింత సమర్థంగా సేవలందించేందుకు ఈ ధరల పెంపు చాలా అవసరం. ఇది కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, అధునాతన సాంకేతికతలను ఉపయోగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: యూఎస్ వెళ్లేవారికి శుభవార్త! 2.5 లక్షల వీసా స్లాట్లు -
లక్షలాది మందికి ఉపాధి లక్ష్యంగా ‘సహకార్’
న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల రంగంలో దేశంలో ఓలా, ఉబర్ పెద్ద ఎత్తున చొచ్చుకుపోయాయి. ఇప్పుడు వీటికి పోటీగా మరో సంస్థ రాబోతోంది. లక్షలాది మందికి ఉపాధి లక్ష్యంగా సహకార్ ట్యాక్సీ పేరుతో నేషనల్ టూరిజం, ట్రాన్స్పోర్ట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఎన్‌ఎఫ్‌టీసీ) సేవలను పరిచయం చేయబోతోంది. కొరియర్ సేవల రంగంలోకి సైతం ప్రవేశించనున్నట్టు ఫెడరేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ధరల కంటే చవకగా ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఎన్‌ఎఫ్‌టీసీ చైర్మన్ వి.వి.పి.నాయర్ వెల్లడించారు. అధిక ప్రయోజనం డ్రైవర్లకు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించే సహకార్ ట్యాక్సీ ద్వారా కొన్నేళ్లలో 10 లక్షలకుపైగా మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎన్‌ఎఫ్‌టీసీ 2011 నుంచి సహకార రంగంలో సేవలు అందిస్తోంది. చదవండి: నితిన్ గడ్కారీ.. హైడ్రోజన్ ఫ్యూయల్‌పై భవీశ్ ఏమన్నాడో విన్నావా? -
ఇక ఆర్టీసీ బస్సుల్లోనే కార్గో బుకింగ్
సాక్షి, అమరావతి: ఇకనుంచి ఆర్టీసీ బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌కు అవకాశం కల్పించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కొరియర్, కార్గో బుకింగ్ చేయాలంటే ఆర్టీసీ బస్ స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏజెంట్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా నిర్ణీత ఆర్టీసీ బస్సు వద్దకే వెళ్లి కొరియర్, కార్గో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 94 ఆర్టీసీ బస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లతోపాటు 422 మంది ఏజెంట్ల ద్వారా కొరియర్, కార్గో బుకింగ్ సేవలు అందిస్తున్నది. రోజుకు సగటున 20,500 బుకింగ్‌ల ద్వారా రూ.40లక్షల రాబడి ఆర్జిస్తోంది. కాగా 2022–23లో రోజుకు సగటున 40వేల బుకింగ్‌లతో రూ.68లక్షలు రాబడి సాధించాలని ఆర్టీసీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250కోట్లు రాబడి సాధించాలన్నది ఆర్టీసీ ప్రణాళిక. రాష్ట్రంలో 672 మండలాల్లోని 14,123 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలు అందిస్తోంది. ఇకనుంచి ఖాతాదారులు సంబంధిత బస్సు వద్దకు వెళ్లి నేరుగా కండక్టర్ వద్దే పార్సిల్ బుకింగ్ చేసుకునే సౌలభ్యం కలిగించనుంది. బుకింగ్ చేసుకున్న తరువాత సత్వరమే పార్సిళ్లు గమ్యస్థానాలకు చేరుతాయి. ఇందుకోసం టిమ్ మెషిన్ల ద్వారా కొరియర్ బుకింగ్ చేయడం, రశీదు ఇవ్వడం, ఇతర అంశాలపై కండక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. కొరియర్ బుకింగ్ మొత్తాన్ని టికెట్ కలెక్షన్ల మొత్తంగా చూపించే వే బిల్లుతో కాకుండా.. విడిగా నమోదు చేస్తారు. కొరియర్ బుకింగ్‌లు బాగా చేసే కండక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలో మొదటగా గుంటూరు జిల్లా ఆర్టీసీ బస్సుల్లోనే కార్గో సేవల బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభిస్తామని, అనంతరం నెలరోజుల్లోనే దశలవారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నామని ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు ‘సాక్షి’కి తెలిపారు. -
TSRTC: అన్నాచెల్లెళ్లకు వారధిగా ఆర్టీసీ
సాక్షి, ఖమ్మం: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రజలకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందించనుంది. సోదరులకు రాఖీలు, మిఠాయిలు పంపించే సోదరీమణులు కరోనా సమయంలో ఇబ్బంది పడకుండా ఖమ్మం బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. టీఎస్ ఆర్టీసీ పార్సిల్, కొరియర్, కార్గో సర్వీస్ ద్వారా రాఖీలను పంపించే సౌకర్యం కల్పించారు. అతితక్కువ ఖర్చుతో ఆత్మీయులకు రాఖీలు పంపుకోవచ్చునని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇంటి వద్దే డెలివరీ వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మం నగరానికి రాఖీలు పంపిస్తే, ఇక్కడ ఇంటి వద్దే డెలివరీ చేయనున్నారు. అలాగే, హైదరాబాద్, సికింద్రాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మిర్యాలగూడెం తదితర నగరాలకు పంపించినా ఇంటి వద్దే అందజేస్తామని అధికారులు తెలిపారు. తక్కువ చార్జీలతో.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల ద్వారా అతితక్కువ చార్జీతో రాఖీలు పంపుకోవచ్చు. తెలంగాణ పరిధిలో 250 గ్రాములలోపు రూ.30, 251 నుంచి 500 గ్రా. లోపు రూ.40, 501 నుంచి 1000 గ్రా. లోపు బరువైతే రూ.60 చెల్లిస్తే సరిపోతుంది. ఇతర రాష్ట్రాలకు 250 గ్రాముల లోపు రూ.75, 251 నుంచి 500 గ్రాములలోపు రూ.100, 501 నుంచి 1000 గ్రాముల లోపైతే రూ.125కు చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ప్రాంతాలకు రాఖీలను పంపించే వెసలుబాటు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఖమ్మం రీజనల్ మేనేజర్ సాల్మన్ తెలిపారు. కాగా, రాఖీలతో పాటు స్వీట్లు పార్సిల్, కొరియర్ ద్వారా పంపించే వారి కోసం ఖమ్మం బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేశామని వెల్లడించారు. -
రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి
హిమాయత్‌నగర్: తనకు రావాల్సిన రూ.300 కోసం కొరియర్ సంస్థకు ఫిర్యాదు చేసిందో యువతి. ఇదే అదునుగా భావించిన సదరు సంస్థ ప్రతినిధి యువతి వద్ద నుంచి రెండు దఫాలుగా రూ.1.90లక్షలు కాజేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో బంజారాహిల్స్‌కు చెందిన ఉషారాణి శనివారం సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... ఉషారాణి ఆన్లైన్లో ఒక ఐటెమ్ బుక్ చేసింది. ఐటెంకు సంబంధించిన డబ్బు ఇచ్చాక, కొరియర్ బాయ్ తిరిగి ఇవ్వాల్సిన రూ.300 ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సదరు సంస్థ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఉషారాణికి ఒక అప్లికేషన్‌ను పంపి దానిని ఫిల్ చేసి తమకు ఆన్లైన్ ద్వారా పంపితే మీ డబ్బులు మీకు వస్తాయన్నారు. అతను చెప్పినట్టు చేయగా... రూ.300 రాకపోగా ఆమె అకౌంట్ నుంచి తొలుత రూ.91వేలు కట్ అయ్యాయి. ఎందుకు ఇలా జరిగిందని మరోమారు అతనికి ఫోన్ చేయగా..మీరు తప్పుగా ఎంట్రీ చేశారు మళ్లీ ఫిల్ చేసి పంపండి.. ఇంకో అకౌంట్ నంబర్ ఇవ్వండన్నాడు. మరోసారి కూడా అలాగే పంపంగా, ఆ అకౌంట్ నుంచి కూడా రూ.99వేలు కాజేశాడు. చదవండి: దారుణం: అడ్డుగా ఉందని చంపేశాడు -
