credit card bill
-
క్రెడిట్ కార్డు యూజర్లకు అలెర్ట్
గడువు ముగిసిన క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన కార్డు చెల్లింపులపై ఏటా 30 శాతానికి వడ్డీరేట్లను పరిమితం చేస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీడీఆర్సీ) 2008లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పువల్ల కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో బ్యాంకులకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇచ్చినట్లు అవుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.అసలేం జరిగిందంటే..క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ చెల్లింపులపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 30 శాతానికి పరిమితం చేస్తూ ఎస్సీడీఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆవాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కార్డు బకాయిలపై ఏడాదికి 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేయడం వడ్డీ విధానాల కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొంది. కాగా, ఇటువంటి అధిక వడ్డీరేట్లు మితిమీరినవని, అన్యాయమైన వాణిజ్య పద్ధతని ఎస్సీడీఆర్సీ గతంలో తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ, ప్రస్తుత నిబంధనలకు లోబడి బ్యాంకులు తమ సొంత వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.ఇదీ చదవండి: రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులుఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసింది. వడ్డీ రేట్లను మార్కెట్ డైనమిక్స్, ఆర్బీఐ నియంత్రణ పర్యవేక్షణ ద్వారా నియంత్రిస్తారని కోర్టు నొక్కి చెప్పింది. భారతదేశంలోని చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్లను ప్రత్యేక పరిస్థితుల్లో 22% నుంచి 49% వరకు వసూలు చేస్తున్నాయి. -
క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించలేకనే...
దుగ్గొండి: క్రెడిట్ కార్డులపై తీసుకు న్న రుణం చెల్లించాలని బ్యాంకర్లు వేధించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగ ల్ జిల్లా నాచినపల్లిలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నాచినపల్లికి చెందిన దార ప్రసాద్ (35) కాకతీయ వర్సిటీలో డిగ్రీ పూ ర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేశాడు. ఈ క్రమంలోనే వివిధ బ్యాంకులకు చెందిన 10 క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. వాటి ద్వారా రుణం తీసుకొని హైదరాబాద్‌లోనే చిట్టీ వేశాడు. చిట్‌ఫండ్ కంపెనీ దివాలా తీయడంతో ఆ డబ్బులు రాలేదు. దీంతో క్రెడిట్ కార్డుల కిస్తీ లు చెల్లించలేక ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఆయా బ్యాంకుల రికవరీ బృందా లు నాచినపల్లికి వచ్చి ప్రసాద్‌ను నిలదీయగా, ఈ నెల 19న చెల్లిస్తానని చెప్పాడు. వాయిదా సమయం రావడం.. డబ్బు చేతిలో లేక భయపడి ఇంట్లో ఉరివేసుకున్నాడు. ప్రసాద్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు
మారుతున్న జీవనప్రమాణాల కారణంగా చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. సమయానికి ఆన్లైన్లో వస్తువులు కొనడం, ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేయడం, కరెంట్ బిల్లులు పే చేయడం, పెట్రోల్‌బంక్‌లో స్వైప్ చేయడం.. వంటి చాలాపనులకు నిత్యం క్రెడిట్‌కార్డులు వాడుతుంటారు. అయితే కొన్ని ప్రత్యేకకార్డుల్లో ఆయా క్రెడిట్‌కార్డు సంస్థలు రివార్డు పాయింట్లు ఇస్తూంటాయి. వాటిని క్లెయిమ్ చేసుకుని ఇతర వస్తువులు వంటివి ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. తాజాగా కొన్ని బ్యాంక్‌లు అందిస్తున్న క్రెడిట్‌కార్డు లాంజ్ యాక్సెస్, రివార్డ్పాయింట్ల విషయంలో కీలక మార్పులు చేస్తున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. ఇకపై ఆ తరహా రివార్డులను నిలిపివేయనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఎస్బీఐ అందిస్తున్న ఆరమ్, ఎస్బీఐ కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డులు వినియోగిస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని సవరించింది. రానున్న త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే మునుపటి త్రైమాసికంలో కార్డ్ ద్వారా కనీసం రూ.35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్ క్రెడిట్ కార్డ్, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ సహా వివిధ రకాల కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మార్పులు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. యస్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తరహాలోనే యస్ బ్యాంక్ కూడా లాంజ్ యాక్సెస్‌లో నిబంధనల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఏ త్రైమాసికంలో లాంజ్ సదుపాయం పొందాలన్నా అంతకు మునుపటి త్రైమాసికంలో కార్డ్ ద్వారా కనీసం రూ.10,000 వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,470 కోట్లు చెల్లించనున్న ప్రముఖ కంపెనీ యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్‌పై రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్‌తో పాటు వార్షిక రుసుముల్లో కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. బీమా, గోల్డ్/ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్ పాయింట్లూ ఇవ్వబోమని స్పష్టంచేసింది. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో కనీసం రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
