crushers
-
రామస్వామిపేటపై క్రషర్ల పంజా..
శృంగవరపుకోట /వేపాడ విజయనగరం : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతూ క్రషర్ల యజమానులకు కొమ్ముకాస్తోంది. దీంతో ఆ ఊరి వాసులకు స్వచ్ఛమైన గాలి, నీరు కూడా లభించడం లేదు. వేపాడ మండలంలోని రామస్వామిపేట పరిధిలో 8 క్రషర్లు, 14 క్వారీలు ఉన్నాయి. నిరంతరాయంగా జరుగుతున్న బ్లాస్టింగ్లు, స్టోన్ క్రషింగ్‌తో వాయు, శబ్ధ, జల కాలుష్యంతో గ్రామం వణుకుతోంది. గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న స్టోన్ క్రషర్లు, క్వారీల నుంచి వచ్చే దుమ్ముతో పచ్చని పొలాలు, చెట్లు తెల్లగా మారి రూపు కోల్పోతున్నాయి. పంట భూములు చవుడు నేలలుగా మారుతున్నాయి. జలాలు కాలుష్యం కావడంతో గ్రామస్తులు, పశువులు శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నారు. క్వారీల్లో జరుగుతున్న పేలుళ్లకు భవనాల గోడలు బీటలుదేరుతున్నాయి. గ్రామాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్న క్రషర్లు, క్వారీలను మూయించాలని ఇప్పటికే పలుమార్లు గ్రామస్తులు చేసిన ప్రజా ఉద్యమాలు పెట్టుబడివర్గాలు విసిరే కరెన్సీ నోట్ల మధ్య నిలబడలేకపోయాయి. బందలు స్వాహా.. స్టోన్ క్రషర్ల యజమానులు 52/1లో ఉన్న నక్కలబందను ఆక్రమించారు. ఇదే తీరుగా మెరకబంద, పొట్టేలు బంద, మంగలి బందల్ని ఆక్రమించి మాయం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో సాగునీటి వనరులు మాయమయ్యే పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. నక్కల బంద ఆక్రమణపై వివరణ కోరగా తహసీల్దార్ డీవీ రమణ తన దృష్టికి సమస్య రాలేదంటూ బదులిచ్చారు. పొల్యూషన్ రిపోర్టు .. ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2017 జూలైలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేసింది. రెండు రోజుల తర్వాత అన్ని క్రషర్లు నిబంధనలు పాటిస్తున్నాయి.. గ్రీన్‌బెల్ట్ పెంచుతున్నారు... బోర్డు నిబంధనలు ఉల్లంఘించలేదు.. వర్షాల వల్ల గాలిలో దుమ్ము శాతాన్ని లెక్కకట్టలేక పోయాం.. గాలి కలుషితం ఐతే చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పి చేతులు దులిపేసుకుని నేటి వరకు తిరిగి చూడలేదు. స్వచ్ఛమైన గాలి కరువు రాయి బుగ్గితో తెల్లని ధూళి పడి పచ్చని పొలాలు పాడైపోతున్నాయి. గాలి ఎప్పుడు వీచినా దుమ్ము, ధూళి ఉంటోంది. కనీస అవసరాలైన గాలి, నీరు కూడా లేకుండా చేస్తున్నారు. – రొంగలి మధుసూదనరావు, గ్రామరైతు -
క్రషర్, తారు ప్లాంట్లపై హైకోర్టు ఆగ్రహం
- ఆ ప్లాంట్లు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా చూడండి - ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ గ్రామ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా క్రషర్, తారు ప్లాంట్లు నడుపుతుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీవీ ఇన్ఫ్రా, బాలాజీ రోడ్ కన్స్ట్రక్షన్స్, శ్రీనివాస్ మెటల్ ఇండస్ట్రీస్, మహ్మద్ ముంతాజ్ హాట్ మిక్స్‌లు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అనుమతులు తీసుకోకుండా క్రషర్, తారు ప్లాంట్లు నడుపుతుంటే ఏం చేస్తున్నారో చెప్పాలంటూ జిల్లా కలెక్టర్, ఆర్డీవో, జిల్లా పంచాయతీ అధికారులతోపాటు సీవీ ఇన్ఫ్రా తదితర కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గుడిహత్నూర్ గ్రామ పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న తారు, క్రషర్ ప్లాంట్ల వల్ల స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కె.సుదర్శన్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.ఎ.కె.ముఖీద్ వాదనలు వినిపిస్తూ, అనధికార ప్రతివాదులుగా ఉన్న కంపెనీలు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఇతర శాఖల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే తారు, క్రషర్ ప్లాంట్లు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ ప్లాంట్ల వల్ల వ్యవసాయదారులు, సాధారణ ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది. ‘ఫోరెన్సిక్’ ఏర్పాట్లపై కేంద్ర, ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిల్లో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలను ఏర్పాటు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటు న్నారో వివరించా లని కేంద్రంతో పాటు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశిం