breaking news
CP Radhakrishnan
-
ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?
భారతదేశంలో రాజ్యాంగ బద్దంగా.. రాష్ట్రపతి తరువాత రెండో అత్యున్నత పదవి ఉప రాష్ట్రపతి. ఈ బాధ్యతలను సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు శుక్రవారం(సెప్టెంబర్ 12వ తేదీ) చేపట్టారు. అయితే దేశ ఉపరాష్ట్రపతి పదవికి ఎటువంటి జీతం ఉండదని బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. అయితే.. జీతం తప్ప, ఇతర ప్రోత్సాహకాలు లభించే ఏకైక పదవి ఇదే అని చెప్పడంలో సందేహం లేదు.భారత ఉపరాష్ట్రపతిగా ఎటువంటి జీతం తీసుకోనప్పటికీ.. ఈ పదవిలో ఉన్న వ్యక్తి, రాజ్యసభ ఛైర్మన్‌గా నెలకు రూ.4 లక్షల వేతనం పొందుతారు ((2018లో దీనిని రూ.1,25,000 నుంచి సవరించారు). ఉపరాష్ట్రపతి జీతం, భత్యాలు పార్లమెంటు అధికారుల జీత భత్యాల 1953 చట్టం ప్రకారం నిర్ణయిస్తారు. ఇందులో ఉపరాష్ట్రపతి పదవికి ప్రత్యేక జీత నిబంధన లేదు.ఉపరాష్ట్రపతికి లభించే ప్రయోజనాలుభారత ఉపరాష్ట్రపతికి జీతం లేకపోయినప్పటికీ.. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉచిత వసతి, వైద్య సంరక్షణ, రైలు & విమాన ప్రయాణం, ల్యాండ్‌లైన్ కనెక్షన్, మొబైల్ ఫోన్ సర్వీస్, వ్యక్తిగత భద్రత, సిబ్బంది మొదలైనవి ఉన్నాయి.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐపదవీ విరమణ తరువాత కూడా అనేక సదుపాయాలు కల్పిస్తూ.. నెలకు సుమారు రూ. 2 లక్షల పెన్షన్, పర్సనల్ సెక్రటరీ, అసిస్టెంట్, సెక్యూరిటీ, డాక్టర్, ఇతర సిబ్బంది సేవలను పొందుతూనే ఉంటారు. మాజీ ఉపరాష్ట్రపతి మరణించిన తరువాత.. ఆయన భార్యకు కూడా కొన్ని సదుపాయలను కల్పిస్తారు. -
భారత 15 ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
-
భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశపు 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర మంత్రులు పలువురు ఎన్డీయే కూటమి సీఎంలు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, జగ్దీప్ ధన్‌ఖడ్ సహా మాజీ ఉపరాష్ట్రపతులూ పాల్గొన్నారు.ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 9న జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తన సమీప ప్రత్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నిక లాంఛనాలన్నీ పూర్తి కావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఓటమి తర్వాత జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్. 1957 అక్టోబరు 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఆయన జన్మించారు. కాంగ్రెస్ సానుభూతిపరులైన వ్యవసాయ కుటుంబంలో ఈయన జన్మించారు. పదహారో ఏట నుంచి ఆర్ఎస్ఎస్, జన్‌సంఘ్‌లతో కలిసి పనిచేశారు. సామాజికంగా, ఆర్థికంగా బలమైన కొంగు వెల్లాలర్ (గౌండర్) సామాజికవర్గం నుంచి వచ్చిన ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా 1.5 లక్షల ఆధిక్యంతో విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో అక్కడినుంచే నెగ్గారు. వాజ్‌పేయీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 2000లో రాధాకృష్ణన్ కేంద్రమంత్రి కావాల్సి ఉంది. మరో సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్ అప్పట్లో ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో అలాంటి పొరపాటు జరిగిందని చెబుతారు. ఇక.. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీలో ‘తమిళనాడు మోదీ’గా ఈయన పేరుపొందారు. ఆపై.. రాధాకృష్ణన్ 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. కొన్నాళ్లు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులై 27 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా ఉండి.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గడంతో ఆ హోదాకు రాజీనామా చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకటరామన్‌ల తర్వాత తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన మూడోవ్యక్తిగా, దక్షిణాది నుంచి ఏడో వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీకాలం 2030 వరకు ఉంటుంది. -
నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా నూతనంగా ఎన్నికైన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్(67) శుక్రవారం 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరుగనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారు. ఇండియా కూటమి నేతలకు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహా్వన లేఖలు పంపినట్లుగా తెలిసింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కారణంగా సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయగా, దానిని రాష్ట్రపతి ఆమోదించారు. -
భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. రేపే ప్రమాణస్వీకారం
ఢిల్లీ: ఇటీవల జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం (సెప్టెంబర్ 12) ఉదయం 9.30గంటలకు సీపీ రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది.ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో జరిగిన పోలింగ్‌లో బ్యాటెట్ పత్రాలనే ఉపయోగించారు. రెండో ప్రాధాన్యత ఓటు ఉండటం వల్ల ఈవీఎంలను వాడలేదు. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 కాగా ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగుకు దూరంగా బీఆర్ఎస్ (4రాజ్యసభ), బీజేడీ(7), శిరోమణి అకాలీదల్(3) దూరంగా ఉన్నాయి. దాంతో 767 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు !మాత్రమే ఉంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగ్గా, అటు తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. -
క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత విచారణ?
