కదం తొక్కిన కర్షకులు
కదం తొక్కిన కర్షకులు
Published Tue, Feb 21 2017 12:53 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
= రాకపోకల బంద్
= 8 గంటలపాటు తహసీల్దార్ కార్యాలయ ముట్టడి
= పురుగు మందు డబ్బాలు చేతబట్టి నిరసన
= తహసీల్దార్ నిర్బంధం
బొమ్మనహాళ్ : పచ్చటి పంట పొలాలను నాశనం చేస్తూ తమ పొట్ట కొడుతున్న క్రషర్ల నిలిపివేత కోసం కర్షకులు కదం తొక్కారు. తమ విజ్ఞప్తులను పెడచెవిన పెట్టి.. క్రషర్ల యజమానులకు వత్తాసు పలుకుతున్న అధికారులపై కన్నెర్రజేశారు. సోమవారం బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లు నుంచి బొమ్మనహాళ్ ప్రధాన రహదారి వరకు ట్రాక్టర్లు అడ్డం పెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. అలాగే 20 ట్రాక్టర్లలో దాదాపు వెయ్యిమంది రైతులు, మహిâýæలు మండల కేంద్రానికి చేరుకుని తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కార్యాలయ ఆవరణలోనే పురుగుమందు డబ్బాలతో బైఠాయించి నిరసన తెలిపారు. కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి.. కంకర మిషన్లు ఆపుతారా లేక మమ్మల్ని పురుగుమందు తాగి చావమంటారా అంటూ ప్రశ్నించారు. మూడేళ్లుగా క్రషర్ల నుంచి వెలువడుతున్న దుమ్మూ ధూళి వల్ల పంటలు పండడం లేదని వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా కొండల్లో చేస్తున్న పేలుâýæ్ల ధాటికి వ్యవసాయ బోర్లు మూసుకుపోతున్నా, విద్యుత్ మోటార్లు భూమిలో కుంగిపోతున్నా ఏ అధికారీ పట్టించుకోలేదన్నారు. పేలుâýæ్ల ధాటికి నేమకల్లు ఆంజనేయస్వామి విగ్రహానికి సైతం పగుళ్లు వచ్చాయన్నారు. కొండ ప్రాంతంలోని కంకర క్వారీల వద్ద మేతకు వెళుతున్న గొర్రెలు, మేకలు, పశువులు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నాయని, తమకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారని నిలదీశారు. క్వారీ, క్రషర్ల యాజమానులు ఇస్తున్న మామూâýæ్లకు ఆశపడి అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు.
ఎస్‌ఐకి వ్యతిరేకంగా నినాదాలు
ఆందోâýæన ఉద్రిక్తంగా మారుతుండటంతో ఎస్‌ఐ శ్రీరాంశ్రీనివాస్ లాఠీచార్జ్ చేయడానికి ఉపక్రమించారు. ‘ఎస్‌ఐ డౌన్ డౌన్, అన్నదాతలపై ప్రతాపం చూపే ఎస్‌ఐ క్షమాపణ చెప్పాలి’ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. రైతులపై దాడి చేసే హక్కు మీకు ఎక్కడుందని ప్రశ్నించారు. తమ అర్జీని కలెక్టర్‌కు పంపకుండా.. తమ భూములు సాగుకు పనికి రావని నివేదిక ఎలా ఇచ్చారంటూ తహసీల్దార్ శివయ్యను నిలదీశారు.
ఆందోళనకారులతో విడతల వారీగా చర్చలు
సీఐ చలపతి రావు, ఎస్‌ఐ శ్రీరాంశ్రీనివాస్ , తహసీల్దారు శివయ్య పలుమార్లు గ్రామ సర్పంచ్ హనుమంత రెడ్డి, వైఎస్సాఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు పరమేశ్వర, టీడీపీ ప్రతినిధి బసప్పతో విడతల వారీగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. క్రషర్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారని, మరి రైతులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎందుకు కేసు పెట్టలేదని వారు నిలదీశారు.
కార్యాలయం వద్దే వంటావార్పు
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉదయం నుంచి ఆందోళన చేపట్టిన అన్నదాతలు అక్కడే వంటావార్పు చేసి భోజనాలు చేశారు. తహసీల్దార్‌తో సహా ఇతర అధికారులను బయటకు వదలకుండా కార్యాలయంలో నిర్బంధించారు. సంఘటన వివరాలు తెలుసుకున్న డీఎస్పీ వెంకటరమణ సాయంత్రం ఆరు గంటలకు బొమ్మనహాళ్‌కు చేరుకున్నారు. పంటపొలాలను పరిశీలించి, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పొలాలను పరిశీలించడానికి రెవెన్యూ అధికారులతో కలిసి డీఎస్పీ వెళ్లారు. రైతులు కూడా ఆందోâýæన విరమించి వారి వెంట వెళ్లారు.
Advertisement