crust gates
-
సాగర్ 10 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల
విజయపురిసౌత్ (మాచర్ల)/సత్రశాల (రెంటచింతల)/శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 10 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు వచ్చే నీటి చేరిక పెరగడంతో మంగళవారం 4 క్రస్ట్‌గేట్లు 10 అడుగుల మేర, 6 క్రస్ట్‌గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,08,230 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయిలో 589.70 అడుగుల వద్ద ఉండగా ఇది 311.1486 టీఎంసీలకు సమానం. కాగా, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 1,33,932 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ డీఈ దాసరి రామకృష్ణ, ఏడీఈ నాగనరసింహారావు మంగళవారం తెలిపారు. సాగర్‌కు 1.78 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్‌కు 1,78,413 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,34,299 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. నాలుగు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 1,11,932 క్యూసెక్కులు, రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పాదన చేస్తూ మరో 66,481 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. -
Nalgonda: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద
నల్గొండ: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. కాగా, 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2,16,137 క్యూసెక్యులు కాగా, అవుట్ ఫ్లో 1,33,137 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామార్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిలువ 311.1486 టీఎంసీలుగా ఉంది. చదవండి: ఇదే చివరిసారి.. గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి -
‘సాగర్’లో లీకేజీలు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి వరదనీరు లీకవుతోంది. క్రస్ట్‌గేట్లకు ఇటీవలే మరమ్మతు చేయించినా లీకేజీలకు బ్రేక్ పడలేదు. దీంతో గేట్ల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగర్ డ్యామ్‌కు 26 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉండగా 4 గేట్లకు గతేడాది మరమ్మతు చేశారు. ఈ ఏడాది మిగిలిన 22 గేట్ల మరమ్మతులకు రూ. 70 లక్షలు కేటాయించారు. డ్యామ్ గేట్ల నిర్వహణ విభాగంలో సిబ్బంది కొరత ఉండటంతో అధికారులు మరమ్మతు పనులను రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. రబ్బరు సీళ్లు అమర్చడం, ఇనుప తీగలకు గ్రీజింగ్ చేయడం, గేర్లలో ఆయిల్ మార్చడం, గేట్లు ఎత్తే మోటర్ల స్టార్టర్లకు కాయిల్స్ బిగించడం వంటి పనులను ప్రైవేటు సంస్థలు చేపట్టాయి. ఆ వెంటనే జలాశయానికి వరద రావడంతో వారంలోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అదనపు నీటిని దిగువకు విడుదల చేసేందుకు రేడియల్ క్రస్ట్ గేట్లను పైకి ఎత్తారు. నీటి రాక తగ్గడంతో శుక్రవారం సాయంత్రం మూసేసినా మళ్లీ శనివారం ఉదయం రెండు గేట్లను పైకెత్తి తిరిగి మధ్యాహ్నం మూసేశారు. అయితే గేట్లు మూసేసినా వాటిలోంచి నీరు ధారగా కారుతోంది. ముఖ్యంగా 6, 8, 11, 14, 15, 21, 25, 26 నంబర్ గేట్ల నుంచి నీరు ఎక్కువగా లీకవుతోంది. గేట్ల నుంచి నీరు లీకవడానికి రబ్బరు సీళ్లను సరిగ్గా అమర్చకపోవడమే కారణమని రిటైర్డ్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. దారుణంగా స్పిల్ వే... స్పిల్ వేకు మరమ్మతులు నిర్వహించక దాదాపుగా 8 ఏళ్లు దాటింది. ఏటా డ్యామ్ నిర్వహణలో భాగంగా స్పిల్ వేకు మరమ్మతులు చేయాలి. ఈ 8 ఏళ్లలో డ్యామ్ క్రస్ట్‌గేట్లను ఐదుసార్లు ఎత్తగా పైనుంచి నీటి తాకిడికి స్పిల్‌వే దెబ్బతింటుంది. అందువల్ల ఏటా స్పిల్ వే నిర్వహణ చేపట్టాలి. ప్రస్తుతం స్పిల్ వే వద్ద పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. కొన్నిచోట్ల పూర్తిగా కొట్టుకుపోయింది. ఇలాగే ఉంటే డ్యామ్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లీకేజీలను తగ్గిస్తాం... గేట్ల లీకేజీలను తగ్గించే ఏర్పాట్లు చేస్తాం. అన్నింటికీ కొత్త సీళ్లు వేయడం వల్ల నీరుకారడం సహజం. నిన్నటి వరకు వరదలు కొనసాగాయి. ఇప్పటికీ గేట్ల మీద నుంచి గాలికి నీటి తెప్పలు దుముకుతున్నాయి. జలాశయంలో కొంత నీరు తగ్గగానే వాక్ వే బ్రిడ్జి మీదుగా వెళ్లి బోల్ట్ నట్స్‌ను బిగిస్తే కొంత మేరకు లీకేజీలు తగ్గే అవకాశాలున్నాయి. నిర్వహణలో లోపాలేమీ లేకుండా చూస్తాం. – సీఈ శ్రీకాంత్‌రావు. -
క్రస్ట్‌గేట్ల ద్వారా లీకేజీలు!
సాక్షి, నాగార్జునసాగర్: బహుళార్థసాదక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. జలాశయం నిండుగా ఉండడంతో క్రస్టు గేట్ల ద్వారా నీరు పెద్ద ఎత్తున లీకేజీ అవుతోంది. లీకేజీ కాకుండా ప్రతి ఏటా వేసవిలో క్రస్ట్ గేట్లకు రబ్బరు సీళ్లు ఏర్పాటు చేయడంతో పాటు గేట్లు ఎత్తే ఇనుప తాడుకు గ్రీజింగ్ చేస్తారు. ఈఏడాది కూడా కొంత మేరకు రబ్బరు సీళ్లును అమర్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.అయినప్పటికీ రబ్బరు సీళ్లు అమర్చిన ప్రాంతం నుంచి కూడా నీటి లీకేజీ జరుగుతోంది. ప్రస్తుతం జలాశయంంలో 586.60 అడుగుల నీటిమట్టం ఉంది. గాలులు వీస్తుండటంతో జలాశయంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ సయయంలో క్రస్టు గేట్లనుంచి నీరు లీకవుతుంది. సిబ్బంది కొరత, కాంట్రాక్టర్లకు పనులు అప్పగింత డ్యాంపై గతంలో 100మంది ఉద్యోగులు పనిచేసేవారు. నేడు పదుల సంఖ్యలోకి సిబ్బంది తగ్గారు. దీంతో పనులన్నీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించపోవడంతో కూడా సమస్యలకు కారణమని తెలుస్తోంది. క్రస్టు గేట్లకు రబ్బరు సీళ్ల అమరిక సరిగా లేక నీరు కారుతుందని రిటైర్డ్ ఇంజినీర్లు చెబుతున్నారు. నీటి లీకేజీ స్వల్పంగా ఉన్న సమయంలోనే పుట్టీల్లో గత ఈతగాళ్లను గేట్ల వద్దకు పంపి జనప, గోగునార, పీచు ఏర్పాటు చేయించేవారు. కానీ, ఈఏడాది ఒకేసారి వరద విపరీతంగా రావడంతో అలాంటి చర్యలు చేపట్టడానికి వీల్లేకుండాపోయింది. నీరు తగ్గుముఖం పడితే కానీ క్రస్టు గేట్లనుంచి నీటి లేకేజీల నివారణకు చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని ప్రాజెక్టు సిబ్బంది తెలిపారు. -
సాగర్ క్రస్ట్‌గేట్ల మరమ్మతులు ప్రారంభం
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్‌గేట్ల బ్రిడ్జి రూలర్ల మరమ్మతు పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. అస్తవ్యస్తంగా ఉన్న రేడియల్ క్రస్ట్ గేట్ల వ్యవస్థపై గతంలో పలుమార్లు ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన అధికారులు నిపుణులను పిలిపించి రూలర్లను పరిశీలించారు. వీటికి మరమ్మతులు చేపట్టకపోతే గేట్లు, ఎత్తడం, దించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని తేల్చడంతో పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి బ్లాకులో వంగిన రూలర్లను జాకీల సహాయంతో లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం బ్లాకుల మధ్య ఉన్న రివిట్మెంట్లను గ్యాస్‌కట్టర్‌తో విడదీస్తున్నారు. ఈ పనులను తెలంగాణ ప్రాజెక్టుల రక్షణ కమిటీ సభ్యులు ఎన్. కన్నయ్యనాయుడు, డ్యాం మెయింటెనెన్స్ ఎస్ఈ రమేశ్, డీఈ విజయకుమార్, జేఈ కృష్ణయ్యలు పర్యవేక్షిస్తున్నారు. బ్రిడ్జి గ్యారంటీ పీరియడ్ పూరై్తంది – కన్నయ్యనాయుడు సాగర్ క్రస్ట్ గేట్ల బ్రిడ్జి గ్యారంటీ పీరియడ్ పూరైందని తెలంగాణ ప్రాజెక్టుల రక్షణ కమిటీ సభ్యుడు కన్నయ్యనాయుడు అన్నారు. వాలిపోయిన రూలర్లను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. 26 గేట్ల బ్రిడ్జి విడివిడిగా ఉంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మరమ్మతులు చేస్తే సరిపోయేది. ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నం ఫలించకపోతే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు ఏర్పాటు చేసినట్లుగా ఆటోమేటిక్ గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. -
ఆరుగేట్ల ద్వారా నీటి విడుదల
