నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. మంగళవారం ఎన్‌ఎస్‌పీ అధికారులు నాగార్జునసాగర్ జలాశయం నుంచి 6 క్రస్ట్‌గేట్లను ఐదు అడుగుల మేర పైకి లేపి దిగువకు 48,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నెల 17 సాగర్ జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యానికి (590 అడుగులకు) చేరడంతో ఎన్‌ఎస్‌పీ అధికారులు నాలుగు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో పెరడగంతో ఈ నెల 18న ఆరుగేట్లు, 19న 8 గేట్లకు పెంచారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో మంగళవారం అధికారులు నీటి విడుదలను 8 గేట్ల నుంచి 6 క్ర స్ట్‌గేట్లకు కుదించారు. నాగార్జునసాగర్ జలాశయ గరిష్టనీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 1,04,371 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండటంతో కుడి, ఎడమ, వరద కాల్వలతో పాటు ఎస్‌ఎల్‌బీసీ ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 1,01,478 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.
పర్యాటకులు సందడి
నాగార్జునసాగర్‌లో మంగళవారం పర్యాటకులు సందడి నెలకొన్నది. సాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో పాటు ఎన్‌ఎస్‌పీ అధికారులు ఆరు క్రస్ట్‌గేట్లను పైకి ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తుండడంతో సాగర్ అందాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు
కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు
Published Wed, Aug 21 2013 3:29 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement