credit card surcharge
-
క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయొచ్చా?
ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఈ డిజిటల్ చెల్లింపుల కంటే లిక్విడ్ క్యాష్తో మన అవసరాల్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో డెబిట్ కార్డుతో డబ్బుల్ని డ్రా చేస్తుంటాం. మరి క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంది కదా. డబ్బుల్ని డ్రా చేయొచ్చా? డ్రా చేస్తే ఏమవుతుంది? ఆర్ధిక నిపుణులు ఏం చెబుతున్నారు. ఏటీఎంలో డెబిట్ కార్డును ఎలా ఉపయోగిస్తామో.. క్రెడిట్ కార్డును కూడా అలాగే వినియోగించుకోవచ్చు. అయితే, క్రెడిట్ కార్డుల విషయంలో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకుంటే కొన్ని అదనపు ఛార్జీలు బ్యాంకులకు కట్టాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆర్ధికంగా అంత మంచి పద్దతి కాదని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ మీరు మీ క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుండి నగదును విత్‌డ్రా చేస్తే.. సదరు విత్ డ్రాల్ పై సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము సాధారణంగా మీరు ఏటీఎం నుంచి డ్రా చేసిన నగదు పై చెల్లించాలి. మొత్తంగా ఆ అదనపు ఛార్జీలు 2.5% నుండి 3% వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు మీ నెక్ట్స్ క్రెడిట్ కార్డు బిల్ జనరేట్ స్టేట్మెంట్లో యాడ్ అవుతాయి. వడ్డీ సాధారణంగా డెబిట్ కార్డుతో నెలకు 5 సార్లు ఉచితంగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. కానీ క్రెడిట్‌తో అలా కాదు. బ్యాంకులు అందించే క్రెడిట్ కార్డుతో ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేస్తే భారీగా వడ్డీ చెల్లించాలి. ఆ వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేసిన నెంబర్‌ను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ప్రారంభ వడ్డీ నెలకు 3.5% వరకు ఉండవచ్చు. సిబిల్ స్కోర్ తగ్గుతుందా? క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి డబ్బుల్ని డ్రా చేసుకుంటే ఆ ప్రభావం నేరుగా క్రెడిట్ కార్డు స్కోర్‌పై ప్రభావితం చూపదు. అయినప్పటికీ, అధిక ఛార్జీల కారణంగా మీరు కనీస బకాయిని చెల్లించడంలో విఫలం కావచ్చు. మీ క్రెడిట్ కార్డ్ వినియోగం పెరుగుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రయోజనాలు, డీల్స్ రెస్టారెంట్లు, దుకాణాలలో చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని స్వైప్ చేసినప్పుడు, బ్యాంకులు మీకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. కానీ, మీరు నగదు ఉపసంహరించుకోవడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు ఈ అదనపు ప్రయోజనాల్ని పొందలేం. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తప్పా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేయొద్దని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఏ క్రెడిట్ కార్డ్‌లో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో మీకు తెలుసా?
బ్యాంక్‌కు వెళ్లి క్రెడిట్ కార్డ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. కానీ ఏ క్రెడిట్ కార్డ్ మంచిదో తెలుసుకోవడం చాలా కష్టం. ఒకటో, రెండో అయితే ఒకే కానీ మార్కెట్ లో 130 రకాల క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయి. వాటిలో ఏ కార్డ్ వినియోగిస్తే హోటల్స్ రూమ్ బుకింగ్స్‌లో డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్స్ వస్తాయో? ఏ కార్డ్‌పై ఫ్యూయల్ డిస్కౌంట్ లభిస్తాయో మనకు తెలియదు.అయితే వాటిలో మనం తరుచు వాడే 5,6 క్రెడిట్ కార్డ్‌లు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.అవేంటో తెలుసుకొని వినియోగిస్తే ఆర్ధిక ఇబ్బందులతో పాటు, క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇన్ఫినియా - ఎయిర్ పోర్ట్‌లలో ప్యాసింజర్ కోసం ప్రత్యేక సదుపాయాలు ( లాంజ్ యాక్సెస్) ఉంటాయి. వాటిల్లో ఆఫర్స్‌ను సొంతం చేసుకోవచ్చు. , క్లబ్ మారియట్ మెంబర్ షిప్ లభిస్తోంది ఐసీసీఐ బ్యాంక్ ప్లాటినం - ఫ్యూయల్ సర్ ఛార్జీల తగ్గింపు, రెస్టారెంట్లలో 15శాతం డిస్కౌంట్ ఎస్బీఐ ఎలైట్ - ప్రయారిటీ పాస్ మెంబర్ షిప్‌తో పాటు, లాంజ్ యాక్సెస్, ట్రిడెంట్ హోటల్ మెంబర్ షిప్ హెచ్ఎస్బీసీ వీసా ప్లాటినం - అమెజాన్ ఓచర్స్, లాంజ్ యాక్సెస్, విమాన ప్రయాణాల్లో డిస్కౌంట్ లలో భోజన సదుపాయం, క్యాష్ బ్యాక్ సిటీ క్యాష్ బ్యాక్ - క్యాష్ బ్యాక్ తో పాటు రెస్టారెంట్ లలో డిస్కౌంట్స్ యాక్సెస్ బ్యాంక్ నియో - అమెజాన్ ఓచర్స్, జోమాటా, పేటిఎం, మింత్రా, బుక్ మై షోలలో డిస్కౌంట్ -
కార్డుల సర్‌చార్జ్ పై ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: డెబిట్ క్రెడిట్ కార్డు చెల్లింపులకు వ్యతిరేకంగా దాఖలపైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్రాన్ని,ఆర్‌బిఐలకు ఆదేశించింది. ఆగస్టు 19లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను, కేంద్ర బ్యాంకును కోరింది. దీనిపై పూర్తి మార్గదర్శకాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై సర్ చార్జ్ విధించడాన్ని సవాలు చేస్తూ అమిత సాహ్ని అనే లాయర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నగదు లావాదేవీలను మినహాయించి కేవలం డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై సర్ చార్జ్ విధించడం అక్రమమని వాదించారు. ఈ చర్య దేశంలో నల్లధనం చలామణిని ప్రోత్సహించేలా ఉందని పిటిషనర్ ఆరోపించారు. 2.5 శాతం చెల్లింపు లేదా అంతకంటే ఎక్కువగా సర్ ఛార్జి విధించడం వలన అక్రమ, అసమాన లావాదేవీలు దేశవ్యాప్తంగా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి, జస్టిస్ జయంత నాథ్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.