CP Mahesh Bhagwat
-
చండూరు మండల కేంద్రంలో ఉద్రికత్త
-
భారత, ఆసీస్ మ్యాచ్ కు పూర్తి భద్రత కల్పించాం
-
పోలీసుల ఎంట్రీ: ఫామ్‌హౌజ్‌లో భారీ రేవ్ పార్టీ భగ్నం
సంస్థాన్ నారాయణపురం/ చౌటుప్పల్: ఓ వ్యవసాయ క్షేత్రంలో యువత రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని గాంధీనగర్ తండా పరిధిలో ఉన్న జక్కిడి ధన్వంత్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీపై ఎస్ఓటీ, భువనగిరి పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. 97 మందిని (88 మంది యువకులు, ఇద్దరు యువతులు, ఏడుగురు నిర్వాహకులు) అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగులు ఉన్నారు. భారీగా మద్యం, డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు చెందిన పేపర్ ప్రొడక్ట్ వ్యాపారి గిరీశ్ దడువాయ్, ఎల్బీనగర్కు చెందిన విద్యార్థి శ్రీకర్‌రెడ్డి (ఫౌంహౌజ్ యజమాని ధన్వంత్‌రెడ్డి కుమారుడు), వనస్థలిపురానికి చెందిన జ్యువెల్లరీ వ్యాపారి చొల్లేటి శ్రీకాంత్, షేక్ ఉమర్ ఫారూఖ్ కలసి రేవ్ పార్టీ ఏర్పాటు చేయాలని భావించారు. శ్రీధర్‌రెడ్డి తండ్రి ధన్వంత్రెడ్డికి నారాయణపురం మండలం గాంధీనగర్ తండాలో ఫామ్‌హౌజ్ ఉండటంతో అక్కడే పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డీజే సౌండ్ సిస్టమ్ నిర్వహణతో పాటు డ్రమ్ వాయిద్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఢిల్లీకి చెందిన సయ్యద్ అమ్రాన్ అలీరెజాను సంప్రదించారు. సూర్యాపేట జిల్లా బాలాజీనగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి బాలెంల ప్రవీణ్ నిషేధిత మత్తు పదార్థాలను సమకూర్చాడు. సోషల్‌మీడియా (ఇన్స్టాగ్రామ్) వేదికగా ‘పీఎస్ వై దమ్రూ’ అనే పేజీ క్రియేట్ చేసి ఒక్కొక్కరికి రూ.499 తీసుకొని 90 మందిని ఎంట్రీ చేసుకున్నారు. ‘మహదేవ్ గ్యాదరింగ్ ఎట్ రాచకొండ హిల్స్’ పేరుతోనూ యువతను ఆకర్షించారు. పక్కా సమాచారంతో.. ఈ రేవ్‌పార్టీ విషయం పోలీసులకు సమాచారం అం దింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశం మేరకు ఎస్ఓటీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసు బలగాలు గురువారం రాత్రి దాడి చేశారు. పార్టీలో యువత మద్యంతో పాటు డ్రగ్స్, గంజాయి వినియోగించారు. 400 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎల్ఎస్డీ డ్రగ్, 2 గ్రాముల గుర్తు తెలియని డ్రగ్ పోలీసులకు చిక్కింది. 120 మద్యం ఫుల్ బాటిళ్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, 2 కెమెరాలు, 76 సెల్ఫోన్లు, 15 కార్లు, 30 బైక్‌లు, జెనరేటర్, డీజేసౌండ్ సిస్టం, రూ.27,030 నగదు, 21 ఎంట్రీ టికెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, గంజాయిలో వినియోగించే ఓసీఏం పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు. పట్టుబడిన యువతులు, యువకులపై కూడా కేసు నమోదు చేశారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందో.. ఈ కేసును లోతుగా విచారణ చేపడుతున్నామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. 3 నెలల కింద లక్నవరం సరస్సు వద్ద కూడా ఇలాగే పార్టీ జరిగిందని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ఈ ఘటనపై విచారణ జరుపుతామన్నారు. నిర్వాహకులకు డ్రగ్స్, గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరిగిందన్న విషయాన్ని తెలుసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్‌రెడ్డి, ఏసీపీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, పోలీసుల అదు పులో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిం చగా ఒకరి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. -
వెట్టిచాకిరి నుంచి చిన్నారులకు విముక్తి..