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుకున్నదానికంటే ఎన్డీఏ అభ్యర్థికి రాధాకృష్ణన్‌కు అధిక మెజారిటీ సాధించడం వెనుక క్రాస్ ఓటింగ్ దాగిఉందన్న వాదన మరింత పెరిగింది. సొంత ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయకుండా రాధాకృష్ణన్ వైపు కొందరు విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల ఎంపీలు మొగ్గుచూపారని వార్తలు ఎక్కువయ్యాయి. ఇండియా కూటమి పక్షాల ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు రాజకీయ వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై అంతర్గత విచారణ చేయించాలని కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బిహార్ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ అంశం పార్టీల ఐక్యతకు ప్రశి్నస్తోంది. దీంతో ఐక్యత పెద్ద సవాల్‌గా మారుతున్న నేపథ్యంలో కూటమిలోని లోటుపాట్లను గుర్తించి, వాటిని వీలైనంత త్వరగా సవరించుకోవాలనే అభిప్రాయంతో విపక్షపార్టీలు ముందుకెళ్తున్నట్లు సమాచారం. మంగళవారం వెల్లడైన ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో సుమారు 20 ఓట్లు రాధాకృష్ణన్‌కు పడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి 324 ఓట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ ఆయనకు కేవలం 300 ఓట్లు పడ్డాయి. రాధాకృష్ణన్ గరిష్టంగా 436 ఓట్లు సాధించవచ్చని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన 452 ఓట్లు సాధించారు. మరింత స్పష్టమైన మెజారిటీ ఒడిసిపట్టారు. పోలింగ్ పూర్తయిన వెంటనే తమ అనుకూల ఓట్లపై ఓ అంచనాకు వచి్చన కాంగ్రెస్ సైతం తమకు అనుకూలంగా 315 ఓట్లు వస్తాయని లెక్కగట్టింది. అయితే కాంగ్రెస్ పేర్కొన్నట్లుగానే 15 ఓట్లు ఇక్కడే క్రాస్ ఓటింగ్ అయ్యాయి. దీంతో పాటు చెల్లని ఓట్లు సైతం ఇండియా కూటమి పక్షాలవేనని ప్రచారం జరుగుతోంది. భారీ క్రాస్ ఓటింగ్ దృష్ట్యా ఈ అంశంపై కచ్చితంగా విచారణ జరగాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. దీనిని తీవ్రమైన విశ్వాస ఉల్లంఘనగానే పరిగణించాలని, ఇది విపక్షాల అంతర్గత ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తివారీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలు సైతం ఈ విషయంపై విచారణ కోరుకుంటున్నారని ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి రావాల్సిన 12 ఓట్లలో కనీసంగా 3 ఓట్లు, తమిళనాట డీఎంకే నుంచి రావాల్సిన 32 ఓట్లలో కనీసంగా 4 ఓట్లు, ఆర్జేడీ నుంచి రెండు ఓట్లు, శివసేన(ఉద్ధవ్) పార్టీ నుంచి కొన్ని ఓట్లు క్రాసింగ్ జరిగినట్లు అంచనాలు వేస్తున్నారు. మాకు సంబంధం లేదన్న పార్టీలుఅయితే క్రాస్ ఓటింగ్ వివాదంపై విపక్ష పార్టీల వాదన భిన్నంగా ఉంది. తమ సభ్యులెవరూ రాధాకృష్ణన్‌కు ఓటేయలేదని కాంగ్రెస్ మిత్రపక్షాలు కరాఖండీగా చెప్పాయి. దీనిపై ఇప్పటికే ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ పార్టీలు తమ ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని ప్రకటనలు సైతం ఇచ్చాయి. ఇక కాంగ్రెస్ సైతం తమ ఓట్లు నూటికి నూరు శాతం కూటమి అభ్యర్థికే బలంగా పడ్డాయని చెబుతున్నాయి. అయితే బిహార్, తమిళనాడు, పశి్చమబెంగాల్ ఎన్నికల దృష్ట్యా కూటమిలో ఐక్యత కొనసాగి ఎన్నికల్లో పోరాడాలంటే క్రాస్ ఓటింగ్‌పై విచారణ జరపాలని కాంగ్రెస్ నేతల నుంచి డిమాండ్ వస్తోంది. ఇదే సమయంలో విపక్షాల అభ్యర్థికి 40 శాతం ఓట్ల వాటాను ‘నైతిక విజయం‘గా కాంగ్రెస్ నాయకులు అభివరి్ణస్తున్నారు. 2022 ఎన్డీఏకు చెందిన జగదీప్ ధన్‌ఖడ్‌పై పోటి చేసిన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు వచి్చన ఓట్లతో పోలిస్తే ఈసారి తమకుæ దాదాపు 14 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఇక వీటిని తిప్పికొడుతున్న బీజేపీ 15 మంది ప్రతిపక్ష ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారని, మరో 15 మంది ఉద్దేశపూర్వకంగా చెల్లని ఓట్లు వేశారని కౌంటర్లు ఇస్తోంది. -
‘ఉప రాష్ట్రపతి ఆఫీసుకు మరింత కీర్తి’.. చానాళ్లకు ధన్‌ఖడ్ బహిరంగ ప్రకటన
న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మంగళవారం తన వారసుడు సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి కార్యాలయం అతని అపార అనుభవంతో మరింత కీర్తిని పొందుతుందని భావిస్తున్నానని అన్నారు. గత జూలైలో రాజీనామా చేసిన తర్వాత జగదీప్ ధన్‌ఖడ్ చేసిన తొలి బహిరంగ ప్రకటన ఇదే కావడం గమనార్హం. Former Vice President Jagdeep Dhankhar greets his successor CP Radhakrishnan. pic.twitter.com/m6WorHvNWJ— Press Trust of India (@PTI_News) September 9, 2025మంగళవారం ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 452 ఓట్లతో గెలుపొందగా, ప్రతిపక్ష అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు సాధించారు. నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు జగదీప్ ధన్‌ఖడ్ రాసిన లేఖలో ‘మీరు ఈ గౌరవనీయమైన పదవికి ఎదగడం అనేది మన దేశ ప్రతినిధుల అపార నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజా జీవితంలో రాధాకృష్ణన్కున్న అపారమైన అనుభవానికి తోడు ఆయన నాయకత్వంలో ఈ కార్యాలయం ఖచ్చితంగా గొప్ప గౌరవాన్ని, కీర్తిని పొందుతుందని’ అన్నారు. జగదీప్ ధన్‌ఖడ్ జూలై 21న తన అనారోగ్య సమస్యలను కారణంగా చూపుతూ, ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
