Credit disbursement
-
సాగు రుణాలు రూ.20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు గడిచిన పదేళ్ల కాలంలో సాగు రంగానికి సంస్థాగత రుణ సాయం గణనీయంగా పెరిగింది. 2013–14 ఆర్థిక సంవత్సరానికి ఇనిస్టిట్యూషన్లు (బ్యాంక్‌లు) ఇచి్చన రుణ వితరణ రూ.7.3 లక్షల కోట్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) పది నెలల్లో (2024 జనవరి చివరికి) రూ.20.39 లక్షల కోట్లకు (1,268 లక్షల ఖాతాలు) చేరుకున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. నిజానికి 2023–24 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యాన్ని నిర్ధేశించుకోగా, అది మరో రెండు నెలలు మిగిలి ఉండగానే చేరుకోవడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి సాగు రంగానికి రుణాలు రూ.22 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. స్వల్పకాలిక సాగు రుణాలు రూ.3 లక్షల వరకు ఉండే వాటికి కేంద్ర వ్యవసాయ శాఖ వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికింద రైతులు 7 శాతానికే రుణ సాయం పొందొచ్చు. కేంద్రం తనవంతుగా బ్యాంక్‌లకు 2 శాతం సమకూరుస్తోంది. 2022–23 సంవత్సరానికి పంపిణీ చేసిన సాగు రుణాలు రూ.21.55 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. అదే ఏడాదికి కేంద్రం విధించుకున్న లక్ష్యం రూ.18.50 లక్షల కోట్లను మించిన సాయాన్ని బ్యాంకులు అందించాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్(కేసీసీ)పై 4 శాతం రేటుకే అందించే రుణ సదుపాయాన్ని పశు సంవర్ధక, మత్య్సకార రైతులుకు కూడా విస్తరించిన విషయాన్ని సదరు అధికారి గుర్తు చేశారు. 2023 మార్చి నాటికి 7,34,70,282 కేసీసీ ఖాతాలకు సంబంధించిన బకాయిలు రూ.8,85,463 కోట్లుగా ఉన్నాయి. .2.81 లక్షల కోట్ల సాయం పీఎం–కిసాన్ పథకం కింద కేంద్రం అర్హత కలిగిన ప్రతి రైతుకు ఏటా రూ.6,000 చొప్పున అందిస్తుండం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు రూ.2.81 లక్షల కోట్లను ప్రత్యక్ష బదిలీ ద్వారా అందించినట్టు సదరు అధికారి తెలిపారు. సాగు పెట్టుబడి అవసరాలకు సాయంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా గడిచిన పదేళ్లలో పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. మోదీ సర్కారు వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, నూనె గింజలను ఎంఎస్పీపై రైతుల నుంచి సమీకరిచేందుకు గడిచిన పదేళ్ల కాలంలో రూ.18.39 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో భాగంగా చెప్పారు. యూపీఏ పదేళ్ల కాలంలో అందించిన రూ.5.5 లక్షల కోట్ల కంటే మూడు రెట్లు అధికమన్నారు. -
ఆచితూచి రుణాలివ్వండి..!
న్యూఢిల్లీ: ఆర్బీఐ సూచించిన విధంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు రుణ వితరణలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎర్రటి గీతను (హద్దులను/పరిమితులను) గౌరవించాలని, అత్యుత్సాహంతో దూకుడుగా వ్యవహరించరాదని కోరారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌కార్డ్ రుణ విభాగంలో (అన్సెక్యూర్డ్) బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు గడిచిన కొన్నేళ్లలో భారీ వృద్ధిని చూపిస్తుండడం తెలిసిందే. ఫలితంగా ఈ విభాగంలో ఎన్పీఏలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రిస్క్ నియంత్రణకు గాను ఆర్బీఐ ఇటీవలే నిబంధనలు కఠినతరం చేయడం తెలిసే ఉంటుంది. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్‌ల రుణాలకు గాను రిస్క్ వెయిటేజీని 0.25 శాతం మేర పెంచింది. దీనివల్ల బ్యాంకుల వరకే రూ.84,000 కోట్లను అదనంగా పక్కన పెట్టాల్సి రావచ్చని అంచనా. ‘డేట్ విత్ టెక్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి సీతారామన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఉత్సాహం మంచిదే. కానీ, కొన్ని సందర్భాల్లో ఇదీ మరీ ఎక్కువైతే జీర్ణించుకోవడం కష్టం. దీంతో జాగ్రత్తగా ఉండాలని, దూకుడుగా వ్యవహరించడం ద్వారా తర్వాత రిస్‌్కలు చవిచూడొద్దన్న ఉద్దేశంతోనే ఆర్బీఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలను అప్రమత్తం చేసింది’’అని మంత్రి సీతారామన్ వివరించారు. డేటా సురక్షితం అకౌంట్ అగ్రిగేటర్లతో (ఏఏ) పంచుకునే కస్టమర్ల డేటా దేశంలో పూర్తి సురక్షితంగా ఉంటుందని మంత్రి సీతారామన్ హామీనిచ్చారు. డేటా భద్రత విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనను తొలగించే ప్రయత్నం చేశారు. ‘‘అకౌంట్ అగ్రిగేటర్లు డేటా బ్యాంక్ కలిగి ఉంటారనే అభిప్రాయాలు ఉండేవి. నిజానికి వారు డేటా కలిగి ఉండరు. వారి ద్వారా డేటా బదిలీ అవుతుంది. ఏఏ ద్వారా బ్యాంక్ కానీ, కస్టమర్ కానీ డేటా కలిగి ఉండరు. కేవలం రుణాల మంజూరీకే దీన్ని వినియోగించుకుంటారు’’అని మంత్రి చెప్పారు. -
స్వల్పకాలిక రుణాలపై 1.5% వడ్డీ రాయితీ
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో రుణ వితరణను పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రూ.3 లక్షలలోపు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యింది. ఈ భేటీ వివరాలను సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలియజేశారు. సాగు కోసం తీసుకున్న స్వల్పకాలిక రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 2022–23 నుంచి 2024–25 వరకూ అన్ని రకాల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కంప్యూటరైజ్డ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి తీసుకున్న రూ.3 లక్షలలోపు రుణాలపై ఈ రాయితీ వర్తిస్తుందని అన్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా రూ.34,856 కోట్లు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై రాయితీ రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని ఠాకూర్ చెప్పారు. వాస్తవానికి వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీని 2020 మే నెలలో నిలిపివేశారు. బ్యాంకులు 7 శాతం వడ్డీ రేటుతో రైతులకు రుణాలిస్తున్నాయి. ఆర్బీఐ ఇటీవల రెపో రేటును పెంచింది. దీంతో వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. అందుకే వడ్డీ రాయితీని మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసీజీఎల్‌ఎస్‌కు మరో రూ.50,000 కోట్లు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీజీఎల్‌ఎస్)కు 2022–23 కేంద్ర బడ్జెట్లో రూ.4.5 లక్షల కోట్లు కేటాయించారు. ఈ పథకానికి మరో రూ.50,000 కోట్లు ఇవ్వనున్నారు. అదనపు సొమ్మును కోవిడ్‌తో దెబ్బతిన్న ఆతిథ్య, అనుబంధ రంగాలకు రుణాలిస్తారు. భారత్–ఫ్రాన్స్ ఒప్పందానికి ఆమోదం భారత రవాణా రంగంలో అంతర్జాతీయ రవాణా వేదిక(ఐటీఎఫ్) కార్యకలాపాలకు ఊతం ఇవ్వడానికి భారత్–ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2022 జూలై 6న ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇకపై అందరికీ టీకేడీఎల్ డేటాబేస్ సంప్రదాయ విజ్ఞాన డిజిటల్ లైబ్రరీ(టీకేడీఎల్) డేటాబేస్‌ను ఇకపై కేవలం పేటెంట్ అధికారులే కాదు సామాన్యులు ఉపయోగించుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ యూజర్లకు దశలవారీగా ఈ డేటాబేస్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. చందారూపంలో రుసుము చెల్లించి వాడుకోవచ్చు. -
రాజకీయ జోక్యం తగదు
ఐఎంఎస్ ఆధ్వర్యంలో పెన్నార్ భవనం ఎదుట ధర్నా అనంతపురం ఎడ్యుకేషన్: రుణాల పంపిణీలో రాజకీయ జోక్యం నివారించాలని ఐక్య మాదిగ సమాజ్ (ఐఎంఎస్) ఆధ్వర్యంలో మంగళవారం పెన్నార్ భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఐఎంఎస్ అధ్యక్షులు వెంకటేశు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు జీఓ 25 మేరకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని కోరారు. 2015-16 విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా ప్రీ మెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. కార్యక్రమంలో ఐఎంఎస్ జిల్లా అధ్యక్షులు మల్లేసు, కార్యదర్శి శంకర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టి.లక్ష్మీ, నాయకులు వరలక్ష్మీ, రాణి, ఓబులేసు, గోపాల్, వెంకటరాముడు, రాము, గిరమ్మ, సుంకమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.