సాక్షి, హైదరాబాద్: ఎర్రకుంటలోని గాజుల కర్మాగారంపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 20 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలను మీడియాకు వెల్లడించారు. గయా, బీహార్‌కి చెందిన పిల్లలతో గాజుల తయారీలో పని చేయిస్తున్నారని పేర్కొన్నారు. బీహార్ నుండి అక్రమంగా పిల్లలను తరలించారని, వారికి కనీసం సరైన భోజనం సదుపాయం కూడా కల్పించడంలేదని, అర్ధరాత్రి వరకు కూడా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నలుగురు ఆర్గనైజర్లను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. మెడికల్ పరీక్షలు నిర్వహించిన అనంతరం 20 మంది చిన్నారులను వారి స్వస్థలాలకు పంపిస్తామని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు గంజాయి ముఠా అరెస్ట్.. గంజాయి సరఫరా చేస్తున్న హర్యానాకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. సీపీ మహేష్ భగవత్ వివరాలను మీడియాకు వెల్లడిస్తూ.. ఒక్కొక్కటి 5.5 కేజీల ప్యాకెట్లగా కంటైనర్‌లో సరఫరా చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. మొత్తం 1010 కేజీల 194 ప్యాకెట్ల గంజాయితో పాటు ఒక కంటైనర్, నాలుగు వేలు నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. -
భార్యాభర్తలపై సినిమాలు, సీరియళ్ల ప్రభావం
నేరేడ్మెట్: అనుమానాలు..అపార్థాలు..మనస్పర్థలతో పోలీసు కేసులతో వీడిపోవాలనుకునే దంపతుల మధ్య రాజీ కుదిర్చి వైవాహిక బంధం పటిష్టానికి కుటుంబ సహాయ కేంద్రాలు (ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు) దోహదపడుతున్నాయని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ అన్నారు. 2016 గాంధీజయంతి రోజున రాచకొండ పోలీసుల సహకారంతో ఎన్జీవో సంస్థ ‘అంకురం’కుషాయిగూడ ఠాణాలో కుటుంబ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. బుధవారానికి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్‌లో తృతీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో సఖితోపాటు అంకురం, భూమిక సంస్థల ఆధ్వర్యంలో భువనగిరి, సరూర్‌నగర్, ఉప్పల్, నేరేడ్మెట్ పాకరంతాల్లో ఐదు కుటుంబ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత మూడేళ్లలో వివిధ కారణాల నేపథ్యంలో 1273 జంటలు కుషాయిగూడ ఫ్యామిలీ సహాయ కేంద్రాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం కేసులను ఉపసంహరించుకొని 468 జంటలు రాజీ పడి, సంతోషంగా జీవిస్తున్నట్లు సీపీ వివరించారు. 491 దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాజీ పడిన జంటలు తిరిగి గొడవ పడి ఠాణాలకు వెళ్లకపోవడం వివాహ వ్యవస్థ బలోపేతానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు చేస్తున్న కృషికి నిదర్శమన్నారు. ఈ సెంటర్ల నిర్వాహకులు ,కౌన్సెలర్లు దంపతులను వేర్వేరుగా కౌన్సెలింగ్ చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి సూచనలు అందిస్తున్నందున కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. గృహహింస కేసులకు వరకట్నం ఒక్కటే కారణం కాదని, భర్తలకు మద్యం అలవాటుతోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు సీపీ వివరించారు. 