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నుంచి కృష్ణమ్మ ఆరుగేట్ల ద్వారా పరుగులిడుతోంది. మంగళవారం రాత్రి 10గంటలకు రెండు గేట్లనుంచి నీటిని విడుదలచేసిన అధికారులు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఉపనదుల ద్వారా వచ్చిన వరదలతో సాగర్ జలాశయం నీటిమట్టం బుధవారం సాయంత్రం అనూహ్యంగా రెండు పాయింట్లు పెరగడంతో ఆరుగేట్ల నుంచి వదులుతున్నారు. ఆరుగేట్ల ద్వారా దిగువకు 48,600 క్యూసెక్కులనీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ద్వారా కేవలం 32,800 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. క్రస్ట్‌గేట్లను మూసివేశారు. కేవలం విద్యుదుత్పాదన ద్వారా సాగర్ జలాశయంలోకి 51,599 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 24గంటల్లో సాగర్ జలాశ యం నుంచి 99,367 క్యూసెక్కుల వరదనీరు భయటకు వెళ్లింది. అంతేమోతాదులో శ్రీశైలం జలాశయం నుంచి వచ్చి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.40 అడుగులు( 212.4385 టీఎంసీలు) ఉంది. కాగా గరిష్టనీటిమట్టం 885అడుగులు( 215.8 టీఎంసీలు). సాగర్‌నీటిమట్టం 590అడుగులు. ప్రసుతం గరిష్టస్థాయిలో ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గండతో గేట్లు మూసివేసే అవకాశాలున్నాయి. కొనసాగుతున్న పర్యాటకుల సందడి సాగర్ వద్ద పర్యాటకుల సందడి కొనసాగుతోంది. కృష్ణమ్మ సోయగాలను తనివితీరా చూసేందుకు ైెహ దరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ తదితరప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. -
పోటెత్తిన తుంగభద్ర
హొస్పేట: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం డ్యాం 33 క్రస్ట్‌గేట్లను పెకైత్తి 1,93,579 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. 28 క్రస్ట్‌గేట్లను నాలుగున్నర అడుగులు, మిగతా క్రస్ట్‌గేట్లను ఒకటిన్నర అడుగు మేర పెకైత్తినట్లు తుంగభద్ర మండలి అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అక్కడ నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 1,67,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,93,579 క్యూసెక్కులు ఉందని తెలిపారు.గ -
కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు
నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. మంగళవారం ఎన్ఎస్పీ అధికారులు నాగార్జునసాగర్ జలాశయం నుంచి 6 క్రస్ట్‌గేట్లను ఐదు అడుగుల మేర పైకి లేపి దిగువకు 48,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నెల 17 సాగర్ జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యానికి (590 అడుగులకు) చేరడంతో ఎన్ఎస్పీ అధికారులు నాలుగు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో పెరడగంతో ఈ నెల 18న ఆరుగేట్లు, 19న 8 గేట్లకు పెంచారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో మంగళవారం అధికారులు నీటి విడుదలను 8 గేట్ల నుంచి 6 క్ర స్ట్గేట్లకు కుదించారు. నాగార్జునసాగర్ జలాశయ గరిష్టనీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 1,04,371 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండటంతో కుడి, ఎడమ, వరద కాల్వలతో పాటు ఎస్ఎల్బీసీ ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 1,01,478 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. పర్యాటకులు సందడి నాగార్జునసాగర్‌లో మంగళవారం పర్యాటకులు సందడి నెలకొన్నది. సాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో పాటు ఎన్ఎస్పీ అధికారులు ఆరు క్రస్ట్‌గేట్లను పైకి ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తుండడంతో సాగర్ అందాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు