critisises babu
-
విచారణ తూతూమంత్రం
అధికార టీడీపీ పక్షంలో గుబులు పట్టుకుంది. దొంగ ఓట్ల గుట్టు రట్టు అవుతుండటంతో పార్టీ నాయకుల్లో ఆందోళన నెలకొంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతర్గత చర్చలో ఈ కేసులు ఎవరిని ముంచుతాయోననే చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. జిల్లాలో సుమారు 50వేల ఓట్ల తొలగింపునకు ఫారం–7 దరఖాస్తులు సమర్పించిన నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది. దీనిపై ఫిర్యాదులు అందుతున్నాయి. సాక్షాత్తూ ఆర్డీఓనే రంగంలోకి దిగి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సి వచ్చింది. వైఎస్సార్సీపీకి చెందిన సానుభూతిపరుల ఓట్లను తొలగించాల్సిందిగా అదేపార్టీ వారు దరఖాస్తు చేసినట్లు టీడీపీ వారు దొంగ నాటకానికి తెరతీసిన వైనం తెలిసిందే. ఇది ఇప్పుడు అధికారులకు కూడా పెద్ద తలనొప్పిగా తయారైంది. వేలకొద్దీ వచ్చి పడిన దరఖాస్తులను విచారించడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఈ దరఖాస్తులను మొక్కుబడిగా విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణకు వెళ్తున్న బీఎల్ఓలకు ముచ్చెమటలు పడుతున్నట్లు భోగట్టా. బద్వేలు/కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో ఓట్ల తొలగింపునకు వచ్చిన ఫారం–7 దరఖాస్తులపై విచారణ తూతూమంత్రంగా నడుస్తోంది. ఎన్నికల వేళ అధికార పార్టీ కుట్ర పన్ని వేల దరఖాస్తులు సమర్పించిందనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి బలం చేకూరుస్తూ సేవామిత్ర యాప్ తయారు చేసిన బ్లూఫ్రాగ్, దాని నుంచి ఓటర్ల వ్యక్తిగత సమాచారం అందుకున్న ఐటీగ్రిడ్స్‌కు టీడీపీకి ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో తప్పుడు దరఖాస్తులను అన్లైన్లో సమర్పించడం సైబర్ నేరం కింద వస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ప్రయివేట్ సంస్థలకు అప్పగించడం కూడా పెద్ద నేరమని సైబర్ నిపుణులు చెబుతున్నా ఆ దిశగా అధికారులు మాత్రం స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం కమలాపురం నియోజకవర్గంలో మాత్రమే ఆర్డీఓ ఫిర్యాదు చేయగా మిగిలిన ప్రాంతాల్లో అధికారులు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసేలా తప్పుడు పేర్లతో ఫారం–7 అందించి ఓట్లను తొలగించాలని కోరారు. ఇది ప్రభుత్వాన్ని మోసం చేయడమే. దీంతో పాటు ఓటర్ల డేటాను ఎలా సంపాదించారనే విషయాన్ని కూడా వారు తెలుసుకోవాల్సి ఉంది. అధికారులు మాత్రం ఈ దిశగా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. కేవలం గ్రామాల్లో తూతూమంత్రంగా విచారిస్తున్నారు. దీనిపై పలు చోట్ల ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము దరఖాస్తు చేయనప్పుడు, దరఖాస్తు చేశారని చెబుతున్న వ్యక్తులు దానికి సంబంధం లేదని చెబుతున్నప్పుడు విచారణ ఎందుకని బీఎల్ఓలను నిలదీస్తున్నారు. బలవుతున్న బీఎల్ఓలు ప్రస్తుతం ఈ దరఖాస్తులను నాలుగైదు రోజుల్లో విచారించాలని ఉన్నతాధికారులు బూత్‌లెవెల్ అధికారుల(బీఎల్ఓ)కు ఆదేశాలు జారీ చేశారు. వారు ఆదివారం, శివరాత్రి పండుగ కూడా జరుపుకోకుండా గ్రామాల్లో పడి దరఖాస్తులను విచారిస్తున్నారు. ఒక్కో ఓటు తొలగింపు ఫారానికి మూడు ఫారాలు తయారు చేసి ఓటు తొలగింపు చేసిన వ్యక్తి, ఓటు తొలగింపు వ్యక్తితో సంతకాలు చేయించుకుంటున్నారు. చాలామంది ఓటర్లు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో వారి ఓట్లు పరిస్థితి ఏమిటో తెలియడం లేదనే ఆందోళన నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతలు గెలిచేందుకు అడ్డదారులను తొక్కుతున్నారు. ఇప్పటికే ఆరు నెలల కిందట భారీగా ఓట్లు తొలగించేలా ఒత్తిడి తెచ్చి సఫలీకృతమయ్యారు. జాబితాలో పేరు లేని ఓటర్లు మళ్లీ దరఖాస్తు చేసుకుని ఓటు పొందారు. దీంతో మరో దఫా అన్లైన్లో ఫారం–7 సమర్పించారు. ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో బూత్‌లెవెల్ అధికారులపై వైఎస్సార్సీపీ మద్దుతుదారుల ఓట్లు తొలగించాలని ఒత్తిళ్లు తెలుస్తున్నట్లు సమాచారం. చర్యలకు ఉపక్రమించిన జిల్లా యంత్రాంగం ఆన్లైన్ ద్వారా తప్పుడు దరఖాస్తులు సమర్పిస్తున్న వారిపై జిల్లా యంత్రాంగం ఇప్పుడిప్పుడే కొరడా ఝుళిపిస్తోంది. పది మందిపై కేసుల నమోదు కోసం సైబర్ క్రైం సెల్‌కు ఫిర్యాదులు పంపారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి, కమలాపురంలో రెండు, పులివెందులలో రెండు, ప్రొద్దుటూరులో రెండు, బద్వేలులో ముగ్గురిపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులు పంపారు. ఇవన్నీ గుర్తు తెలియని వారిపై ఇచ్చిన ఫిర్యాదులే. పోలీసులు సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ఐపీ అడ్రస్సు కనుగొంటారు. దీంతో ఏ కంప్యూటర్ నుంచి తప్పుడు దరఖాస్తులు వచ్చాయి, ఎవరు పంపారో తెలుసుకుని వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు. సైబర్ క్రైం, ఐపీసీ, ప్రజాప్రతినిద్య చట్టం 1951 సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఓట్ల తొలగింపునకుఈనెల 1వ తేది నాటికి జిల్లావ్యాప్తంగా 37 వేల దరఖాస్తులు అందాయని అధికారులంటున్నారు. కానీ ఈ సంఖ్య 50వేల వరకూ ఉంటుందని వైఎస్సార్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా అలజడితో ఫారం–7లు రావడం తగ్గాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.రఘునాథ్ సాక్షికి తెలిపారు. జిల్లాలో నియోజకవర్గాలు: 10 తుది జాబితా నాటికి ఓటర్లు: 20,56,660 పోలింగ్ స్టేషన్లు: 2,723 రిటర్నింగ్ అధికారులు: 10 ఫారం–7 దరఖాస్తులు: సుమారు 50వేలు ఆందోళన వద్దు తప్పుడు దరఖాస్తులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగిస్తారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎన్నికల అధికారి హరికిరణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఫారం–7 వస్తే దాని ఆధారంగా బీఎల్ఓలు క్షేత్ర స్థాయి విచారణకు వెళతారు. తనకు రెండుచోట్ల ఓటు ఉందని, ఒకచోట తొలగించాలంటూ స్వయంగా ఓటరు సంతకంతో కూడిన దరఖాస్తు ఇస్తే తప్ప తొలగింపు సాధ్యపడదు. ఒక్కొ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 0.1 శాతం కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే మూడు దశల్లో విచారణ నిర్వహిస్తారు. అంటే జిల్లాలోని తుది ఓటర్ల జాబితా ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో 200కు మించి దరఖాస్తులు రావాల్సి ఉంటుంది. ఇందులో అర్హమైనవి ఉంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుమతి తీసుకున్న తర్వాతే తొలగిస్తారని అధికారులు అంటున్నారు. అంటే ఓటర్లకు తెలియకుండా వారి ఓటును ఎవరూ తొలగించలేరని వారు స్పష్టం చేస్తున్నారు. తొలగింపునకు వచ్చిన ఫారం-7 దరఖాస్తులు ఫిర్యాదు చేయకపోవడంలోని ఆంతర్యమేమిటి! బద్వేలు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో దాదాపు 9600 ఓట్లు తొలగించాలని పారం–7 దరఖాస్తులు అందాయి. ఇవన్ని తప్పుడవని తేలినా ఒక్క మండలంలో కూడా పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేయకపోవడంలోని అంతర్యమేమిటో అర్ధం కావడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వమే తప్పుడు విధానాల్లో