నల్గొండ: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. కాగా, 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2,16,137 క్యూసెక్యులు కాగా, అవుట్ ఫ్లో 1,33,137 క్యూసెక్కులుగా ఉంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామార్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిలువ 311.1486 టీఎంసీలుగా ఉంది.
చదవండి: ఇదే చివరిసారి.. గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి
Comments
Please login to add a commentAdd a comment