చింది. ఈ విషయంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఉభయ రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీ సులు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతీ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర, ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలు తప్పనిసరిగా ఉండాలని, అయితే ఏపీలో ఒక్క ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా లేదని, తెలంగాణలో ప్రాంతీయ ల్యాబ్‌లు లేవంటూ హైదరాబా ద్‌కు చెందిన ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగ ళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం పైవిధంగా కేంద్ర, తెలుగు రాష్ట్ర ప్రభుత్వా లను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. -
కదం తొక్కిన కర్షకులు
= రాకపోకల బంద్ = 8 గంటలపాటు తహసీల్దార్ కార్యాలయ ముట్టడి = పురుగు మందు డబ్బాలు చేతబట్టి నిరసన = తహసీల్దార్ నిర్బంధం బొమ్మనహాళ్ : పచ్చటి పంట పొలాలను నాశనం చేస్తూ తమ పొట్ట కొడుతున్న క్రషర్ల నిలిపివేత కోసం కర్షకులు కదం తొక్కారు. తమ విజ్ఞప్తులను పెడచెవిన పెట్టి.. క్రషర్ల యజమానులకు వత్తాసు పలుకుతున్న అధికారులపై కన్నెర్రజేశారు. సోమవారం బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లు నుంచి బొమ్మనహాళ్ ప్రధాన రహదారి వరకు ట్రాక్టర్లు అడ్డం పెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. అలాగే 20 ట్రాక్టర్లలో దాదాపు వెయ్యిమంది రైతులు, మహిâýæలు మండల కేంద్రానికి చేరుకుని తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కార్యాలయ ఆవరణలోనే పురుగుమందు డబ్బాలతో బైఠాయించి నిరసన తెలిపారు. కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి.. కంకర మిషన్లు ఆపుతారా లేక మమ్మల్ని పురుగుమందు తాగి చావమంటారా అంటూ ప్రశ్నించారు. మూడేళ్లుగా క్రషర్ల నుంచి వెలువడుతున్న దుమ్మూ ధూళి వల్ల పంటలు పండడం లేదని వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా కొండల్లో చేస్తున్న పేలుâýæ్ల ధాటికి వ్యవసాయ బోర్లు మూసుకుపోతున్నా, విద్యుత్ మోటార్లు భూమిలో కుంగిపోతున్నా ఏ అధికారీ పట్టించుకోలేదన్నారు. పేలుâýæ్ల ధాటికి నేమకల్లు ఆంజనేయస్వామి విగ్రహానికి సైతం పగుళ్లు వచ్చాయన్నారు. కొండ ప్రాంతంలోని కంకర క్వారీల వద్ద మేతకు వెళుతున్న గొర్రెలు, మేకలు, పశువులు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నాయని, తమకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారని నిలదీశారు. క్వారీ, క్రషర్ల యాజమానులు ఇస్తున్న మామూâýæ్లకు ఆశపడి అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు ఆందోâýæన ఉద్రిక్తంగా మారుతుండటంతో ఎస్ఐ శ్రీరాంశ్రీనివాస్ లాఠీచార్జ్ చేయడానికి ఉపక్రమించారు. ‘ఎస్ఐ డౌన్ డౌన్, అన్నదాతలపై ప్రతాపం చూపే ఎస్ఐ క్షమాపణ చెప్పాలి’ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. రైతులపై దాడి చేసే హక్కు మీకు ఎక్కడుందని ప్రశ్నించారు. తమ అర్జీని కలెక్టర్‌కు పంపకుండా.. తమ భూములు సాగుకు పనికి రావని నివేదిక ఎలా ఇచ్చారంటూ తహసీల్దార్ శివయ్యను నిలదీశారు. ఆందోళనకారులతో విడతల వారీగా చర్చలు సీఐ చలపతి రావు, ఎస్ఐ శ్రీరాంశ్రీనివాస్ , తహసీల్దారు శివయ్య పలుమార్లు గ్రామ సర్పంచ్ హనుమంత రెడ్డి, వైఎస్సాఆర్సీపీ ఎంపీటీసీ సభ్యుడు పరమేశ్వర, టీడీపీ ప్రతినిధి బసప్పతో విడతల వారీగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. క్రషర్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారని, మరి రైతులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎందుకు కేసు పెట్టలేదని వారు నిలదీశారు. కార్యాలయం వద్దే వంటావార్పు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉదయం నుంచి ఆందోళన చేపట్టిన అన్నదాతలు అక్కడే వంటావార్పు చేసి భోజనాలు చేశారు. తహసీల్దార్‌తో సహా ఇతర అధికారులను బయటకు వదలకుండా కార్యాలయంలో నిర్బంధించారు. సంఘటన వివరాలు తెలుసుకున్న డీఎస్పీ వెంకటరమణ సాయంత్రం ఆరు గంటలకు బొమ్మనహాళ్‌కు చేరుకున్నారు. పంటపొలాలను పరిశీలించి, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పొలాలను పరిశీలించడానికి రెవెన్యూ అధికారులతో కలిసి డీఎస్పీ వెళ్లారు. రైతులు కూడా ఆందోâýæన విరమించి వారి వెంట వెళ్లారు.