court stay
-
ఈ-కామర్స్ సంస్థలకు భారీ ఊరట
సాక్షి, బెంగళూరు: ఆన్లైన్ దిగ్గజం అమెజాన్‌కు కర్నాటక హైకోర్టులో భారీ ఊరట లభించింది. యాంటీ ట్రస్ట్ విచారణపై అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, అమెజాన్, ఇతర ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలపై దర్యాప్తును శుక్రవారం కోర్టు నిలిపివేసింది. రాయిటర్స్ కథనం ప్రకారం సీసీఐ దర్యాప్తును రెండు నెలల పాటు వాయిదావేసినట్టుగా న్యాయవాదులు వెల్లడించారు. దీంతో దేశంలోని ఈ కామర్స్ సంస్థలకు భారీ ఉపశమం లభించింది. కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు ఆదేశాలపై కోర్టు స్టే విధించింది. 13 జనవరి 2020 న సీసీఐ జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలంటూ అమెజాన్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా తమకు ఉపశమనం కల్పించాలని కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామంపై దేశీయ చిన్న వ్యాపార సంస్థలు ఎలా స్పందించనున్నాయో చూడాలి. చదవండి : ఉపశమనం కల్పించండి - అమెజాన్ భారత్‌కు ఉపకారమేమీ చేయడం లేదు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై సీసీఐ దర్యాప్తు -
స్మార్ట్‌గా రూ.9 కోట్లకు ఎసరు
రూ.2000 కోట్లపై ‘దేశం’ పెద్దల కన్ను వ్యూహాత్మకంగా చక్రం తిప్పిన అధికార పార్టీ నేతలు కోర్టు స్టేతో బెడిసికొట్టిన వైనం అవినీతి మరకలతో స్మార్ట్సిటీపై నీలినీడలు గొడ్డు పడిందంటే రాబందులకు సందడే సందడి. ఆ రాబందులు తపనలో ఓ అర్థం ఉంది . కానీ ఈ ‘పచ్చ’ రాబందులకు మాత్రం కాసులు గలగలలు వినిపిస్తే చాలు రెక్కలను విదిల్చుకుంటూ వాలిపోతాయి. తుని నియోజకవర్గంలో పనులు చేపట్టాలంటే కమీషన్ కింద రూ.9 కోట్లు ఇస్తేనే అని అక్కడి టీడీపీ బడా నేతలు ‘పంచాయితీ’ పెట్టడంతో కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోయిన విషయం ‘సాక్షి’ బయటపెట్టింది. ఇక కాకినాడ కార్పొరేషన్ విషయానికి వద్దాం. దీన్ని స్మార్ట్ సిటీగా గుర్తించి అభివృద్ధి పనుల కోసం రూ.2 వేల కోట్లను ప్రకటించగానే అభివృద్ధి ముసుగులో తలో కొంత పంచుకోడానికి సమాయత్తమవుతున్నారు. ఓ వైపు తామంతా ‘నిప్పు’లమంటూనే వాటాలేసుకోవడానికి ప్రయత్ని స్తున్నారు. ఇలాంటి వారికి కార్పొరేషన్ పీఠం అప్పగిస్తే సర్వం స్వాహా చేసేస్తారని నగర ప్రజలు మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ స్మార్ట్ సిటీకి వచ్చే రూ.2 వేల కోట్లపై అధికార పార్టీ పెద్దల కన్నుపడింది. రాబోయే నాలుగేళ్లలో ఈ నిధులతో చేపట్టే పనులపై పెత్తనం కోసం ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు స్మార్ట్ సిటీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది. స్మార్ట్ సిటీలో చేపట్టే పనులన్నీ తమ గుప్పెట్లోకి రావాలంటే కీలకమైన ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ)ని తమ వారికి కట్టబెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తక్కువ మొత్తానికి కోడ్‌చేసిన కంపెనీని పక్కనబెట్టి అయినవాళ్ల కోసం ఖజానాకు రూ.9 కోట్లు నష్టం తెచ్చేందుకు కూడా వారు వెనుకాడటం లేదు. ఇందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా వత్తాసు పలకడం వివాదాస్పదమై చివరకు న్యాయస్థానం గడపతొక్కింది. ఈ కన్సల్టెన్సీ టెండర్ల బాగోతానికి సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ ఎంపికలో భాగంగా మొదటి విడతలో కాకినాడ ఎంపికైంది. ఎంపికైన వెంటనే తొలి విడతగా కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రూ.382 కోట్లు విడుదలయ్యాయి. నిధులు విడుదలకావడంతో పనులు, డిజైనింగ్, పర్యవేక్షణ, బిల్లులు మంజూరు తదితర అంశాల పర్యవేక్షణకు పీఎంసీ ఎంపిక కోసం టెండర్లు పిలిచారు. జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. కన్సల్టెన్సీ హక్కుల కోసం దేశంలో పలు ప్రాంతాల నుంచి వాడియా టెక్నాలజీస్, ఆర్వీ అసోసియేట్స్, ఎపిటీసా, లీ అసోసియేట్స్, రామబల్, ఫీడ్‌బ్యాక్ తదితర ఆరు కంపెనీలు పోటీపడ్డాయి. వీటిలో నాలుగు కంపెనీలను పలు కారణాలతో తిరస్కరించారు. చివరకు ఆర్వీ అసోసియేట్స్, వాడియా సంస్థల మధ్య పోటీ నెలకొంది. చక్రం తిప్పిన టీడీపీ ముఖ్యనేతలు... పీఎంసీ కోసం ప్రధాన పోటీదారులైన వాడియా టెక్నాలజీస్ రూ.19 కోట్లకు, ఆర్వీ అసోసియేట్స్ రూ.28 కోట్లకు కోడ్ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలుండి తక్కువకు కోడ్‌చేసిన కంపెనీకే కాంట్రాక్టు ఖరారు చేయాలి. కానీ కాకినాడ స్మార్ట్ సిటీలో మాత్రం అందుకు భిన్నంగా ఎక్కువకు కోడ్ చేసిన కంపెనీని ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. ఈ రెండు కంపెనీల్లో తమకు అనుకూలురైన ఆర్వీ అసోసియేట్స్‌కు కట్టబెట్టేందుకు అధికార పార్టీ పెద్దలు చక్రం తిప్పారు. పీఎంసీ ఎంపిక తుది దశకు చేరిన సమయంలో తూర్పు గోదావరి నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న ఒక మంత్రి, ఒక పార్లమెంటు సభ్యుడు ఈ వ్యవహారంలో తెరవెనుక చక్రం తిప్పారు. ఫలితంగా రూ.9 కోట్లు ప్రజాధనం అదనంగా ఎందుకు వెచ్చించాల్సి వస్తుందోనని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పలు విమర్శలు వస్తున్నా ఆర్వీ అసోసియేట్స్‌కు కట్టబెట్టేలా అధికార పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చి ఒప్పించగలిగారు. పీఎంసీని దక్కించుకునేందుకు ఆర్వీ అసోసియేట్స్ నగరపాలక సంస్థకు తప్పుడు డాక్యుమెంట్లు దాఖలు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్వీ అసోసియేట్స్‌కు టీమ్ లీడర్ పునీత్‌సేథీ టెండర్ఫారంలో జతచేసిన సమాచారమంతా మోసపూరితమైందంటూ పలు ఫిర్యాదులు కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్‌గా ఉన్న నగరపాలక సంస్థ కమిషనర్ అలీంభాషాకు వెళ్లాయి. అడుగడుగునా తప్పతోవే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలోని ‘భూమి ఫోర్‌లైన్ హైవే సంస్థ’ ద్వారా 1994–2000 మధ్యలో జలంధర్ నుంచి పఠాన్ కోట్ హైవే పనులను పునీత్‌సేథీ పర్యవేక్షించినట్టు