దరఖాస్తు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తప్పుడు దరఖాస్తులపై కేసు నమోదు చేస్తే అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు వస్తాయనే భయమో... లేక ఇప్పటికే ఆదేశాలు వచ్చాయో అని ఓటర్లు చర్చించుకుంటున్నారు. నా ఓటు తొలగింపు నేనే కోరుకుంటానా? నా ఓటు పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో ఉంది. నేనే వైఎస్సార్సీపీ యూత్ నాయకుడిని, బూత్ కన్వీనరును. అలాంటి పరిస్థితుల్లో నా ఓటు నేనే ఎందుకు తీసుకుంటా. నా పేరు మీద కొందరు తప్పుడు దరఖాస్తులు అందించారు. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లా. కానీ చర్యలు మాత్రం శూన్యం. – గిరిప్రణిత్రెడ్డి, పోరుమామిళ్ల మండలం కఠిన చర్యలు తీసుకోవాలి ఇతరుల సమాచారాన్ని దొంగిలించి ఓట్ల తొలగింపునకు తప్పుడు దరఖాస్తులు ఇచ్చారు. ఇది సైబర్ నేరమే. అయినా అధికారులు, పోలీసులు పట్టనట్లు వ్యవహరించడం సరికాదు. బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – రవిచంద్రారెడ్డి, రజాసాహెబ్‌పేట, పోరుమామిళ్ల మండలం ఇంటింటికి తిరిగి విచారిస్తున్నాం ఓట్ల తొలగింపునకు వచ్చిన దరఖాస్తులను ఇంటింటి విచారణ చేస్తున్నాం. చాలా మంది అర్హులవే ఉన్నాయి. దీనికి తోడు తొలగించాలని పేర్కొంటున్న వ్యక్తులు సైతం తాము దరఖాస్తు చేయలేదని చెబుతున్నారు. అన్ని దరఖాస్తులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం – జమాల్‌బాషా, బీఎల్ఓ, నరసాపురం, కాశినాయన మండలం కేసులు పెట్టమని చెప్పాం నియోజకవర్గంలోని కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, కాశినాయన మండలాల్లో తొలగింపు దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కేసులు నమోదు చేయమని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశాం. కానీ పూర్తి వివరాలు తీసుకు వస్తే కేసులు పెడతామని పోలీసులు తెలియజేయడంతో ఆ పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు నాలుగు మండలాల పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేయిస్తాం. – రామచంద్రారెడ్డి, ఆర్వో, బద్వేలు నియోజకవర్గం -
టీడీపీ నాలుగేళ్లలో చేసింది శూన్యం : బొత్స
మెరకముడిదాం: తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలనలో జిల్లాలోగాని, చీపురుపల్లి నియోజకవర్గంలోగాని జరిగిన అభివృద్ధి శూన్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. మెరకముడిదాంలో రూ.3లక్షలతో నిర్మించిన తొమ్మిది అడుగుల దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన బుధవారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనలో ఆ పార్టీ గ్రామ స్థాయి నేతల నుంచి అందరూ దోచుకో...దాచుకో...విధానమే పాటిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా టీడీపీ నాయకులు డబ్బులు వసూలు చేయడం దారుణమని దుయ్యబట్టారు. గతంలో తాను మంత్రిగా ఉన్న కాలంలో ఒక్క మెరకముడిదాం గ్రామంలోనే 850 ఇళ్లను పేదలకు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు కనీసం అందులో పది శాతం ఇళ్లు 85 కూడా మంజూరు చేయలేదని చెప్పారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ...పేదల అభివృద్ధికే పాటుపడుతున్న జగన్మోహన్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో దీవించాలని కోరారు. జిల్లాలో ఓ వైపు డెంగీ జ్వరాలు బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే జిల్లా మంత్రికిగాని, ఎమ్మెల్యేలకుగాని పట్టడం లేదని, అధికారులు ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించడం బాధాకరమన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను కూడా నిర్వహించలేని అసమర్ధ పాలన కొనసాగుతుందన్నారు. జిల్లా పార్టీ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహానేత విగ్రహాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జనం మదిలో ఉన్న ఏకైక నాయకుడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అందించిన మహావ్యక్తి అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణను, రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు. టీడీపీ నాయకులు సంక్షేమ పథకాలు తమ ఇష్టానుసారం పంచుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎస్వీ రమణరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు తాడ్డి కృష్ణారావు, తాడ్డి వేణుగోపాలరావు, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, గరివిడి మండల పార్టీ నాయకులు పొన్నాడ వెంకటరమణ, మీసాల విశ్వేశ్వరరావు, గుర్ల మండల నాయకులు శీర అప్పలనాయుడు, వరదా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం భ్రష్టుపట్టింది
శ్రీకాకుళం రూరల్ : జిల్లాకు ఫిషరీస్ యూనివర్సిటీ తీసుకొస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు డు, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ సో ము వీర్రాజు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం మంజూరు చేసిన పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి పథకాలుగా మారిపోయాయని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రాష్ట్రానికి రూ.30వేల కోట్లు వచ్చాయంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు కేం ద్రం రైతులకు మద్దతు ధర ప్రకటించిందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులు తినేస్తూ, మళ్లీ కేంద్రాన్నే తిట్టడం చంద్రబాబు నైజమన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే విద్య, వైద్యం, ఉపాధికి తూట్లు పొడిచారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా గల 3,500 పాఠశాలలకు సంబంధించి విద్యను అభివృద్ధి చేసేందుకు రూ.120 కోట్లు మంజూరు చేస్తే అందులో రూ. 30 కోట్ల నిధుల దోపిడీ జరిగిందన్నారు. ప్రభుత్వ విద్యను బాగు చేయాల్సింది పోయి ప్రైవేటు సం స్థలకు పల్లకీలు మోయడం బాబుకు తగదన్నారు. దీనిపై అసెంబ్లీలోనూ ప్రస్తావించకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనపై వ్యతిరేకతతోనే జగన్ పాదయాత్రకు జనం తండోపతండాలుగా వస్తున్నారని ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1500 కోట్లతో మొక్కలు నాటే పెంపకం చేపట్టారని ఆ డబ్బులతో యువతకు, యువజన సం ఘాలకు, ఎన్జీఓ సంఘాలకు మొక్కలు అందజేసి అవి పెరిగి పెద్దదైతే డబ్బులు ఇస్తామని చెబితే కొంతవరకైనా నిరుద్యోగ సమస్య తీర్చవచ్చునన్నారు. సమావేశంలో బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు సువ్వారి వెంకట సన్యాసిరావు, పూడి తిరుపతిరావు, కోటగిరి నారాయణరావు, చల్లా వెంకటేశ్వరరావు, శవ్వాన ఉమా మహేశ్వరి, ఎస్.వెంకటేశ్వరరావు, సువ్వారి రాజేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘వైఎస్ కృషితోనే పోలవరానికి అంకురార్పణ’ టెక్కలి: ఎంగిలి కాఫీ తాగే వారిలో చంద్రబాబు లాంటి ఘనుడు మరొకరు లేరని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. సోమవారం టెక్కలిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ రోజు ముఖ్య మంత్రి చంద్రబాబు ఇస్తున్న పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఘనత వల్లనే పోలవరం ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పోలవరం ఎందుకు గుర్తు రాలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రన్న బీమాకు కేంద్రం 5 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని, అయితే అది తన గొప్పతనంగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నీరు–చెట్టు పథకంలో భాగంగా ఎలాంటి పనులు చేయకుండా సుమారు 13 వేల కోట్ల రూపాయల మేరకు బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. ఏపీలో విద్య కోసం కేంద్రం నిధులిస్తే చంద్రబాబు మాత్రం నారాయణ, చైతన్య అంటూ భజనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ లాంటి అవినీతి పార్టీ మరొకటి లేదని ఆయన అన్నారు. -
రాష్ట్రంలో అవినీతి పాలన
రాజాం శ్రీకాకుళం : రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని రాజాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరోపించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లుగా జరిగిన అవినీతిని గిన్నిస్‌బుక్‌లో రికార్డు చేయవచ్చునని ఎద్దేవాచేశారు. సంక్షేమం అన్న పదానికే తూట్లు పొడిచారని విమర్శించారు. ఔట్సోర్సింగ్ పోస్టుల అమ్మకం నుంచి ఇసుక, ల్యాండ్ మాఫియాలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారని ఆరోపించారు. టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర రెండు నెలల్లో జిల్లాకు రానుందని చెప్పారు. -
చేతకాకపోతే తప్పుకోండి
సాక్షి, విజయవాడ: రైతులకు న్యాయం చేయలేకపోతే గద్దె దిగండి.. మీకంటే చక్కగా పాలించే వారు చాలామంది ఉన్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి సీఎం చంద్రబాబుకు చురకలంటించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతును రాష్ట్రానికి రాజుగా చేద్దామని నినాదాలు చేస్తున్నారు.. నిజానికి రైతులను రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారన్నారు. రూ.5వేల కోట్ల తో ధరల స్థిరీకరణ అన్నారు.. రూ.85 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు.. నాలుగేళ్లు గడుస్తున్నా రూ.12 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ అన్నారు.. కనీసం అవికూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు రైతులను రుణగ్రస్తులను చేశారని, సహకార సొసైటీలను తెలుగు తమ్ముళ్లు అవినీతిమయం చేశారని ఆయన విమర్శించారు. రైతుల పేరుతో మిల్లులకు ధాన్యం అమ్మినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారని, కోట్ల రూపాయల మేర మిల్లర్లతో కలిసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యాన్ని మిల్లర్లు రీసైకిల్ చేసి తిరిగి ప్రభుత్వానికే లెవీగా ఇస్తున్నారన్నారు. ఈ అక్రమార్కులకు మంత్రులే అండగా నిలుస్తున్నారని, కృష్ణాజిల్లా ముస్తాబాద్ సొసైటీలో జరిగిన అవినీతే ఇందుకు నిదర్శనమని పార్థసారథి అన్నారు. -
‘అనంతను ఆప్ఘనిస్తాన్‌గా మారుస్తున్న బాబు’
అనంతపురం: మలేషియా, సింగపూర్, జపాన్ మాదిరిగా ఏపీని తీర్చిదిద్దుతామని ప్రకటనలు గుప్పిస్తున్న సీఎం చంద్రబాబు.. అనంతపురంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఆ జిల్లాను మరో ఆప్ఘనిస్తాన్‌గా మారుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకుడు భూమిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి హత్య, ఆపార్టీ మాజీ ఎమ్మెల్యే బి.గుర్నాథ్రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిల అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం అనంతపురం బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.