
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు
రాజాం శ్రీకాకుళం : రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని రాజాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరోపించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లుగా జరిగిన అవినీతిని గిన్నిస్‌బుక్‌లో రికార్డు చేయవచ్చునని ఎద్దేవాచేశారు.
సంక్షేమం అన్న పదానికే తూట్లు పొడిచారని విమర్శించారు. ఔట్‌సోర్సింగ్ పోస్టుల అమ్మకం నుంచి ఇసుక, ల్యాండ్ మాఫియాలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారని ఆరోపించారు.
టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర రెండు నెలల్లో జిల్లాకు రానుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment