cricket selectors
-
చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్!
న్యూఢిల్లీ: సెలక్టర్ల ఎంపికకు సంబంధించి బీసీసీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ గడువు నిన్నటితో ముగిసింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో ఇప్పటికే సౌత్‌జోన్ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) స్థానంలో సునీల్ జోషి (కర్ణాటక), సెంట్రల్ జోన్లో గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ సింగ్‌లను మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) నియమించింది. మిగతా ముగ్గురు సభ్యుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. దరఖాస్తుల స్క్రూటినీ అయిన వెంటనే మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అర్హత గల అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం ఈ సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్‌తో పాటు భారత్ ‘ఎ’, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీ, రెస్టాఫ్ ఇండియా జట్లను ఎంపిక చేస్తుంది. దరఖాస్తు చేసుకున్నవారిలో అజిత్ అగార్కర్, చేతన్ శర్మ, మహిందర్ సింగ్, ఎస్ఎస్ దాస్‌లలో ముగ్గురు సెలెక్టర్లుగా ఎంపికవడం ఖాయంగా తెలుస్తోంది. ఇక అజిత్ అగార్కర్, మహిందర్ సింగ్ గత మార్చిలోనే అప్లై చేయగా.. వారికి అవకాశం రాలేదు. ఆ దరఖాస్తులనే సీఏసీ మళ్లీ పరిగణించనుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న అగార్కర్ చీఫ్ సెలక్టర్‌గా సరిపోతాడని కొందరు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు మాజీ పేస్ బౌలర్ దేవాశిష్ మహంతిని జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించాలని చెప్తున్నారు. గత సెలక్షన్ కమిటీ భర్తీ ప్రక్రియలో జోన్లవారీగా సభ్యులను ఎంపిక చేసుకుని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. తాజాగా ఆ సంప్రదాయాన్ని ఫాలో అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. -
సెలక్టర్లు కావలెను..అర్హతలివే..!
న్యూఢిల్లీ: సీనియర్ సెలక్షన్ కమిటీలో త్వరలో ఖాళీ అవుతున్న సెలక్టర్లను భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు ఈ నెల 15 ఆఖరి తేదీ అని అందులో పేర్కొంది. కమిటీలోని దేవాంగ్ గాంధీ (ఈస్ట్‌జోన్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్‌జోన్), జతిన్ పరాంజపే (వెస్ట్‌జోన్)ల పదవీ కాలం ఇదివరకే ముగిసినా... ఆసీస్ పర్యటన కోసం జట్లను ఎంపిక చేసేందుకు పొడిగింపు ఇచ్చింది. జట్ల ఎంపిక పూర్తి కావడంతో ఇక సెలక్టర్ల భర్తీపై బోర్డు దృష్టిసారించింది. ఇప్పటికే సౌత్‌జోన్ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) స్థానంలో సునీల్ జోషి (కర్ణాటక), సెంట్రల్ జోన్లో గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ సింగ్‌లను నియమించింది. (చదవండి: తొలి టెస్టు తర్వాత స్వదేశానికి కోహ్లి) అర్హతలివే... అంతర్జాతీయ అనుభవం లేకపోయినా... కనీసం 30 దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు సెలక్టర్ల పదవులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయస్సు 60 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్లో 7 టెస్టులు లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవమైనా ఉండాలి. అయితే ఈసారి అంతర్జాతీయ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత అని ఎక్కడా పేర్కొనలేదు. 30 దేశవాళీ మ్యాచ్‌లాడినా పరిగణమిస్తామని తెలిపింది. సెలక్షన్ కమిటీ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న మాజీ సీమర్ అజిత్ అగార్కర్, మణీందర్ సింగ్‌ల ఎంపికను కూడా పరిశీలిస్తారు. దరఖాస్తుల స్క్రూటినీ అయిన వెంటనే మదన్‌లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అర్హత గల అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం ఈ సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్‌తో పాటు భారత్ ‘ఎ’, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీ, రెస్టాఫ్ ఇండియా జట్లను ఎంపిక చేస్తుంది. (చదవండి: నేను అలాంటి వాడిని కాదు: రోహిత్) -
యువరాజ్ సింగ్ వచ్చేశాడు: రాయుడికీ బెర్తు
డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. టీమిండియాలో మళ్లీ పునరాగమనం చేయనున్నాడు. వచ్చే నెల 10 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు యువరాజ్‌కు బెర్తు దొరికింది. సోమవారం ఇక్కడ సమావేశమైన భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు మొత్తం ఏడు వన్డేలు ఆడనున్నాయి. కాగా ఆసీస్‌తో ఏకైక టి-20, మూడు వన్డేలకు ధోనీ సారథ్యంలో 15 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేశారు. తెలుగుతేజం అంబటి రాయుడికి కూడా జట్టులో స్థానం లభించింది. యువీ చివరి సారిగా గత జనవరిలో టీమిండియా తరపున ఆడాడు. ఆనక ఫామ్‌లేమి కారణంగా చోటు కోల్పోయాడు. వెస్టిండీస్-ఎతో జరిగిన అనధికారిక వన్డే సిరీస్ అతనికి బాగా కలిసొచ్చింది. కీలక ఇన్నింగ్స్‌లు ఆడి సూపర్ ఫామ్ అందుకున్న యువీ జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతనికి టీమిండియాలో చోటు లభిస్తుందన్న విశ్లేషకుల అంచనాలు వాస్తవ రూపం దాల్చాయి. జట్టు: ధోనీ (కెప్టెన్), ధవన్, రోహిత్, కోహ్లీ, యువరాజ్, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్, వినయ్, అమిత్ మిశ్రా, అంబటి రాయుడు, షమీ, ఉనాద్కట్.