Cricket Australia XI
-
అత్యుత్తమ టెస్ట్ జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా
2023 సంవత్సరపు అత్యుత్తమ టెస్ట్ జట్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇవాళ (డిసెంబర్ 31) ప్రకటించింది. ఈ జట్టులో కేవలం ఇద్దరు ఆస్ట్రేలియన్లకు మాత్రమే చోటు దక్కడం విశేషం. సారధిగా పాట్ కమిన్స్‌ను ఎంపిక చేసిన సీఏ.. ఓపెనర్‌గా ఉస్మాన్ ఖ్వాజాకు అవకాశం కల్పించింది. ఈ జట్టులో టీమిండియా నుంచి సైతం ఇద్దరికి మాత్రమే అవకాశం లభించింది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఐర్లాండ్ ఆటగాడు లోర్కాన్ టక్కర్‌ను ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు ఎవరూ ఊహించని విధంగా ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు కల్పించింది. బ్రాడ్‌తో పాటు ఇంగ్లండ్ నుంచి మరో ఇద్దరు ఆటగాళ్లకు కూడా చోటు లభించింది. మిడిలార్డర్ ఆటగాళ్లుగా జో రూట్, హ్యారీ బ్రూక్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకున్నారు. స్పెషలిస్ట్ పేసర్‌గా సౌతాఫ్రికా స్పిడ్ గన్ కగిసో రబాడకు అవకాశం కల్పించిన సీఏ.. రెండో ఓపెనర్‌గా శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే, వన్ డౌన్ బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్లకు అవకాశం కల్పించింది. జట్ల వారీగా చూస్తే.. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, భారత్, ఆస్ట్రేలియా జట్ల నుంచి చెరి ఇద్దరు, శ్రీలంక, న్యూజిలాండ్, ఐర్లాండ్, సౌతాఫ్రికా జట్ల నుంచి చెరో ఆటగాడిని క్రికెట్ ఆస్ట్రేలియా తమ అత్యుత్తమ టెస్ట్ జట్టులోకి తీసుకుంది. ఈ జట్టులో పాకిస్తాన్ ఆటగాళ్లెవరికీ చోటు దక్కకపోవడం విశేషం. అలాగే తమ స్పిన్ తురుపుముక్క నాథన్ లియోన్‌కు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా అవకాశం కల్పించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్ట్ జట్టు (2023): ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, లోర్కాన్ టక్కర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), కగిసో రబాడ, స్టువర్ట్ బ్రాడ్ -
శుభ సన్నాహం...
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత బ్యాట్స్‌మెన్‌కు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్‌తో జరుగుతోన్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్ అర్ధ శతకాలతో మెరిశారు. ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా... గురువారం రెండో రోజు టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (3) మరోసారి నిరాశపరిచాడు. దీంతో టీమిండియా 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో చతేశ్వర్ పుజారా (54; 6 ఫోర్లు)తో కలిసి యువ ఓపెనర్ పృథ్వీ షా (69 బంతుల్లో 66; 11 ఫోర్లు) చెలరేగాడు. పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించాక ఔటయ్యాడు. అనంతరం ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత కెప్టెన్ కోహ్లి (87 బంతుల్లో 64; 7 ఫోర్లు, సిక్స్) తీసుకున్నాడు. అతను పుజారాతో కలిసి మూడో వికెట్‌కు 73 పరుగులు జతచేశాడు. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (88 బంతుల్లో 53; 5 ఫోర్లు), రహానే (123 బంతుల్లో 56 రిటైర్డ్ ఔట్; 1 ఫోర్) కూడా అర్ధ శతకాలు చేయడంతో భారత్ 347/5తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత రోహిత్ శర్మ (40; 5 ఫోర్లు, సిక్స్), అశ్విన్ (0), షమీ (0), ఉమేశ్ (0) వెంటవెంటనే ఔటవడంతో... 11 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. పంత్ (11 నాటౌట్) అజేయం గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సీఏ ఎలెవన్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. -
క్రికెట్ ఆస్ట్రేలియాకు డేవిడ్ వార్నర్ గుడ్‌బై
-
బ్యాట్స్‌మెన్ అదుర్స్
అడిలైడ్: టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ షోను ప్రదర్శించింది. మొదటి రోజు బౌలర్లు సత్తా చాటితే... రెండో రోజు ఐదుగురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలతో చెలరేగారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. గ్లిడెరల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... రెండో రోజు మంగళవారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (114 బంతుల్లో 60; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. విజయ్ (82 బంతుల్లో 51 రిటైర్డ్ అవుట్; 8 ఫోర్లు), పుజారా (80 బంతుల్లో 55 రిటైర్డ్ అవుట్; 11 ఫోర్లు), సాహా (75 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ శర్మ (54 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రైనా (49 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఓవర్‌నైట్ స్కోరు 55/1తో ఆట కొనసాగించిన భారత్ ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. విజయ్, పుజారా రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అర్ధసెంచరీలు పూర్తయిన తర్వాత ఇద్దరు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. తర్వాత కోహ్లి ఆకట్టుకున్నా... రహానే (1), రోహిత్ (23) విఫలమయ్యారు. లంచ్ తర్వాత కెప్టెన్‌తో జత కలిసిన రైనా వేగంగా ఆడాడు. స్లో బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆరో వికెట్‌కు 55 పరుగులు జోడించాక రైనా అవుటయ్యాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో కోహ్లి, అశ్విన్ (6) అవుటైనా.. చివర్లో సాహా, కరణ్‌లు వీరవిహారం చేశారు. సీఏ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 78 పరుగులు జోడించారు. లాలర్, షార్ట్ చెరో రెండు వికెట్లు తీశారు. శుక్రవారం నుంచి జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్... సీఏ ఇన్విటేషన్ ఎలెవన్ జట్టుతో తలపడుతుంది. స్కోరు వివరాలు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 219 భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ రిటైర్డ్ అవుట్ 51; ధావన్ (సి) టర్నర్ (బి) లాలర్ 10; పుజారా రిటైర్డ్ అవుట్ 55; కోహ్లి (సి) గ్రిమ్‌వేడ్ (బి) షార్ట్ 60; రహానే (సి) కార్టర్స్ (బి) గ్రిమ్‌వేడ్ 1; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) లాలర్ 23; రైనా (సి) కార్టర్స్ (బి) ప్యాటిసన్ 44; సాహా నాటౌట్ 56; అశ్విన్ (సి) అండ్ (బి) షార్ట్ 6; కరణ్ నాటౌట్ 52; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (91 ఓవర్లలో 8 వికెట్లకు) 363. వికెట్ల పతనం: 1-21; 2-106; 3-120; 4-131; 5-178; 6-233; 7-267; 8-285 బౌలింగ్: లాలర్ 20-2-55-2; మూడీ 17-2-74-0; గ్రెగరీ 6-1-26-0; కాన్వే 10-1-37-0; గ్రిమ్‌వేడ్ 17-3-61-1; ప్యాటిసన్ 7-0-24-1; షార్ట్ 10-1-60-2; టర్నర్ 4-1-24-0.