సీపీ రాధాకృష్ణన్ రాజకీయ ప్రస్థానం
-
కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
-
కొత్త ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ 15వ ఉపరాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) తరఫున పోటీ చేసిన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి 300 ఓట్లు పొందారు. దీంతో 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ మంగళవారం రాత్రి ప్రకటించారు. దీంతో రాధాకృష్ణన్ త్వరలోనే ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేపట్టనున్నారు. తమిళనాడు నుంచి ఈ పదవిని అధిష్టించిన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్‌ల తర్వాత మూడో నాయకుడిగా సీపీ రాధాకృష్ణన్ చరిత్రకెక్కారు. ఘన విజయం... ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నూతన పార్లమెంట్ భవనంలోని ‘వసుధ ఎఫ్–101’లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ పోలింగ్‌లో మొత్తంగా 767 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 6, లోక్‌సభలో ఒక ఖాళీ స్థానాన్ని పక్కనబెడితే లోక్‌సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది కలిపి 781 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే ముందే ప్రకటించినట్లుగా బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎంపీలు, ఏడుగురు బీజేడీ ఎంపీలతోపాటు శిరోమణి అకాలీదళ్ ఎంపీ ఒకరు, స్వతంత్ర ఎంపీ సరబ్జీత్సింగ్ ఖల్సా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో మొత్తంగా 767 (98.2 శాతం) ఓట్లు పోలయ్యాయి. విజయానికి అవసరమైన ఓట్లను 377గా నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్లను లెక్కించి రాత్రి 7:30 గంటలకు ఫలితాన్ని ప్రకటించారు. మొత్తం పోలైన 767 ఓట్లలో చెల్లని ఓట్లు 15 ఉండగా మిగిలిన 752 ఓట్లలో రాధాకృష్ణన్‌కు 452 మొదటి ప్రాధాన్యతా ఓట్లు లభించాయని.. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ప్రకటించారు. అనుకున్నట్లే క్రాస్ ఓటింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. ఇండియా కూటమిలోని పక్షాలు, తమకు మద్దతుగా వచ్చిన ఆప్ సహా ఇతర చిన్నాచితక పార్టీలతో కలిసి కాంగ్రెస్ కనీసం 324 ఓట్లు వస్తాయని అంచనా వేసింది. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ప్రతిపక్షాలు ఐక్యంగా నిలబడ్డాయి. కూటమికి చెందిన 315 మంది ఎంపీల్లో అందరూ ఓటింగ్ కోసం హాజరయ్యారు’అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ పేర్కొన్నట్లుగానే 15 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయ్యాయి. దీంతోపాటు చెల్లని ఓట్లు సైతం ఇండియా కూటమి పక్షాలవేనని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 20–25 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాధాకృష్ణన్‌కు ఎన్డీయే కూటమిలోని 427 మంది ఎంపీల మద్దతు ఉందని బీజేపీ కాగితంపై లెక్కలేసుకోగా పోలింగ్‌లో మాత్రం అంతకన్నా ఎక్కువగానే ఓట్లు లభించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో నిర్వహించిన సమర్థవంతమైన ఫ్లోర్ మేనేజ్మెంట్ కారణంగా ఎన్డీయే సునాయాశ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏ కూటమి పక్షాలకు రెండ్రోజులపాటు నిర్వహించిన శిక్షణా తరగతులు, మిత్రపక్షాలతో సమన్వయం, పోలింగ్‌కు ముందు ప్రాంతాలవారీగా ఎంపీలతో సమన్వయం రాధాకృష్ణన్ గెలుపునకు దోహదం చేసిందని చెబుతున్నారు. మిన్నంటిన సంబరాలు.. సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించిన వెంటనే బీజేపీలో సంబరాలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి నివాసం ముందు తమిళనాడు సంప్రదాయాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సీపీ రాధాకృష్ణన్‌కు బీజేపీ ఎంపీలతోపాటు ఆయనకు మద్దతిచ్చిన పక్షాల ఎంపీలు శుభాకంక్షలు తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా, ఖర్గే శుభాకాంక్షలు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర అమిత్ షా సహా పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్ట్‌లు చేశారు. ‘ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు అభినందనలు. ప్రజాజీవితంలో దశబ్దాల గొప్ప అనుభవం, దేశ పురోగతికి గణనీయంగా దోహడపతుంది. విజయవంతమైన, ప్రభావవంతమైన పదవీకాలం కోసం మీకు ఇవే నా శుభాకాంక్షలు’అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సందేశాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘రాధాకృష్ణన్‌కు ఎంపీగా, వివిధ రాష్ట్రాల గవర్నర్‌గా గొప్ప అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎల్లప్పుడూ చురుకైనవి. గవర్నర్‌గా పదవీకాలంలో, సాధారణ పౌరులు ఎదుర్కొన్న సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. ఈ అనుభవాలు ఆయనకు శాసన, రాజ్యాంగ విషయాలపై అపార జ్ఞానం ఉందని నిర్ధారించాయి. ఆయన స్ఫూర్తిదాయకమైన ఉపరాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకం ఉంది‘ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాధాకృష్ణన్ నాయకత్వ లక్షణాలను, పరిపాలనపై ఆయనకున్న లోతైన జ్ఞానాన్ని అమిత్ షా ప్రశంసించారు. రాధాకృష్ణన్ అనుభవం, అట్టడుగు స్థాయి నేపథ్యం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అణగారిన వర్గాలకు సేవ చేయడానికి సహాయపడతాయని షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగువ సభ సంరక్షకుడిగా ఆయన కొత్త పాత్రలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి పెదవివిప్పని జగ్దీప్ ధన్‌ఖడ్.. సీపీ రాధాకృష్ణన్ విజయం నేపథ్యంలో తొలిసారి స్పందించారు. ప్రజాజీవితంలో రాధాకృష్ణన్‌కు ఉన్న అపార అనుభవంతో ఉపరాష్ట్రపతి కార్యాలయం మరింత ఖ్యాతిని పొందుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు లేఖ రాశారు. ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నాం: ఖర్గే ‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు. ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్‌రెడ్డి పోరాటానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాధాకృష్ణన్ పార్లమెంటరీ సంప్రదాయాల అత్యున్నత నైతికతను నిలబెట్టుకుంటారని, ప్రతిపక్షాలకు గౌరవాన్ని ఇస్తారని, ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నా. వర్షాకాల సమావేశాల్లో జగదీప్ ధన్‌ఖడ్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు, ఇది ఎందుకు అనేది ఎప్పటికీ వివరించలేం. రాజ్యాంగ స్థానాలపట్ల గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది’అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. -
సీపీ రాధాకృష్ణన్‌కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రడ్డి అభినందనలు తెలియజేశారు. ‘ రాధాకృష్ణన్ జీ.. మీరు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు నా అభినందనలు. దేశానికి మీరు చేసే సేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ అంకితభావం, సుదీర్ఘ అనుభవం మన దేశానికి ఖచ్చితంగా మార్గనిర్దేశంగా పని చేస్తాయి అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Congratulations Shri C. P. Radhakrishnan Ji on being elected as the Vice President of India!Wishing you all the success in your service to the Nation. Your dedication and experience will surely guide our country.@CPRGuv pic.twitter.com/QRJ8SUEixe— YS Jagan Mohan Reddy (@ysjagan) September 9, 2025 కాగా, ఉపరాష్ట్రపతి ఎంనిక కోసం ఈరోజు(మంగళవారం సెప్టెంబర్ 9వ తేదీ) జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది. -
ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది.ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో జరిగిన పోలింగ్‌లో బ్యాటెట్ పత్రాలనే ఉపయోగించారు. రెండో ప్రాధాన్యత ఓటు ఉండటం వల్ల ఈవీఎంలను వాడలేదు. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 కాగా ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగుకు దూరంగా బీఆర్ఎస్ (4 రాజ్యసభ), బీజేడీ(7), శిరోమణి అకాలీదల్(3) దూరంగా ఉన్నాయి. దాంతో 767 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు !మాత్రమే ఉంది. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగ్గా, అటు తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. ‘తమిళనాడు మోదీ’గా పేరుసి.పి.రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించారు. 16 ఏళ్లకే ఆరెస్సెస్‌లో చేరారు. బీజేపీ మాతృ సంస్థ జనసంఘ్‌తో ఆయనకు బలమైన అనుబంధముంది. అభిమానులు ఆయనను ‘తమిళనాడు మోదీ’ అని పిలుస్తుంటారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీలో బలమైన ఓబీసీ నేతగా ఎదిగిన ఆయనకు పార్టీ పలుమార్లు గవర్నర్‌గా అవకాశమిచ్చింది. జార్ఖండ్ గవర్నర్‌గా, తెలంగాణ ఇన్చార్జి గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సేవలందించారు. 