2016–19 వరకు వరకట్న సమస్యపై 223 కేసులు నమోదు కాగా, మద్యం కారణంగా 335 కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. సినిమాలు, సీరియళ్ల ప్రభావం సినిమాలు, టీవీ సీరియల్స్, సోషల్‌మీడియా ప్రభావం భార్యాభర్తల మధ్య విభేదాలకు దారితీస్తోందని సీపీ అభిప్రాయపడ్డారు. అపార్ట్మెంట్ సంస్కృతి పెరగటం, ఉమ్మడి కుటుంబాలు తగ్గటం కూడా ఇందుకు కారణమన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. షీ టీంలు, ఫ్యామిలీ, సఖి కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటుతోపాటు ఐటీ కంపెనీల ప్రతినిధులతో మార్గదర్శక్‌లను నియమించడం జరిగిందని ఆయన వివరించారు. మై ఆటో, క్యాబ్ సేఫ్ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. చిన్నచిన్న కారణాలతో కేసులుపెట్టుకొని భార్యభర్తలు వీడిపోరాదని సీపీ సూచించారు. దంపతులు దూరమైతే వారి పిల్లలు, కుటుంబం రోడ్డు పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చార్జిషీట్ దాఖలైన తర్వాత కూడా కలిసి ఉండటానికి అవకాశం ఉంటుందన్నారు. ‘అర్థరాత్రి మహిళలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని’ మహాత్మగాంధీ కలను సాకారం చేసేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు. కౌన్సెలింగ్ అనంతరం రాజీపడిన డీఆర్డీఏ శాస్త్రవేత్త సురేష్‌తోపాటు లక్ష్మి, ఉదయ్, ఉష, ఓంప్రకాష్, స్వాతి, శివశంకర్ దంపతులు తమ అనుభవాలను వివరించారు. సమావేశంలో మల్కాజిగిరి ఇన్‌ఛార్జి డీసీపీ నారాయణరెడ్డి, షీటీం డీసీపీ సలీమా, అంకురం సంస్థ డైరెక్టర్ సుమిత్ర, ఎస్సీఎస్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు మమత, పలువురు కౌన్సిలర్లు, మార్గదర్శక్‌లు పాల్గొన్నారు. సెంటర్ ప్రతినిధులు,పోలీసులకు సీపీ అవార్డులు అందజేశారు. కౌన్సెలింగ్‌తో మార్పు వచ్చింది.. నా పేరు లక్ష్మి, కూలి పనులు చేస్తాను. భర్త పేరు ఉదయ్ డ్రైవర్. ఆరు నెలల క్రితం మా మధ్య చిన్న గొడవ జరిగింది. వీడిపోవాలనుకున్నాం. పోలీసులు కౌన్సెలింగ్ సెంటర్‌కు పంపించారు. అక్కడ కౌన్సిలర్ శ్యామల కౌన్సెలింగ్ చేయడం వల్ల మాలో మార్పు వచ్చింది. ఇద్దరం రాజీ పడ్డాం. ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నాం. -
జయరాం హత్యకేసు; ఏసీపీ మల్లారెడ్డిపై ఆరోపణలు
-
జయరాం హత్యకేసు; ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై జయరాం హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డితో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఈ విషయం గురించి రాచకొండ సీపీ మహేష్ భగవత్ మంగళవారం విలేరులతో మాట్లాడుతూ... నిందితుడు రాకేష్ రెడ్డి.. ఏసీపీ మల్లారెడ్డితో ఫోన్లో టచ్‌లో ఉన్నట్లుగా సమాచారం ఉందన్నారు. ఓ కేసు సందర్భంగా వీరిద్దరికి పరిచయం ఏర్పడిందని.. ఆ క్రమంలోనే నిందితుడు.. మల్లారెడ్డితో సంబంధాలు పెంచుకున్నాడని తెలిపారు. (పిడిగుద్దులు గుద్దాను.. చనిపోయాడు!) ఈ నేపథ్యంలో అంబర్పేట్ కార్ హెడ్ క్వార్టర్స్‌కు మల్లారెడ్డిని అటాచ్ చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఈ విషయమై లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు. ఇక ఇబ్రహీంపట్నం ఏసీపీగా వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. (ఎవరీ రాకేష్ రెడ్డి..?) -
పంద్రాగస్టున రేవ్ పార్టీకి ప్లాన్