ఇక ఆర్టీసీ పార్శిల్ సర్వీస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సొంతంగా పార్శిల్, కొరియర్ సేవలు ప్రారంభించింది. ఇప్పటికే సరుకు రవాణాకు కార్గో బస్సులను రంగంలోకి దింపిన ఆర్టీసీ.. దానికి అనుబంధంగా పార్శిల్, కొరియర్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్ ప్రాంగణంలో వీటిని ప్రారంభించారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో పార్శిళ్ల తరలింపు ఉండేది. ఓ ప్రైవేటు సంస్థ ఆ వ్యవహారాన్ని చూసుకునేది. ఆ సంస్థ ఆర్టీసీకి నామమాత్రంగా రుసుము చెల్లించి రూ.కోట్లలో ఆదాయాన్ని పొందుతూ వచ్చింది. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో పార్శిళ్ల తరలింపును సొంతంగా నిర్వహించి ఆదాయాన్ని పెంచుకోవాలని సీఎం కేసీఆర్ గతం లో ఆదేశించారు. దీంతో మంత్రి అజయ్‌కుమార్ పాత ఒప్పందాలు రద్దు చేయించి పార్శిళ్లు, కొరియర్ సేవలను ఆర్టీసీ సొంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అన్ని బస్సుల్లోనూ సరుకుల తరలింపు... పల్లెవెలుగు మొదలు అన్ని కేటగిరీ ఆర్టీసీ బస్సుల్లో సరుకులు తరలించనున్నారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో దిగువ భాగాన డిక్కీలుండగా, పల్లెవెలుగు బస్సుల్లో కొత్తగా డ్రైవర్ సీటు పక్క ఉండే సింగిల్ సీటు తొలగించి బాక్సు ఏర్పాటు చేశారు. అందు లో సరుకులు తరలిస్తారు. గరిష్టంగా ఓ వ్యక్తి 50 కిలోల వరకు పంపించొచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే 50 కిలోల చొప్పున విభజించి పంపించాల్సి ఉంటుంది. 180 కిలోమీటర్లకు 50 కిలోల పార్శిల్ తరలింపునకు క్లరికల్, హమాలీ, ఇన్సూరెన్స్ తదితర ఖర్చులన్నీ కలిపి రూ.165 వరకు చార్జీ చేస్తారు. కిలోమీటర్లు, బరువు పెరిగే కొద్దీ చార్జీ కూడా పెరుగుతుంది. ప్రస్తుతానికి బస్టాండుకు సరుకులు తీసుకెళ్లి అందిస్తే, గమ్యస్థానంలోని బస్టాండు వరకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సంబంధిత వ్యక్తులు వచ్చి తమ సరుకులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరో 15 రోజు ల్లో ఆథరైజ్ట్ బుకింగ్ డీలర్లు, ఉత్సాహం ఉన్న ఆర్టీసీ సిబ్బంది ద్వారా ఇళ్లకే వచ్చి సరుకులు తీసుకెళ్లి, గమ్యస్థానంలోని ఇళ్లకు చేర్చే ప్రక్రియ మొదలుపెడతారు. ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని ఆర్టీసీ యోచిస్తోం ది. ప్రస్తుతం 140 బస్టాండ్లలో ఈ సేవలు ప్రారంభించారు. చార్జీల వివరాలను ఆర్టీసీ వెబ్సైట్లో పొందుపరిచారు. పార్శిల్, కొరి యర్ విభాగం బాధ్యతలను మంత్రి ఓఎస్డీ కృష్ణకాంత్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమం లో ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు వినోద్, వెంకటేశ్వర్లు, టీవీరావు, పురుషోత్తం, యాదగిరి, ప్రత్యేకాధికారి కృష్ణకాంత్ పాల్గొన్నారు. మెరుగ్గా నిర్వహిస్తే మంచి ఆదాయం ‘ప్రభుత్వ కార్పొరేషన్లకు సంబం ధించి సరుకులు తరలించేందుకు ఇటీవలే కార్గో సేవలను ప్రారంభించిన ఆర్టీసీ.. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు పార్శిల్ సేవలను కూడా మొదలుపెట్టింది. దీన్ని మెరుగ్గా నిర్వహించటం ద్వారా సాలీనా రూ.180 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఆదాయాన్ని పొందే వీలుంటుంది. కొద్ది రోజుల్లోనే సిబ్బంది ఇళ్లకే వచ్చి సరుకులు తీసుకెళ్లి గమ్యం చేర్చేలా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను సిద్దం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ–కామర్స్ విధానం ద్వారా సరుకుల తరలింపు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో అన్ని ఊళ్లకు అనుసంధానమై ఉన్న ఆర్టీసీ బస్సులను ఆయా సంస్థలు సరుకుల తరలింపునకు వాడుకోవాలి’ – పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి ఖైరతాబాద్‌లో ట్రాన్స్‌పోర్టు భవన్ ప్రాంగణంలో ఆర్టీసీ పార్శిల్ కొరియర్ సేవల్ని ప్రారంభిస్తున్న మంత్రి పువ్వాడ -
‘గరుడవేగ’తో 5-8రోజుల్లో సరుకులు అమెరికాకు..
సాక్షి, హైదరాబాద్ : వినాయక చవితిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులందరికీ గరుడవేగ కొరియర్ సర్వీసెస్ శుభాకాంక్షలు తెలిపింది. మనోహరమైన వినాయక విగ్రహాలను ఈ ఏడాది అట్లాంటా, సియాటిల్, కాలిఫోర్నియాలోని దేవాలయాలకు గరుడవేగ ద్వారా పంపించడం ఆనందదాయకంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. వినియోగదారులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఈ ప్రేమ ఎల్లవేళలా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. కాగా అమెరికా, ఇంగ్లండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు మధ్య తూర్పులోని ఇతర దేశాలతో కలిపి, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలకు ఎంతో నమ్మకమైన, చురుకైన సేవలను గరుడవేగ అందిస్తోంది. బహుళ ప్రజాదరణ పొందిన "ఎక్స్‌ప్రెస్" సర్వీస్‌తో పాటు, అమెరికాకు కేజీ ఒక్కింటికి కేవలం నాలుగువందల రూపాయల రుసుముతో (50 కేజీలు అంతకు పైగా వున్న పార్సళ్ళకు), అతి సులభంగా సరుకులను పంపే సదుపాయం కల్పిస్తోంది. ఈ సరుకులు 5 నుంచి 8 రోజులలోపు అమెరికాలో ఉన్న మీ బంధువులకు చేరతాయి. మరిన్ని వివరాలకోసం గరుడవేగ ఏజెంట్లను సంప్రదించవచ్చు. అదే విధంగా "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపే సదుపాయాన్ని గరుడవేగ కల్పిస్తోంది. తద్వారా పండుగ సమయాలలో, తాము దూరంగా ఉన్నప్పటికీ, తమవారిని తలుచుకుని, వారికి కానుకలు పంపి వారిని ఆనందింపజేయవచ్చు. ఇలా వేల మైళ్ళ దూరంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిపే ఈ సర్వీస్ ద్వారా, ప్రేమను, ఆప్యాయతను పంచడం తమకు ఎంతో సంతృప్తినిస్తోందని గరుడవేగ తెలిపింది. గ్రాండ్ స్వీట్స్, శ్రీకృష్ణ, అడయార్ ఆనందభవన్ వంటి ప్రసిద్ధి చెందిన తమిళనాడు స్వీట్ సంస్థల నుంచి కూడా ఇప్పుడు మీరు గరుడవేగ ద్వారా, నేరుగా మీ ఇంటికి స్వీట్లు తెప్పించుకోవచ్చని సూచిస్తోంది. -
పిన్నీస్ జిందాబాద్!