టెండర్ ఫారంలో అనుభవ పత్రాన్ని జత చేశారు. వాస్తవానికి ఆ హైవే పనులను 2001–2003 మధ్యన ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో జరిగాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కార్పొరేషన్ దృష్టికి వాడియా టెక్నాలజీస్ తీసుకువెళ్లింది. ఇదే పునీత్ సేథీ దుబాయ్ టవర్స్ నిర్మాణం 2003లోనే పూర్తయ్యాయి. అటువంటి టవర్స్ పనులను 2004–2008 మధ్యలో ఇదే పునీత్సేధీ చేసినట్టు ఇచ్చిన సమాచారం కూడా పూర్తిగా అవాస్త విరుద్ధమని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఏ సంస్థ టెండర్ దాఖలు చేసినా ఆయా సంస్థల టీమ్ లీడర్‌కు ఉండే అనుభవం ఆధారంగానే మార్కులు వేస్తారు. కోడ్ చేసిన మెుత్తం, సాంకేతిక పరిజ్ఞానం, టర్నోవర్ ఇలా అన్ని అంశాలకూ కలిపి 100 మార్కులు నిర్ణయించారు. అందులో భాగంగా వేసిన మార్కుల్లో ఎపిటీసాకు 80,వాడియా టెక్నాలజీస్ 81, ఆర్వీ అసోసియేట్స్‌కు 82, ఫీడ్‌బ్యాక్ 78 లీ అసోసియేట్స్‌కు 71, రామబల్కు 65 మార్కులు వేశారు. పాయింట్ల ప్రకారం చూసుకుంటే వాడియా టెక్నాలజీస్ కంటే ఆర్వీ అసోసియేట్స్‌కు ఒక మార్కు అదనంగా వేశారు. కానీ ఇక్కడకొచ్చే సరికి ఇన్ని అసత్యపు అనుభవ పత్రాలు దాఖలు చేసిన పునీత్‌సేథీ వాస్తవ పరిస్థితిని ఎంపిక కమిటీ కనీసం పరిశీలించ లేదు. పైపెచ్చు వాటి ఆధారంగానే ఆర్వీ అసోసియేట్స్‌కు ఒక మార్కు ఎక్కువ వేసిన అధికారుల అత్యు త్సాహం తేటతెల్లమవుతోంది. అధికారపార్టీ పెద్దల జోక్యంతో తొమ్మిది కోట్లు అదనంగా కోడ్ చేసినప్పటికీ ఆర్వీ అసోసియేట్స్‌కు పీఎంసీ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు... అధికారపార్టీ పెద్దలు ఆ సంస్థ ఎంపిక చేయడం వెనుక పెద్ద వ్యూహమే నడిచింది. ఈ మొత్తం వ్యవహారంలో సీఆర్డీఏకు చెందిన ఒక ముఖ్యమైన అధికారితోపాటు మంత్రితో సాన్నిహిత్యం ఉన్న కాకినాడ కార్పొరేషన్లో ఓ ఇంజినీరింగ్ అధికారి అధికార పార్టీ పెద్దలు చెప్పినట్టుగా చక్రం తిప్పి ఆర్వీ అసోసియేట్స్‌ను ఎంపిక చేశారనే విమర్శలున్నాయి. ఈ విషయాలన్నీ స్మార్ట్ సిటీ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో వాడియా టెక్నాలజీస్ హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. ఫలితంగా కాకినాడ స్మార్ట్‌సిటీకి పీఎంసీ ఎంపిక నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. వచ్చే ఐదేళ్లలో స్మార్ట్ సిటీ అభివృద్ధికి వందల కోట్లు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితిని కాసుల వేటలోపడి అధికారపార్టీ ముఖ్యనేతలు ఆదిలోనే మోకాలడ్డుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. -
కోర్టు స్టే ఇచ్చినా.. కూల్చేస్తున్నారు
