మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ, న్యూస్‌లైన్: పాలమూరు పట్టణంలో మునిసిపల్‌శాఖకు చెందిన 283 దుకాణాల్లో అగ్రిమెంట్ పొందిన వారిలో క్కువ మంది బినామీలే ఉన్నారు. వారు మునిసిపాలిటీ నుంచి తక్కువ అద్దెకు టెండర్లు పొంది, ఎక్కువ అద్దెకు బినామీలకు అంటగట్టి 25 ఏళ్లుగా అక్రమార్జన పొందుతున్నారు. అయితే దుకాణాలకు పట్టణంలో బాగా డిమాండ్ ఉన్నా వారుమాత్రం నామమాత్రపు అద్దెను చె ల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్రిమెంట్ పూర్తయిన వారిని ఖాళీ చేయించేందుకు మునిసిపల్ శాఖ గురువారం 191మందికి నోటీసులు జారీ చేసింది.
గతంలో వీరిని ఈ ఏడాది మార్చిలోగా ఖాళీ చేయించాలని చూడగా, అప్పట్లో వారు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు వారికి ఇచ్చిన కోర్టుస్టే డిసెంబర్‌తో ముగుస్తుండటంతో కోర్టు అనుమతుల మేరకు వారిని ఖాళీ చేయించేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు. ప్రస్తుతం దుకాణాల్లో 90శాతానికి పైగా బినామీలే ఉండటంతో మునిసిపల్‌కు వచ్చే ఆదాయం కంటే అగ్రిమెంట్‌దారులకు వచ్చే ఆదాయమే ఎక్కువైంది. ఈ దుకాణాలకు మళ్లీ టెండర్లు నిర్వహిస్తే అగ్రిమెంట్‌దారులతో పాటు బినామీదారులకు చెక్‌పడనుంది.
నిబంధనలు
ఏం చెబుతున్నాయంటే..!
మునిసిపల్ దుకాణాలను టెండర్ ప్రక్రియలో దక్కించుకున్న వారిలో 25 ఏళ్ల అగ్రిమెంట్ పై బడిన వారు 73 మంది, ఇక మూడేళ్లు పూర్తయినవారు మరో 118 మంది ఉన్నారు. వీరితోపా టు మూడేళ్లలోపు అగ్రిమెంట్ ఉన్న వారు 92 మంది వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం 25 ఏళ్ల అగ్రిమెంట్ పూర్తయిన షాపులకు మునిసిపల్‌శాఖ ఓపెన్ టెండర్లను నిర్వహించనుంది.
ఇక మూడేళ్ల అగ్రిమెంట్ నిండిన వారికి మాత్రం మూడోవంతు అద్దెను పెంచుతూ రీఅగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ కలెక్టర్ అన్నింటిని ఓపెన్ టెండర్లు నిర్వహించాలని ఆదేశించడంతో ఆ ప్రక్రియకు సిద్ధమయ్యారు. ఇక ఈ దుకాణాలకు సంబంధించిన అద్దెమాత్రం రూ.లక్షల్లో పేరుకుపోయింది. వాటి వసూ లు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
రెండునెలల్లో టెండర్లను పూర్తిచేస్తాం
ప్రస్తుతం నోటీసులు జారీచేస్తున్న దుకాణాలకు మరోరెండు నెలల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని మునిసిపల్ కమిషనర్ అమరయ్య తెలిపారు. ఇక నుంచి ప్రతి మూడేళ్లకు తప్పనిసరిగా షాపులకు టెండర్లను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో మునిసిపల్ శాఖ కు ఆదాయం సమకూరడమే కాకుండా, టెండర్ దక్కించుకున్న వారే షాపులను నిర్వహించుకునేలా చూస్తామన్నారు.
బినామీలకు ఝలక్ !
Published Fri, Nov 29 2013 3:14 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement