
ఢిల్లీ: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యరథి సీపీ రాధాకృష్ణన్‌ను వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 7వ తేదీ) సీపీ రాధాకృష్ణన్‌తో వైబీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌ను కలిశారు సుబ్బారెడ్డి.
తమ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 11 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీలు అనుకూలంగా ఓటేస్తున్నట్లు రాధాకృష్ణన్‌కు సుబ్బారెడ్డి వెల్లడించారు. తనకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు రాధాకృష్ణన్.
రాజ్యాంగ పదవులను ఏకగ్రీవం చేయాలన్నది వైయస్ జగన్ అభిమతమని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి సంఖ్యా బలం లేకున్నా పోటీ చేస్తున్నారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే, ఉపరాష్ట్రపతి ఎన్నికలో భాగంగా రేపు(సోమవారం, సెప్టెంబర్ 8వ తేదీ) ఒంటి గంటకు సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.