రిస్క్ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్బీఐ
దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. జనవరిలో క్రెడిట్‌కార్డ్ రుణాలు ఏకంగా 31.3 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. అన్సెక్యూర్డ్ రుణాలపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రిస్క్ వెయిటేజీ పెంచినప్పటికీ, బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్ రుణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. 2024 జనవరి నెలలో బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులపై ఇచ్చిన రుణాలు 31.3 శాతం పెరిగి రూ.2.6 లక్షల కోట్లకు చేరాయి. 2023 డిసెంబర్లో ఇవి రూ.2.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ క్రెడిట్ కార్డ్ వార్షిక వినియోగం 26.3 శాతం వృద్ధి చెందింది. బ్యాంకింగ్ వ్యవస్థలో రిటైల్ అన్సెక్యూర్డ్ లోన్స్ (వ్యక్తిగత రుణాలు) శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటి ద్వారా ఆర్థిక స్థిరత్వం రిస్క్‌లో పడుతుందని ఆర్బీఐ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చే తనఖాలేని వినియోగ రుణాలపై గత ఏడాది నవంబర్‌లో రిస్క్ వెయిట్‌ను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. అంటే వాటిపై ఆర్థిక సంస్థలు అధిక కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: అత్తకు తగ్గ కోడలు.. నాట్యంలో దిట్ట.. రాధిక గురించి ఆసక్తికర విషయాలు.. దీంతో వ్యక్తిగత రుణాల వృద్ధి డిసెంబర్లో 26.6 శాతం ఉండగా, జనవరిలో 23.3 శాతానికి తగ్గింది. కానీ క్రెడిట్ కార్డు రుణాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. -
TS: భారమైన క్రెడిట్ కార్డు బిల్లు.. దంపతుల ఆత్మహత్య
సాక్షి,మేడ్చల్: జిల్లాలోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కీసర గ్రామానికి చెందిన సురేశ్ కుమార్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపించి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి.. కిస్వా జువెల్లరీ దోపిడీ కేసు కొలిక్కి -
క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో ఆదా ఇలా చేయండి!
మీ క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించలేకపోతున్నారా? అయితే, మీ క్రిడిట్ కార్డు బిల్లును తక్కువ రేటుకే మరో కార్డుకు(బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్) మార్చుకోవచ్చు. ఇది కార్డులు జారీ చేసే బ్యాంకులు వినియోగదారులకు చెప్పే మాట. మీకు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ అంటే ఏంటో సరిగ్గా తెలుసా?. ఎక్కువ క్రెడిట్ కార్డుల వల్ల భారమయ్యే వడ్డీ రేట్లకు ప్రత్యామ్నాయంగా బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ను తెచ్చారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఒక క్రెడిట్ కార్డులోని క్రెడిట్ బ్యాలెన్స్ ను మరో క్రెడిట్ కార్డుకు పంపుకోవచ్చు. క్రెడిట్ కార్డులు మంజూరు చేసే బ్యాంకులు సంవత్సారానికి 40శాతానికి పైగా వడ్డీ రేట్లను చార్జ్ చేస్తున్నాయి. ఈ వడ్డీ రేట్ల నుంచి తప్పించుకోవడానికి బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ఒక అనువైన మార్గం. క్రెడిట్ కార్డును తీసుకున్న కొద్దికాలం(సాధారణంగా ఆరు నెలలు)పాటు బ్యాంకులు వినియోగదారుడి నుంచి ఎలాంటి వడ్డీని వసూలు చేయవు. తీసుకున్న మొత్తాన్ని ఇచ్చిన సమయంలో చెల్లించలేకపోతే సదరు డబ్బుపై బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తాయి. ఎలా పనిచేస్తుంది బ్యాలెన్స ట్రాన్స్ ఫర్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత క్రెడిట్ కార్డుకు మాత్రమే చెల్లుబాటయ్యేలా బ్యాంకు ఓ చెక్కును విడుదల చేస్తుంది. చెక్ ను ఉపయోగించి క్రెడిట్ బిల్లును సదరు వినియోగదారుడు చెల్లించుకోవచ్చు. ఎలా నిర్ణయించుకోవాలి బ్యాలెన్స్ ను ట్రాన్స్ ఫర్ చేసుకోవడం వల్ల ఎంత వడ్డీ అవుతుందో వినియోగదారుడు ముందుగా తెలుసుకోవాలి. తక్కువ వడ్డీ ఉన్న ఆప్షన్స్ ను ఎంచుకోవాలి. బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ పై అందుతున్న రివార్డుల వివరాలను కూడా తెలుసుకోవాలి. వీటన్నింటితో పాటు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ అనంతరం చెల్లింపుల గురించి ముందే లెక్కలు వేసుకుంటే మంచిది.