- భారీగా డ్రగ్స్ విక్రయించాలని కెల్విన్ సూచించాడని తెలిపిన నైజీరియన్ ముఠా - మాదక ద్రవ్యాల కేసులో తాజాగా నలుగురిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు - రూ.పది లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం - వివరాలు వెల్లడించిన సీపీ మహేశ్ భగవత్ సాక్షి, హైదరాబాద్: ‘స్వాతంత్య్ర దినోత్సవం రోజు గోవాలో రేవ్ పార్టీకి కెల్విన్ ప్లాన్ చేశాడు. ఆ పార్టీలో భారీగా డ్రగ్స్ విక్రయించాలని సమాచారమిచ్చాడు. అంతలోనే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కెల్విన్‌ను అరెస్టు చేశారు’ అని రాచకొండ పోలీసులకు తాజాగా చిక్కిన నలుగురు సభ్యుల ముఠా తెలిపింది. గతంలో అరెస్టు అయిన ఆరుగురు నైజీరియన్ నిందితులిచ్చిన వివరాల ఆధారంగా అజా గాబ్రియల్ ఒగొబొన్నాను రెండు రోజుల క్రితం, నవ్యంత్, అంకిత్ పాండే, గణత్ కుమార్‌రెడ్డిలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.పది లక్షల విలువైన 450 ఆంఫెటమైన్ ట్యాబ్లెట్లు, 45 గ్రాముల ఎమ్డీఎమ్ఏ, 60 ఎల్ఎస్డీ ప్యాకెట్లు, 0.5 గ్రాముల కొకైన్, 0.35 గ్రాముల చంగా, 60 గ్రాముల గంజా, ఒక పాస్‌పోర్టు, ఆరు ల్యాప్‌టాప్‌లు, రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. నగర పబ్‌లకు డ్రగ్స్ సరఫరా డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు రాచకొండ పోలీసులు జూలై 23న ఆరుగురు నైజీరియన్లు, విజయవాడకు చెందిన ఓ యువతిని అరెస్టు చేశారు. నైజీరియాకు చెందిన అజా గాబ్రియల్ ఒగొబొన్నా గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి మిగతావారికి విక్రయిస్తున్నట్టు విచారణలో తెలిపారు. దీంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. యాప్రాల్‌లో తన ప్రేయసి ఉంటున్న గ్రీన్వుడ్ రెసిడెన్సీకి రాగానే అదుపులోకి తీసుకున్నారు. పవన్‌కుమార్ రెడ్డి పెడ్లర్ జూన్ 23న అరెస్టైన నైజీరియన్ ముఠా పోలీసు విచారణలో ఆరుగురికి డ్రగ్స్ విక్రయించినట్లు తెలిపింది. దీంతో ఆరుగురిని పోలీసులు ప్రశ్నించారు. వారి రక్తనమూనాలు, గోర్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వారందరూ డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించారు. అయితే ఈ కేసులో డ్రగ్ స్వీకరించిన పవన్‌కుమార్‌రెడ్డి పెడ్లర్ అని దర్యాప్తులో తేలింది. అతడిని రెండు వారాల క్రితం పోలీసులు ప్రశ్నించి వదిలేశారు. తాజా గా పవన్‌కుమార్ ప్రమేయం ఉన్నట్టు తేలడం తో అతని కోసం గాలిస్తున్నారు. ఈ కేసును ఛేదించిన ఎస్వోటీ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, నవీన్కుమార్లతోపాటు ఇతర సిబ్బందిని రివార్డులతో సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ తరుణ్ జోషి, ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర రావు, అదనపు డీసీపీ క్రైమ్స్ జానకీ తదితరులు పాల్గొన్నారు. గోవాకు వెళ్లినా డ్రగ్స్ విక్రయం ఆపలేదు ఈ ముఠాలో కీలకవ్యక్తి కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసి నూక నవ్యంత్. నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. మాదకద్రవ్యాలకు బానిసై చదువు మధ్యలోనే ఆపేశాడు. పబ్‌లకు వెళ్లేప్పుడు డీజే అంకిత్ పాండే పరిచయమయ్యాడు.ఇతని ద్వారా గాబ్రి యేల్తో స్నేహం చేశాడు. థాయిలాండ్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ కొనుగో లు చేశాడు. ఆగస్టు 15న గోవాలో పెద్ద రేవ్ పార్టీ నిర్వహిస్తున్నామని, రావాలని నవ్యంత్కు కెల్విన్ చెప్పాడు. కెల్విన్ అరెస్టు కావడంతో నవ్యంత్ గోవాకు పారి పోయాడు. అక్కడి నుంచే హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. నవ్యంత్ ఫోన్లో 50 మంది మహిళల నంబర్లు ఉన్నాయి. అందులో సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు ఉన్నారు.