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్నారు. రాధాకృష్ణన్ 1974లో జనసంఘ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడయ్యారు. తర్వాత తమిళనాడు బీజేపీ కార్యదర్శి అయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌గా, సభ్యుడిగా చేశారు. స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విచారణకు సారథ్యం వహించారు. 2004 నుంచి మూడేళ్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 93 రోజులపాటు 19,000 కిలోమీటర్ల మేర రథయాత్ర చేశారు.మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తా: సుదర్శన్రెడ్డిమరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తానని ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు.. ఓటమిని స్వీకరించాలన్నారు. ‘ ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు. ప్రజాస్వామ్య బలం.. కేవలం విజయంలో మాత్రమే లేదు. చర్చలు, నిరసన ద్వారా కూడా ప్రజాస్వామ్యం బలపడుతుంది. విజయం సాధించిన రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు’ అని తెలిపారు.రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపిన అమిత్ షాఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన రాధాకృష్ణన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన నాయకుడని ఆయన కొనియాడారు. ఖర్గే శుభాకాంక్షలురాధాకృష్ణన్కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో జస్టిస్ సుదర్శన్రడ్డి పోరాటానికి సైతం కృతజ్ఞతలు తెలిపారు. ‘ ఇది ఎన్నిక మాత్రమే కాదు.. ఇది సిద్ధాంతాల యుద్ధం. పార్లమెంట్ సంప్రదాయాలను రాధాకృష్ణన్ కాపాడతారని ఆశిస్తున్నా. ప్రతిపక్షాలకు సరైన సమయం కేటాయిస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. -
YSRCP మద్దతు సీపీ రాధాకృష్ణన్ కే..!
-
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయంఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం452 ఓట్లు సాధించిన సిపి రాధాకృష్ణ98.2 పోలింగ్ శాతం నమోదుచెల్లని ఓట్లు 15ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పోటీఇందుకోసం పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాయంత్రం 6 గంటల తర్వాత ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ఫలితాలు ఈ రాత్రి ప్రకటించబడే అవకాశం ఉంది.ఓటింగ్‌కు దూరంగా ఉన్న పార్టీలుబీఆర్ఎస్, బీజేడీ,శిరోమణి అకాలీ దళ్లు ఓటింగ్‌కు దూరం వీరి నిర్ణయం వల్ల తగ్గిన ఓటింగ్ కానీ ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం ఉందని అంచనాఓటేసిన లోక్‌సభ స్పీకర్ఉపరాష్ట్రపతి ఎన్నిక.. కొనసాగుతున్న పోలింగ్ఓటేసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాఇది బీజేపీకి ఎదురుదెబ్బే: సంజయ్ రౌత్ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌కు బీఆర్ఎస్, బీజేడీ, అకాలీదళ్ దూరంఈ మూడు బీజేపీతో గతంలో అంటకాగిన పార్టీలేనన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ఇప్పుడు దూరంగా ఉండడం ఆ పార్టీకి ఎదురుదెబ్బేనని వ్యాఖ్య96 శాతం పోలింగ్ నమోదుకొనసాగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్3గం. దాకా 96 శాతం పోలింగ్ నమోదు5 గం. దాకా జరగనున్న పోలింగ్6గం. కౌంటింగ్ మొదలు7.45గం. కి ఫలితం వెల్లడిఇండియా కూటమి వైపే ఒవైసీఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్రెడ్డిసుదర్శన్రెడ్డికి మద్దతు ప్రకటించిన ఎంఐఎంహైదరాబాద్వాసి, గౌరవనీయుడైన న్యాయకోవిదుడికి మద్దతంటూ ఒవైసీ ట్వీట్ఓటు హక్కు వినియోగించుకున్న ఒవైసీవిజయంపై ఎన్డీయే ధీమాఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్రాత్రికల్లా వెలువడనున్న ఫలితంసంఖ్యా బలం దృష్ట్యా.. విజయంపై ఎన్డీయే ధీమాముందస్తుగా.. విందు ఏర్పాట్లలో ముమ్మరంకేంద్ర మంత్రి ప్రహ్లాద్ ఇంట ఎన్టీయే కూటమి కీలక నేతలకు విందు ఏర్పాట్లుఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్సీపీ ఎంపీలుఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన వైఎస్సార్సీపీ ఎంపీలుఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కి మద్దతు ప్రకటించిన వైఎస్సార్‌సీపీపోలింగ్‌కు దూరంగా మరో పార్టీఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా శిరోమణి అకాలీదల్పార్లమెంట్లో ఎస్ఏడీ సంఖ్యా బలం.. మూడుఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించిన బీజేడీ, బీఆర్ఎస్ఓటు హక్కు వినియోగించుకోనున్న 769 మంది ఎంపీలుకొనసాగుతున్న ఉపరాష్ట్రపతి పోలింగ్ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్న ఎంపీలుసాయంత్రం 6గంటల తర్వాత వెలువడనున్న ఫలితాలుతొలి ఓటు వేసిన ప్రధాని మోదీఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభంతొలి ఓటు వేసిన ప్రధాని మోదీఅనంతరం.. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే తదితరులుఓటింగ్ వేళ ప్రత్యేక ఆకర్షణగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ఓటేశాక.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన రాహుల్ గాంధీసాయంత్రం ఐదు గంటల దాకా జరగనున్న పోలింగ్ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ నో విప్.. తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యం ప్రకారం ఓట్లేయనున్న ఎంపీలు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా గడిలో 1 అంకెతదుపరి ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థి పేరు ఎదుటనున్న గడిలో 2 అంకె ఎన్నికల సంఘం సమకూర్చే పెన్నుతోనే మార్కింగ్ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధంమరికాసేపట్లో పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ప్రారంభం కానున్న పోలింగ్ 6 గంటలకు ఓట్ల లెక్కింపు రాత్రికి విజేతను ప్రకటించే అవకాశంఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిల మధ్య పోరుమద్దతు ఇలా.. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే పోలింగుకు దూరంగా బీఆర్ఎస్ (4 రాజ్యసభ), బీజేడీ(7) లెక్క ప్రకారం.. 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేతబలాబలాలు.. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు ! ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. ఎన్డీయే అభ్యర్థి గెలుపు లాంఛనమే! బ్యాలెట్ ఓటింగ్రహస్య బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రాధాన్య ఓట్లు వేసే పద్ధతి కావడం వల్ల బ్యాలెట్లనే వాడకం. ఈవీఎంలలో ఈ సదుపాయం లేదు.తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లేయనున్న ఎంపీలు అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లువస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలో తీసుకుంటారు.నచ్చిన అభ్యర్థికే ఓటింగ్తమ సభ్యులకు విప్ జారీచేయకూడదని పార్టీలకు ఎన్నికలసంఘం స్పష్టీకరణ. ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం చేసిన ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు గత రెండ్రోజులుగా ఎంపీలందర్నీ ఢిల్లీకి రప్పించి ఓటింగుకు సమాయత్తం చేసిన ఇరు కూటములుఇప్పటికే ముగిసిన నమూనా(మాక్) పోలింగ్ గతంలో.. ఫస్ట్ టైం.. 2022 ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ఓట్లేసిన 725 మంది ఎంపీలు ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌కు 528 (74.37%), ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు 182 (25.63%) దక్కిన ఓట్లు 15 ఓట్లు చెల్లలేదు. 55 మంది ఓటింగుకు గైర్హాజరు 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ.. తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం -
నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశ తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆరోగ్య కారణాలరీత్యా జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు భవనంలో పోలింగ్ ప్రక్రియ సాగనుండగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాల అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అభ్యర్థులిద్దరూ తమకు మద్దతు కోరుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఆయా పార్టీలు సోమవారం వేర్వేరుగా మాక్ పోలింగ్‌ను నిర్వహించాయి. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్ వసుధలోని రూమ్ నంబర్ ఎఫ్–101లో పోలింగ్ జరగనుంది. 6 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితం వెల్లడి కానుంది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), రాజ్యసభకు నామినేటెడ్ అయిన 12 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఏకు సొంతంగా 422 మంది సభ్యుల బలం ఎలక్టోరల్ కాలేజీలోని బలాబలాల పరంగా చూస్తే ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 781 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం 542 మంది సభ్యులున్న లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉంది. ఇక 239 మంది సభ్యులున్న రాజ్యసభలో పాలక కూటమికి 129 మంది సభ్యుల మద్దతు ఉంది. విజయానికి అవసరమైన ఓట్లు 391 కాగా, ఎన్డీఏకు సొంతంగానే 422 మంది సభ్యుల బలం ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ 11 మంది సభ్యుల మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించడంతో ఆ సంఖ్య 433కి చేరనుంది. ఇక విపక్ష ఇండియా కూటమికి రెండుసభల్లో కలిపి 311 ఓట్లు ఉండగా, ఈ కూటమికి ఆప్ మద్దతు ప్రకటించింది. దీంతో కూటమి బలం 320 మాత్రమే దాటుతోంది. అయితే రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో ఎంపీలు తమ పార్టీల విప్‌ను పాటించాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీల మాక్ పోలింగ్.. పార్టీల బలాబలాలపై ఇరు పక్షాలకు స్పష్టత ఉన్నప్పటికీ ఓట్లు చెల్లుబాటు కాకుండా పోవడంపై ఆందోళన, క్రాస్ ఓటింగ్ భయం రెండు కూటముల్లోనూ కనిపిస్తోంది. 2022 ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లకుండా పోవడంతో ఈసారి పార్టీలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ తమ ఎంపీల కోసం ఆది, సోమవారాల్లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ పాత పార్లమెంట్ భవనం సెంట్రల్హాల్లో మాక్ పోలింగ్ ద్వారా తమ ఎంపీలకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్ష ఎంపీలకు విందు ఇచ్చారు. సంవిధాన్ సదన్‌లో జరిగిన సమావేశంలో ఖర్గేతో పాటు సోనియాగాం«దీ, శరద్‌పవార్, టీఆర్ బాలు, అఖిలేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సైతం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఎంపీలతో మాక్ పోలింగ్ నిర్వహించింది. ఎన్డీఏ ఎంపీలతో మోదీ సమావేశం మంగళవారం ప్రధాని మోదీ ఎన్డీయే ఎంపీలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం..‘రాధాకృష్ణన్ అద్భుతమైన ఉప రాష్ట్రపతి అవుతారని ప్రజలు విశ్వసిస్తున్నారు..’అంటూ ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు. కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ మచ్చలేని నేతగా అభివరి్ణస్తోంది. రాజకీయ, పాలనాపరమైన ఆయన విశేష అనుభవం..రాజ్యసభ చైర్మన్‌గా విధులు నిర్వర్తించేందుకు ఉపకరిస్తుందని పేర్కొంటోంది. ఇక విపక్షాల అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి 2011లో సుప్రీంకోర్టులో పదవీ విరమణ పొందారు. నల్లధనం, సల్వాజుడుం తదితర కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు.బీఆర్ఎస్, బీజేడీ దూరంరెండు కూటములకు సమాన దూరాన్ని పాటిస్తూ వస్తున్న బీఆర్ఎస్, బీజేడీలు ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించాయి. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్కు నలుగురు, బీజేడీకి ఏడుగురు సభ్యుల బలం ఉంది. -
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన వైవీ సుబ్బారెడ్డి
ఢిల్లీ: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యరథి సీపీ రాధాకృష్ణన్‌ను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 7వ తేదీ) సీపీ రాధాకృష్ణన్‌తో వైబీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌ను కలిశారు సుబ్బారెడ్డి. తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 11 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు అనుకూలంగా ఓటేస్తున్నట్లు రాధాకృష్ణన్‌కు సుబ్బారెడ్డి వెల్లడించారు. తనకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు రాధాకృష్ణన్. రాజ్యాంగ పదవులను ఏకగ్రీవం చేయాలన్నది వైయస్ జగన్ అభిమతమని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి సంఖ్యా బలం లేకున్నా పోటీ చేస్తున్నారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే, ఉపరాష్ట్రపతి ఎన్నికలో భాగంగా రేపు(సోమవారం, సెప్టెంబర్ 8వ తేదీ) ఒంటి గంటకు సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముఖాముఖి పోరు
న్యూఢిల్లీ: దేశ 17వ ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9వ తేదీన జరిగే ఎన్నిక బరిలో అధికార ఎన్డీయే బలపరిచిన సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మిగిలారు. ఈ ఇద్దరు అభ్యర్థులు అందజేసిన నాలుగేసి సెట్ల నామినేషన్ పత్రాలు సరిగ్గా ఉన్నాయని ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ తెలిపారు. వీటిని అంగీకరించామని చెప్పారు. శుక్రవారంతో నామినేషన్ల పరిశీలనకు గడువు ముగియడంతో, దక్షిణాదికే చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య ద్విముఖ పోటీ ఖరారైనట్లయింది. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సీపీ రాధాకృష్ణన్, సుదర్శన్‌రెడ్డిల నామినేషన్లు మినహా సరిగా లేని మిగతా అన్ని నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ వివరించారు. -
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు
న్యూఢిల్లీ: రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలయ్యింది. బుధవారం ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ తన నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తన నామినేషన్ పత్రాలను అందించారు. ఈ నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతలంతా సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతుగా సంతకాలు చేశారు.సీపీ రాధాకృష్ణన్ మద్దతుగా 20 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీనికి ముందు ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎన్డీఏ పక్ష నేతలు సమావేశమయ్యారు. కాగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం ఎన్డీయే ఎంపీల సమావేశం జరగగా, ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ప్రధాని స్వయంగా ఎంపీలకు పరిచయం చేశారు. అనంతరం ఆయనను సన్మానించారు. -
సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు కోరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీకి దిగిన సీపీ రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రధాని మోదీ కోరారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. సీపీ రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రతిపక్షాలతో సహా అన్ని పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారని తెలిపారు.ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ ఎంపీలు, ఫ్లోర్ లీడర్లు స్వాగతించారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ.. సీపీ రాధాకృష్ణన్ పరిచయం చేశారు.ఎన్టీఏతో పాటు అన్ని పార్టీల ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘ఉపరాష్ట్రపతి ఎన్నికలో తాము రాధాకృష్ణన్‌కు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మన ప్రజాస్వామ్యానికి, మన దేశానికి, రాజ్యసభను నడపడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని’ ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సి.పి.రాధాకృష్ణన్
ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ (67) పేరు ఖరారైంది. ఆదివారం జరిగిన బీజేపీ పార్లమెంట్ బోర్డు భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కూటమి పక్షాలతో చర్చించి ఆయన పేరు ఖరారు చేసినట్టు వెల్లడించారు. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ విషయమై విపక్షాలతో గత వారమే చర్చించారు. ఎన్డీయే అభ్యర్థి తేలాక మద్దతుపై నిర్ణయిస్తామని బదులిచ్చాయి. వాటి మద్దతు కూడగట్టడానికి చర్చలు కొనసాగుతాయి’’ అని స్పష్టం చేశారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యరి్థగా సి.పి.రాధాకృష్ణన్ పేరు ఖరారు కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఆయన సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని శనివారం ‘ఎక్స్’లో ప్రశంసించారు. అంకితభావం, మానవత్వం, ప్రతిభ కలిగిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. సామాజిక సేవపై ప్రధానంగా దృష్టి పెట్టి పనిచేశారని తెలిపారు.గెలుపు లాంఛనమే ఉప రాష్ట్రపతి ఎన్నికలో విజయానికి అవసరమైన మెజార్టీ ఎన్డీయే కూటమికి ఉన్నందున రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే. 781 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. విజయానికి కనీసం 391 ఓట్లు అవసరం కాగా ఎన్డీఏకు 422 మంది ఎంపీల బలముంది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. విపక్ష ‘ఇండియా’ కూటమి ఉమ్మడి అభ్యర్థి తదితరులు బరిలో దిగితే ఎన్నిక అనివార్యమవుతుంది. పోటీపై నిర్ణయం తీసుకునేందుకు ‘ఇండియా’ కూటమి నేతలు సోమవారం భేటీ అవుతున్నారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ఇటీవల అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది.‘తమిళ’ ఎన్నికలే గురి! తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి. స్టాలిన్ సారథ్యంలోని అధికార డీఎంకేను ఎలాగైనా ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎంపిక అందులో భాగంగానే కనిపిస్తోంది. ఆయన ఓబీసీ నేత కావడం, క్లీన్ ఇమేజీ ఉండటం ఎన్డీయేకు కలిసొచ్చే అంశం. పైగా అన్ని పార్టీలూ ఆయనను గౌరవిస్తుంటాయి. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో రాధాకృష్ణన్‌ది కీలకపాత్ర. తమిళనాడు మోదీ! సి.పి.రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జని్మంచారు. 16 ఏళ్లకే ఆరెస్సెస్‌లో చేరారు. బీజేపీ మాతృ సంస్థ జనసంఘ్‌తో ఆయనకు బలమైన అనుబంధముంది. అభిమానులు ఆయనను ‘తమిళనాడు మోదీ’ అని పిలుస్తుంటారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీలో బలమైన ఓబీసీ నేతగా ఎదిగిన ఆయనకు పార్టీ పలుమార్లు గవర్నర్‌గా అవకాశమిచ్చింది. జార్ఖండ్ గవర్నర్‌గా, తెలంగాణ ఇన్చార్జి గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సేవలందించారు. 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్నారు. రాధాకృష్ణన్ 1974లో జనసంఘ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడయ్యారు. తర్వాత తమిళనాడు బీజేపీ కార్యదర్శి అయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌గా, సభ్యుడిగా చేశారు. స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విచారణకు సారథ్యం వహించారు. 2004 నుంచి మూడేళ్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 93 రోజులపాటు 19,000 కిలోమీటర్ల మేర రథయాత్ర చేశారు.- న్యూఢిల్లీ