The crowd
-
రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ఎవరో?
పలమనేరు: రాష్ట్రాన్ని ముక్కలు చేసి దుస్థితికి కారణమైందీ కాకుండా మళ్లీ కొత్త నాటకానికి తెరతీస్తే జనం నమ్మే పరిస్థితిలో లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఎండగట్టారు. పట్టణ సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చేసిందంతా చేసి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితికి విభజనే శాపమంటూ ప్రజలకు తెలియజేస్తామని చంద్రబాబు చెబుతుంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. అసలు కేంద్రానికి విభజనలేఖ ఇచ్చింది మొ దలు శాశనసభలో జరిగిన అన్ని విషయాలు సీ మాంధ్రులకు తెలియదా అని ప్రశ్నించారు. మళ్లీ జనాన్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తే జనం ఊరుకోరని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పాల న అస్తవ్యస్తంగా మారిందని, దీన్ని కప్పిపుచ్చేందుకు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆయన మాటలను జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతోనే పాదయాత్రలకు దిగారని తెలిపారు. ఈ ప్రభుత్వంపై జనం పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు సీవీ కుమార్, చాంద్‌బాషా, మండీసుధా, కమాల్, జాఫర్, కోదండరామయ్య, ప్రహ్లాద తదితరులున్నారు. -
భానుడి భగభగ..
- ఎండల జోరు... జనం బేజారు - గరిష్టంగా 40.4, కనిష్టంగా 24.8 డిగ్రీలు నమోదు - వడగాలులతో జనం విలవిల మెదక్ టౌన్: ప్రచండ భానుడి ప్రతాపంతో జనం విల విల్లాడుతున్నారు. ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండకు భయపడి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. శుక్రవారం గరిష్టంగా 40.4 డిగ్రీలు, కనిష్టంగా 24.8 డిగ్రీల ఠమొదటిపేజీ తరువాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపాధి కూలీలు, వరికోతలు కోసే శ్రామికులు ఉదయం 6 నుంచి 9 వరకు, రాత్రి 9 నుంచి 12గంటల పనులు చేసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప గడప దాటడం లేదు. అలా బయటకు వచ్చే వారు గొడుగులు, క్యాప్‌లు, చున్నీలు, కండువాలు తలపై రక్షణగా ఉంచుకుంటున్నారు. ఉపశమనం పొందడానికి శీతల పానీయాలను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. మండుతున్న ఎండలతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. కోళ్ల ఫారాల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటుచేసి షెడ్లపై గడ్డి కప్పి నీటితో తడుపుతున్నారు. విద్యుత్ కోతల నుంచి ఉపశమనం పొందడానికి జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది దాతలు అక్కడక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రాలతో ప్రయాణికులు దాహం తీర్చుకుంటున్నారు. మండుతున్న ఎండలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.