‘‘ఈ జిప్పులు వచ్చి పోస్టాఫీసుల పొట్టగొట్టాయిరా... జిప్పుల వల్ల మన పోస్టాఫీసులు క్రమంగా అంతరించిపోయాయి’’ అన్నాడు అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘పొంతన లేకుండా మాట్లాడకు. పోస్టాఫీసులు అంతరించిపోవడానికి కొత్తగా వచ్చిన కొరియర్ సర్వీసులు కారణం కదా. వాటికీ జిప్పులకూ లింకు పెడతావేమిట్రా నువ్వు?’’ అడిగాను. ‘‘కాదురా... నేను మాట్లాడేది మన సొంత పోస్టాఫీసుల గురించి’’ అన్నాడు వాడు. ‘‘నీకు మతి పోయింది. సొంత పోస్టాఫీసులు ఏమిట్రా... నీ ముఖం. అసలు పోస్టాఫీసులు సెంట్రల్ గవర్నమెంటు కిందికి వస్తాయి. ఒక తరం కింది వరకూ ఎందరికో అత్యద్భుతమైన జ్ఞాపకాలూ, అనుభూతులూ పంచిన వాటి గురించి అజ్ఞానంతో మాట్లాడకు’’ అని కోప్పడ్డాను నేను. ‘‘నీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో మన నిక్కర్లకు జిప్పులుండేవి కావు. అలా జిప్పులు కనిపెట్టని ఆ రోజుల్లో నిక్కరుకు మూడు గుండీలే ఉండేవి. ఉన్న మూడింట్లో ఒకటో రెండో కొన్నాళ్లకి తప్పక ఊడిపోయేవి. ఆ ఖాళీ భర్తీ చేయడానికి మా అమ్మ అక్కడ పిన్నీసు పెట్టేది. పిన్నీసు పెట్టుకోకపోతే అందరూ ‘పోస్టాఫీస్’ అనో ‘టప్పా ఖానా’ అనో వెక్కిరించేవాళ్లు. పిన్నీసు పెట్టే ముందు అది గుచ్చుకుంటుందేమో అని కడుపులో భయం. అబ్బ... నువ్వు ఎన్నైనా చెప్పురా జిప్పుల ఆవిర్భావ కాలానికి ముందు పిన్నీసులదే స్వర్ణ యుగంరా. జిప్పులు వచ్చాయి. అటు పిన్నీసులూ... ఇటు పోస్టాఫీసులూ... ఇలా రెండూ అంతరించిపోయాయి. అప్పటి చిన్నారుల మాన సంరక్షణ విషయంలోనే కాదురా... పిన్నీసులు కొంత భాషా సేవ కూడా చేశాయి’’ అన్నాడు వాడు. ‘‘పిన్నీసులు చేసిన భాషా సేవ ఏమిట్రా’’ అయోమయంగా అడిగా. ‘‘ముల్లును ముల్లుతోనే తీయాలి అని సామెత. అప్పట్లో పొలాల గట్ల మీద నడిచే రోజుల్లో ముళ్లు గుచ్చుకోవడం చాలా మామూలు విషయం. దాన్ని పిన్నీసులతో నేర్పుగా తీయడమూ అంతే మామూలు. ఇప్పటి పిల్లలకు ముల్లు గుచ్చుకోవడం అంతగా తెలియదు... ముల్లును ముల్లుతోనే తియ్యాలనీ... ఇందుకోసం పిన్నీసు ముల్లును వాడాలన్న విషయమూ తెలియదు. ఇలా పిన్నీసు వాడటం తగ్గింది. వాటిని ఉపయోగించే నేర్పూ తగ్గింది. షాపుల్లో అవి కనిపించడం కూడ తగ్గింది. అలాగే ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సామెత వాడకమూ తగ్గిందిగదరా. అయినా సరే ఒక ఆశా కిరణం ఏమిటంటే... కలిసి ఉంటామని చెప్పడానికి పాశ్చాత్య దేశాల్లో పిన్నీసే సంకేతమట’’ అన్నాడు వాడు.