CRDA Review
-
అప్పుడు రాజమౌళి..ఇప్పుడు దగ్గుబాటి
సాక్షి, అమరావతి: రాజధాని డిజైన్లకోసం ఇంతకుముందు సినీ దర్శకుడు రాజమౌళితో సంప్రదింపులు జరిపిన సీఎం చంద్రబాబునాయుడు తాజాగా రాజధానిలో ప్రతిపాదించిన మీడియా సిటీ నిర్మాణానికి సంబంధించి మరో సినీ ప్రముఖుడు దగ్గుబాటి సురేష్‌బాబుతో చర్చలు జరిపారు. సీఆర్డీఏ సమీక్షా సమావేశానికి ఆయన్ను ఆహ్వానించి సలహాలు తీసుకున్నారు. గురువారం సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ సమీక్ష సమావేశంలో మీడియా సిటీ నిర్మాణం, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చంద్రబాబు.. సురేష్‌బాబుతో చర్చించారు. మీడియా సిటీలో 25 ఎకరాల్లో మూవీ స్టూడియో ఏర్పాటు ప్రతిపాదన గురించి సీఆర్డీఏ అధికారులు వివరించగా.. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన తెలుగు సినీ పరిశ్రమను రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై సురేష్‌బాబు సూచనలు ఇచ్చారు. సినీ, టీవీ పరిశ్రమ హైదరాబాద్‌కే పరిమితమైందని, ఏపీలోని స్థానిక నైపుణ్యతను, కళాకారులు, సాంకేతిక నిపుణులను వినియోగించుకుంటే మరో ఏడాదిన్నరలో పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ మీడియా సిటీ నిర్మాణం సృజన, కంటెంట్‌పైనే ఆధారపడబోతోందని చెప్పారు. రాజధానిలో తొమ్మిది నగరాల నిర్మాణానికి సంబంధించి తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి సలహాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఎఫ్‌కు రెండు దీవులు: కృష్ణా నదిలో ఉన్న ఏడు దీవుల్లో ముఖ్యమైన రెండింటిని యూఈఏకి చెందిన బిజినెస్ లీడర్స్ ఫోరమ్ (బీఎల్ఎఫ్)కు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం తరఫున సీఆర్డీఏ.. బీఎల్‌ఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా రెండు దీవుల్లో సుమారు 500 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్, కన్వెన్షన్ సెంటర్, హోటల్ కాంప్లెక్స్, రిసార్ట్ విల్లాల ఏర్పాటుకు బీఎల్ఎఫ్ చైర్మన్ రామ్ బుక్సాని ప్రతిపాదనలిచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని దీవుల అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టులు, నగరాల అభివృద్ధిలో జాప్యం లేకుండా పనులు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ మంత్రి నారాయణ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
ఒకటి నుంచి పరిపాలనా నగరం పనులు
సీఆర్డీఏ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి : నవంబర్ ఒకటో తేదీ నుంచి అమరావతిలో పరిపాలన నగర నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న వేగం సరిపోదని, ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిన పనులు చురుగ్గా జరిగేలా చూడాలన్నారు. బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని వ్యవహారాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలన నగర నిర్మాణంతోనే అసలు పనులు ప్రారంభమవుతాయని, దీని నిర్మాణంతోనే రాజధానికి ఒక రూపు వస్తుందన్నారు. కృష్ణానదిలోని ఇసుకను ఇక్కడే పూర్తిస్థాయిలో నిల్వ ఉంచాలని సీఆర్డీఏ తన నియంత్రణలో ఉంచుకోవాలని సీఎం సూచించారు. పెద్దఎత్తున అవసరమయ్యే సిమెంట్ కోసం రాజధానికి దగ్గర్లోనే ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు తయారీదారులకు అవకాశం కల్పిస్తామన్నారు. -
ఆ భూములతో వ్యాపారం చేస్తాం
-
ఆ భూములతో వ్యాపారం చేస్తాం
సీఆర్డీఏ సమీక్షలో సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చే సింగపూర్, జపాన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని వ్యాపారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రైతుల నుంచి సేకరించిన భూమిని ప్రైవేటు కంపెనీలకు అభివృద్ధికిచ్చి వారితో కలిసి తాము కూడా పెట్టుబడులు పెట్టి లాభాలు అర్జిస్తామన్నారు. ఇందుకోసం అమరావతి డెవలప్మెంట్ కంపెనీని ఏర్పాటు చేస్తామన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పెట్టుబడులు ఎంత పెట్టాలి, ఏ నిష్పత్తిలో వ్యాపారం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు ఇలా టౌన్‌షిప్‌లు కట్టి లాభాలు సాధించాయని, సింగపూర్‌లోని తమాసిన్ కంపెనీ ఇదే తరహాలో ఏడు లక్షల కోట్ల టర్నోవర్ సాధించిందని తెలిపారు. రాజధాని కోసం రైతులు ఇప్పటికే 33 వేల ఎకరాలు ఇచ్చారని, ఈ ప్రాంతంలోనే మరో 50 వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేయిస్తామని చెప్పారు ఈ 83 వేల ఎకరాలను ప్రైవేటు కంపెనీలకు అభివృద్ధికిచ్చి, అందులో తాము పెట్టుబడులు పెడతామన్నారు. వచ్చే లాభాలను పంచుకుంటామని, రియల్ ఎస్టేట్ కంపెనీలాగే పనిచేస్తామని తెలిపారు.2018 నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను భూసేకరణ ద్వారా తీసుకోవడానికి డబ్బు లేదన్నారు. పండుగలా శంకుస్థాపన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం దసరా పండుగలా జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన సీఆర్డీఏ కమిటీతో సమీక్ష నిర్వహించారు. శంకుస్థాపనకు ప్రధాని వస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. శంకుస్థాపనకు అన్ని గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామంలోని కొంత మట్టి తెచ్చి అమరావతి మట్టిలో కలిపి భావోద్వేగం నింపాలన్నారు. అవగాహన ఒప్పందాలు ఖరారు ఇంధన రంగంలో ఉజ్వల భవితకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే కాకినా డ డీప్ సీ వాటర్ పోర్టులో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజ యవాడ గేట్ వే హోటల్లో సీఎం సమక్షంలో ఏపీ గ్యాస్ డెవలప్మెం ట్ కార్పొరేషన్ , గెయి ల్, షెల్, ఇంజీ కంపెనీలు రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.రానున్న 13నెలల్లో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మిస్తామని బాబు హామీ ఇచ్చారు.