విజయవాడ (వన్‌టౌన్ ) : నెహ్రూ రోడ్డు విస్తరణ పనులను నగరపాలకసంస్థ అధికారులు శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభించారు. రెండు నెలల క్రితం నెహ్రూరోడ్డు విస్తరణకు అధికారులు సిద్ధం కాగా, స్థానికులు అడ్డుకున్నారు. వారితో అధికారుల చర్చలు విఫలం కావటంతో కొద్ది రోజులుగా విస్తరణ పనులు నిలిచిపోయాయి. దీనిపై భవన యజమానులకు సమస్యను పరిష్కరిస్తానంటూ చెబుతూ వచ్చిన స్థానిక శాసనసభ్యుడు జలీల్‌ఖాన్ ఇప్పుడు చేతులు ఎత్తేశారు. దాంతో అధికారులు శనివారం అర్ధరాత్రి పలు జేసీబీలతో అక్కడకు చేరుకొని ఆయా భవనాల షట్టర్లను కూలగొట్టారు. గాంధీహిల్ నుంచి పెట్రోల్‌బంక్ వరకూ ఉన్న దుకాణాలన్నింటిని తలుపులే లేకుండా గోడలను కూలగొట్టారు. సరుకును సర్ధుకోవటానికి కూడా ఎవరికీ సమయం ఇవ్వలేదు. దాంతో సరుకులు పాడై తీవ్రంగా నష్టపోయామంటూ స్థానిక యజమానులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలూ బేఖాతరు విస్తరణ ను వ్యతిరేకిస్తూ పలువురు భవన యజమానులు న్యాయస్థానాలను ఆ«శ్రయించి స్టేఆర్డర్‌ను తీసుకొచ్చారు. వాటిని చూపించినా అధికారులు తమకు సంబంధం లేదంటూ కూల్చివేయడం గమనార్హం. పలువురు భవనాల తలుపులకు న్యాయస్థానాల తీర్పుల కాపీలను అంటించినా అధికారులు పట్టించుకోకుండా కూల్చివేతలను కొనసాగించారు. కార్మికునికి తీవ్ర గాయాలు తారాపేట పెట్రోల్‌బంక్ ఎదురుగా ఉన్న భవనం ఎదుట తలుపులను జేసీబీతో అధికారులు తొలగిస్తుండగా ఆ ఇనుప తలుపులు పడి అక్కడ పనిచేస్తున్న కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒక ప్రైవేటు ఆస్పత్రి ఐసీయులో ఉంచి చికిత్స చేస్తున్నారు. -
ఉదయ్‌కిరణ్ సినిమా విడుదలపై కోర్టు స్టే
దివంగత టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన చిట్టచివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'కు కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. సినిమా విడుదలను ఆపాలంటూ సిటీ సివిల్ కోర్టు స్టే ఇచ్చింది. 'నువ్వునేను' సినిమా హీరోయిన్ అనిత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. మోహన్ ఎల్లార్కే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మున్నా నిర్మాత. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఈ సినిమాను పెద్ద హిట్ చేసి ఉదయ్ కిరణ్‌కి నివాళి ఇవ్వాలనుకుంటున్నట్లు ఆ టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు అన్నారు. వాస్తవానికి ఏప్రిల్ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాత, దర్శకుడు భావించారు. కానీ అనుకోని పరిస్థితుల్లో దీనికి కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. ఇప్పుడు చిత్ర విడుదల అనుమానంలో పడింది. -
రాజకీయ ‘చెద’రంగం
►మహిళా సమాఖ్యలకు గ్రహణం ► పాత వారిని తొలగించేందుకు ఎన్నికల మంత్రం ► కోర్టును ఆశ్రయించిన సమాఖ్యల అధ్యక్షులు ► స్టే వచ్చినా గ్రామ సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు సాక్షి, ఏలూరు : జిల్లాలోని మహిళా సమాఖ్యలు రాజకీయ చదరంగంలో నలిగిపోతున్నాయి. సమాఖ్యల ప్రస్తుత అధ్యక్షులను తొలగించే కుట్రలు సాగుతున్నాయి. తమకు అనుకూలంగా ఉండేవారిని సమాఖ్య అధ్యక్షులుగా ఎంపిక చేయూలని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఎన్నికలు వద్దంటూ ప్రస్తుత సమాఖ్యల అధ్యక్షులు టీడీపీ జిల్లా నాయకుల్ని ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో చంద్రబాబునాయడు వద్దకు వెళ్లి వేడుకున్నారు. ఆయన కూడా కనికరించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. సేవా ధృక్పథంతో అధ్యక్ష పదవి చేపట్టిన మహిళలు తమ గోడు వినేవారు లేక నిస్సహాయం గా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వానికి.. సంఘాలకు మధ్య వారిధిగా జిల్లాలోని 46 మండలాలకు 46 మంది మహిళా సమాఖ్య అధ్యక్షులు ఉన్నారు. నాలుగేళ్లుగా వీరంతా ప్రభుత్వ పథకాలను స్వయం సహాయక సంఘాలకు చేరవేస్తున్నారు. ప్రభుత్వానికి, డ్వాక్రా సంఘాలకు మధ్య వారధిగా ఉంటున్నారు. వీరిని తొలగించి కొత్త వారిని ఎన్నుకోవడానికి వీలుగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి జిల్లాలో మహిళా సమాఖ్యల పదవీ కాలం 2015 వరకూ ఉంది. ఈ మేరకు గ్రామ సమాఖ్యల్లో తీర్మానం చేశారు. అయినా వాటిని రద్దు చేయడానికే ప్రభుత్వం మొగ్గుచూపడంతో వాళ్లంతా న్యాయస్థానం మెట్లెక్కారు. వారి ఆవేదనకు సమాధానం దొరికేంత వరకూ (గరిష్టంగా రెండు వారాలు) ఎన్నికలు నిలిపివేయాల్సిందిగా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కానీ గ్రామస్థాయిలో గ్రామ సంఘం ఎన్నికలు జరిగిపోతున్నాయి. ప్రస్తుతం మహిళా సమాఖ్య అధ్యక్షులు పదవిలో ఉన్నప్పటికీ వారిని లెక్కలోకి తీసుకోవడం లేదు. కొద్దిరోజుల క్రితం జిల్లా సమాఖ్య సమావేశం జరిగితే దానికి హాజరుకావాల్సిన ఇన్చార్జి డీపీఎం కె.పూర్ణచంద్రరావు రాలేదు. అదేరోజు ఏపీఎంలతో సమావేశం ఏర్పాటు చేసి మహిళా సమాఖ్య సమావేశానికి వారు వెళ్లే అవకాశం లేకుండా చేశారు. ఎన్నికలపై కోర్టు స్టే ఇచ్చిన అంశాన్ని పూర్ణచంద్రరావుకు తెలియజేసినప్పటికీ పెదవేగి మండలంలో సమాఖ్య ఎన్నికలు నిర్వహించడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది. ఇదే అధికారి ఆధీనంలో ఉండే డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీ సొమ్ము మం జూరు కాకపోవడంపై గతేడాది కలెక్టర్‌కు కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. ఆ సమస్య నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. అయితే వీరిని కొందరు ప్రజా ప్రతినిధులు ఈ విధంగా నడిపిస్తున్నారని తెలుస్తోంది. సమాఖ్య అధ్యక్షులపై అపవాదులు వేసి వారిని తప్పిం చడానికి ఎన్నికల మంత్రం జపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీ నేత ఒకరు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు జరపాల్సిందేనంటూ ఉన్నతాధికారులపై వత్తిడి తేవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు సమాచారం. రానున్న రోజుల్లో తమ నేతల సభలు, సమావేశాలకు మహిళల్ని సమీకరించేందుకు, తమ పనులు చేయించుకునేందుకు అనుకూలంగా ఉంటే కార్యకర్తలను అధ్యక్షులుగా చేసేందుకు అధికార పార్టీ నేతలు ఈ 46 మందిని తప్పించాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
బినామీలకు ఝలక్ !
మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ, న్యూస్‌లైన్: పాలమూరు పట్టణంలో మునిసిపల్శాఖకు చెందిన 283 దుకాణాల్లో అగ్రిమెంట్ పొందిన వారిలో క్కువ మంది బినామీలే ఉన్నారు. వారు మునిసిపాలిటీ నుంచి తక్కువ అద్దెకు టెండర్లు పొంది, ఎక్కువ అద్దెకు బినామీలకు అంటగట్టి 25 ఏళ్లుగా అక్రమార్జన పొందుతున్నారు. అయితే దుకాణాలకు పట్టణంలో బాగా డిమాండ్ ఉన్నా వారుమాత్రం నామమాత్రపు అద్దెను చె ల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్రిమెంట్ పూర్తయిన వారిని ఖాళీ చేయించేందుకు మునిసిపల్ శాఖ గురువారం 191మందికి నోటీసులు జారీ చేసింది. గతంలో వీరిని ఈ ఏడాది మార్చిలోగా ఖాళీ చేయించాలని చూడగా, అప్పట్లో వారు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు వారికి ఇచ్చిన కోర్టుస్టే డిసెంబర్‌తో ముగుస్తుండటంతో కోర్టు అనుమతుల మేరకు వారిని ఖాళీ చేయించేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు. ప్రస్తుతం దుకాణాల్లో 90శాతానికి పైగా బినామీలే ఉండటంతో మునిసిపల్‌కు వచ్చే ఆదాయం కంటే అగ్రిమెంట్దారులకు వచ్చే ఆదాయమే ఎక్కువైంది. ఈ దుకాణాలకు మళ్లీ టెండర్లు నిర్వహిస్తే అగ్రిమెంట్దారులతో పాటు బినామీదారులకు చెక్‌పడనుంది. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..! మునిసిపల్ దుకాణాలను టెండర్ ప్రక్రియలో దక్కించుకున్న వారిలో 25 ఏళ్ల అగ్రిమెంట్ పై బడిన వారు 73 మంది, ఇక మూడేళ్లు పూర్తయినవారు మరో 118 మంది ఉన్నారు. వీరితోపా టు మూడేళ్లలోపు అగ్రిమెంట్ ఉన్న వారు 92 మంది వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం 25 ఏళ్ల అగ్రిమెంట్ పూర్తయిన షాపులకు మునిసిపల్‌శాఖ ఓపెన్ టెండర్లను నిర్వహించనుంది. ఇక మూడేళ్ల అగ్రిమెంట్ నిండిన వారికి మాత్రం మూడోవంతు అద్దెను పెంచుతూ రీఅగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ కలెక్టర్ అన్నింటిని ఓపెన్ టెండర్లు నిర్వహించాలని ఆదేశించడంతో ఆ ప్రక్రియకు సిద్ధమయ్యారు. ఇక ఈ దుకాణాలకు సంబంధించిన అద్దెమాత్రం రూ.లక్షల్లో పేరుకుపోయింది. వాటి వసూ లు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రెండునెలల్లో టెండర్లను పూర్తిచేస్తాం ప్రస్తుతం నోటీసులు జారీచేస్తున్న దుకాణాలకు మరోరెండు నెలల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని మునిసిపల్ కమిషనర్ అమరయ్య తెలిపారు. ఇక నుంచి ప్రతి మూడేళ్లకు తప్పనిసరిగా షాపులకు టెండర్లను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో మునిసిపల్ శాఖ కు ఆదాయం సమకూరడమే కాకుండా, టెండర్ దక్కించుకున్న వారే షాపులను నిర్వహించుకునేలా చూస్తామన్నారు.