Crda meeting
-
మళ్లీ తెరపైకి సింగపూర్ డ్రామా.. విదేశాలకు అమరావతి నిధులు..
-
ఆర్భాటాలొద్దు పనులు చేయండి
సాక్షి, అమరావతి : సీఆర్డీఏ పరిధిలో ప్రభుత్వ నిర్మాణాల సముదాయం, భవనాల నిర్మాణంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలకు తగినట్లు ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన పనులు, చేసిన ఖర్చులు, వివిధ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, అనవసర ఖర్చులకు పోకుండా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలని సూచించారు. పూర్తికావస్తున్న పనులపై తొలుత దృష్టి పెట్టాలని, ఇందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నిర్మాణ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌కు వెళితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందన్నారు. రోడ్ల డిజైన్‌కు ఐఐటీల సలహా సీఆర్డీఏ పరిధిలో రోడ్ల డిజైన్లపై అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.. ప్లానింగ్‌లో ఎక్కడా తప్పుల్లేకుండా చూడాలని ఆదేశించారు. రహదారుల ప్రతిపాదనల విషయంలో ఖర్చు, డిజైన్ల వంటి అంశాలపై ఐఐటీ వంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. కృష్ణా నది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. వైకుంఠపురం రిజర్వాయర్ నిర్మాణం, నీటి వినియోగం వంటి అంశాలపై ఆరా తీశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణానికి పోగా మిగిలిన భూమిని సుందరీకరించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనలో అనవసర వ్యయం తగ్గించి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీ నరసింహం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీఆర్డీఏ అధికారులకు షాక్
అమరావతి: సీఆర్డీఏ అధికారులకు పెనుమాక రైతులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. భూసేకరణ అభ్యంతరాలపై ఈరోజు సీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లకూడదని అన్నదాతులు నిర్ణయించారు. దీనిపై పెనుమాకలో డప్పుతో చాటింపు కూడా వేయించారు. ఇకపై సీఆర్డీఏ అధికారులు ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేసినా హాజరుకాకూడదని గ్రామస్తులు నిర్ణయించారు. రెండేళ్లలో చాలాసార్లు అభ్యంతరాలు ఇచ్చామని, అధికారులు ఏ ఒక్కటీ పట్టించుకోలేదని.. పైగా సమావేశాలకు పిలిచి అక్రమ కేసులు పెడుతున్నారని పెనుమాక రైతులు తెలిపారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజధానికి భూసేకరణ కోసం ఇంతకుముందు సీఆర్డీఏ నిర్వహించిన బహిరంగ విచారణను అడ్డుకున్నారనే ఆరోపణలతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సహా 13 మంది పెనుమాక రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈనెల 6న ఎమ్మెల్యే ఆర్కేను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. -
10 నుంచి లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లు
మంత్రి నారాయణ వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో: జూన్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 23 వరకు రాజధాని రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరించారు. లాటరీ తీసిన వెంటనే ఏ రైతుకు ఎక్కడ ప్లాటు కేటాయిస్తారనే విషయాన్ని తెలిపేందుకు జియో కో-ఆర్డినేషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. తమకు రావాల్సిన ప్లాట్లకు సంబంధించి రైతులు 9.18ఎ, 9.18బి ఫారాల ద్వారా ఆప్షన్లు సమర్పించే గడువు శుక్రవారంతో ముగుస్తున్నా రైతుల కోసం ను ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. భూసమీకరణ ప్యాకేజీ కింద మెట్ట రైతులకు అదనంగా 50 గజాలు ఇచ్చేందుకు ఈ సమావేశం ఆమోదించినట్లు చెప్పారు. రాజధాని గ్రామాల్లో భవన నిర్మాణాలకు సంబంధించిన ఎఫ్ఎస్ఐ (ఫ్లోర్ ఇండెక్స్ ఏరియా) నిబంధనల సవరణకూ సమావేశం ఆమోదం తెలిపిందని, ఇదే విధానాన్ని సీఆర్డీఏ పరిధి అంతటికీ వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.