‘‘అదేమిటి పాశ్చాత్య దేశాలు కలిసి ఉంటామని చెప్పడానికి సింబాలిగ్గా పిన్నీసు వాడతాయా?’’ అడిగా. ‘‘అవును బ్రెక్సిట్ సమావేశం తర్వాత అందరూ వేరుపడదాం నిశ్చయించుకున్నారు కదా... ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వద్దనుకున్న వారు ఏ చిరుగూ లేకపోయినా షర్టుకు స్టైలిష్‌గా పిన్నీసును పెట్టుకుంటున్నారట. రేసిజానికి వ్యతిరేకంగా పిన్నీసు ఒక ప్రతీక అట తెల్సా. అంత గొప్పదిరా పిన్నీసు. పాశ్చాత్యులు అలా దాన్ని పట్టుకుంటుంటే... మనం దాన్ని ఎప్పుడో వదిలేశాం. అందుకే నాకు గుండెల్లో ముల్లు గుచ్చినంత బాధగా ఉందిరా. పైగా డార్విన్గారు చెప్పిన పరిణామ సిద్ధాంతంలోని అంశాలు పిన్నీసు విషయంలోనూ నిజం కావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా’’ అన్నాడు వాడు. ‘‘ఏమిటీ... పరిణామ సిద్ధాంతంలో డార్విన్ పిన్నీసు గురించి మాట్లాడాడా?’’ అడిగాను నేను ఎంతో ఆశ్చర్యపడిపోతూ. ‘‘అంటే నేరుగా చెప్పలేదు. కానీ ఆయన పరిణామక్రమం గురించి చెప్పింది పిన్నీసుకూ అప్లై అవుతుంది’’ ‘‘అదెలా?’’ ‘‘దేన్నైతే ఎక్కువగా వాడతామో అది జిరాఫీ మెడలాగా మరింతగా అభివృద్ధి చెందుతుంది. దేన్ని వాడమో అది అంతరించిపోతుంటుంది అన్నాడు కదరా. అలా చూస్తే ఆ సిద్ధాంతం పిన్నీసుకు కూడా వర్తిస్తుంది కదా. ఇలా చూస్తే పిన్నీసు గురించి పరోక్షంగా డార్విన్గారు చెప్పినట్టే కదరా. ఇప్పుడు ఆలోచించు... పిన్నీసు అన్నది ఒక ఇంజనీరింగ్ అద్భుతమే అయినా... ఇటు జీవులకు సంబంధించిన బయాలజీలోని జీవపరిణామ సిద్ధాంతమూ దానికి వర్తిండచం ఒక అద్భుతం కాదంటావా? ఒకనాడు వారూ వీరు కాకుండా అందరి షర్టూ నిక్కరుకైనా ఉండిన అంతటి పిన్నీసు ఇలా తన ప్రాభవం కోల్పోవడం నాకు దుఃఖం తెప్పిస్తోందిరా’’ అన్నాడు వాడు. వాడి ధోరణిలో ఏదైనా చెప్పిగానీ వాడిని ఊరడించలేమని అనిపించింది. అందుకే వాడితో ఒక మాట చెప్పా. ‘‘ఒరేయ్... ఒక పిన్నుకు గుండు ఉంటే దాన్ని గుండుపిన్ను లేదా గుండు సూది అంటారు. అలాగే పిన్నీసుకు ఉండే సూదికి చివరన గుండుకు బదులుగా మంచి తలకట్టు ఉంది. మనుషుల్లో జుట్టు పట్ల ఇష్టం ఉన్నంత కాలం పిన్నీసు కూడా ఆదరణ కోల్పోకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు బాధపడకు’’ అన్నాను. ‘‘నీ మాటను తథాస్తు దేవతలూ వినాలి రా. నువ్వన్నట్టే జరగాలి రా’’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు వాడు. - యాసీన్