Heavy water flow
-
తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన గేటు
-
యానాం - ఎదుర్లంక వారధి వద్ద ఉద్ధృతంగా గౌతమీ నది
-
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులన్నీ ఫుల్..!
-
ప్రకాశం బ్యారేజ్‌కి పోటెత్తుతున్న వరద ఉధృతి..!
-
ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం
-
మిడ్ పెన్నార్ డ్యామ్‌కు పోటేత్తిన వరద నీరు
-
కామారెడ్డి జిల్లా: శెట్పల్లి వాగులో చిక్కుకుపోయిన ముగ్గురు స్థానికులు.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
-
ముసారంబాగ్ బ్రిడ్జి వద్ద తగ్గిన వరద ప్రవాహం
-
మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జిలు క్లోజ్..
-
హైదరాబాద్: జంట జలాశయాలకు పోటెత్తిన వరద
-
మూసీ నదికి భారీగా వరద ఉధృతి
-
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌లోకి 1,10,960 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో
-
నంద్యాల: శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత
-
వరద ఉధృతితో రెండు వాగుల మధ్య చిక్కుకున్న కూలీలు
-
నంద్యాల: గరిష్ట స్థాయికి శ్రీశైలం జలాశయం
-
ముందే ఎత్తిన తుంగభద్ర గేట్లు
-
సుంకేసుల బ్యారేజీకి పరుగులు తీస్తున్న తుంగభద్ర
-
జలదిగ్బంధంలో యలమంచిలి
-
శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద
-
బిక్కుబిక్కుమంటున్న కోనసీమ లంక గ్రామాలు
-
ధవళేశ్వరం బ్యారేజ్‌కు భారీగా పోటెత్తుతున్న వరద
-
60 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
-
మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి
-
భద్రాచలం బ్రిడ్జ్‌పై రాకపోకలు నిలిపివేత
-
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి
-
భద్రాచలం వద్ద గంట గంటకు పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
-
ప్రాణాలు పణంగా పెడుతున్న జనాలు
-
Nalgonda: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద
నల్గొండ: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. కాగా, 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2,16,137 క్యూసెక్యులు కాగా, అవుట్ ఫ్లో 1,33,137 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామార్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిలువ 311.1486 టీఎంసీలుగా ఉంది. చదవండి: ఇదే చివరిసారి.. గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి -
ప్రమాదకరంగా వైయస్సార్ జిల్లాలోని పాపాగ్ని నది
-
నాగార్జున సాగర్‌కు జలకళ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో భారీ వరదతో నాగార్జున సాగర్ జలకళను సంత రించుకుంది. మొత్తంగా 312 టీఎంసీల సామర్థ్యానికిగాను.. శుక్రవారం సాయం త్రానికి నీటి నిల్వ 232 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి నాలుగు లక్షల క్యూసెక్కు లకుపైగా వరద ప్రవాహం కొనసాగు తోంది. అంటే రోజుకు సుమారు 35–40 టీఎంసీల మేర నీరు చేరుతుందని.. మూడు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఎగువన జూరాల నుంచి కూడా భారీ ప్రవాహం కొనసాగుతుండటంతో త్వరలోనే సాగర్ గేట్లు ఎత్తడం ఖాయమని తెలిపాయి. నది నిండా ప్రవాహం పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురు స్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లోకి వరద ఉద్ధృతి కొనసాగు తోంది. ఆ ప్రాజెక్టుల్లో వచ్చిన నీటిని వచ్చి నట్టుగా దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు భారీగా వరద వస్తోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జూరాలకు 4.67 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని.. 47 గేట్లు ఎత్తి 4.75 లక్షల క్యూసె క్కులను దిగువకు వదులుతు న్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4,63,952 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. క్రస్టు గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తు న్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి నాగార్జునసాగర్‌లో 560 అడు గుల మట్టం వద్ద 232.62 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఇక సాగర్‌లో విద్యుదు త్పత్తి చేస్తూ వదులుతున్న నీటిలో 27,873 క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టుకు చేరు తున్నాయి. తెలంగాణ సర్కారు పులి చింతలలో విద్యుదుత్పత్తి చేస్తూ 18,370 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీకి వదులు తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి 7,912 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు, 10,458 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తు న్నారు. ఇక పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్రలో వరద తగ్గుతోంది. డ్యామ్‌లోకి 52,140 క్యూసెక్కులు చేరుతుండగా 29,500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. -
సాగర్‌కు భారీ వరద.. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్/ధరూరు/కందనూలు: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు పడుతుండటం, ఉప నదులు ఉప్పొంగుతుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదిలేస్తున్నారు. జూరాల నుంచి 4.71 లక్షల క్యూసెక్కులు విడుదల అవుతుండగా.. దీనికి తుంగభద్ర వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.37 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. ప్రస్తుత సీజన్లో కృష్ణా నదిలో గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. గురువారం రాత్రి సమయానికి శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి.. 3,76,170 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. సాగర్ వైపు ప్రవాహం: శ్రీశైలం స్పిల్‌వే నుంచి విడుదల చేస్తున్న నీటితోపాటు.. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 66 వేల క్యూసెక్కులకుపైగా వదిలేస్తున్నారు. ఈ వరద అంతా నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను.. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 204.96 టీఎంసీలకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజీలోకి తగ్గిన వరద: వానలు తగ్గుముఖం పట్టడంతో వైరా, కట్టలేరు, మున్నేరు నుంచి వరద తగ్గింది. పులిచింతలలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న నీటికి వైరా, కట్టలేరు, మున్నేరు ప్రవాహం కలిసి.. ప్రకాశం బ్యారేజీకి 10,468 క్యూసెక్కులు వరద కొనసాగుతోంది. లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద: కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీకి ప్రాణహిత నది ద్వారా 1.1 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. గురువారం 85 గేట్లకు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులు తున్నారు. అవుట్‌ఫ్లో 74.56 వేల క్యూసెక్కులు వెళ్తోంది. -
జోరు తగ్గని కృష్ణా
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర వంటి ఉప నదులు పోటెత్తి ప్రవహిస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.98 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 876.89 అడుగులకు చేరింది. 172.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పశ్చిమ కనుమల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురవడంతో ఎగువన ఆల్మట్టిలోకి కృష్ణా వరద ప్రవాహం 3.92 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. తుంగభద్రలోనూ వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు శ్రీశైలానికి ఇదే రీతిలో వరద కొనసాగే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 43 టీఎంసీలు అవసరం కాగా, భారీ వరదతో ప్రాజెక్టు నిండే అవకాశం ఉండటంతో బుధవారం గేట్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ 35,315 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తోంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న ప్రవాహంతో సాగర్‌లో నీటి మట్టం 539.7 అడుగులకు పెరిగింది. నీటి నిల్వ 187.70 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోయింది. పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 26,011 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. మరోవైపు పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. విద్యుదుత్పత్తికి ఏపీకి బోర్డు అనుమతి ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం కుడి గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలన్న ఏపీ సర్కార్ ప్రతిపాదనను కృష్ణా బోర్డు ఆమోదించింది. దాంతో ఆ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించాలని ఏపీ జెన్కో అధికారులకు శ్రీశైలం ప్రాజెక్టు సీఈ మురళీనాథ్‌రెడ్డి సూచించారు. -
పాతాల గంగా పైపైకి..
జిల్లాలో భూగర్భ నీటి మట్టం పెరిగింది. ఆగస్టులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ముసురు పెట్టడంతో నీరు భూమిలోకి ఇంకి పోయింది. జూలై మాసానికి పోల్చుకుంటే సగటున 3.31 మీటర్లు నీట మట్టం పెరిగింది. సాక్షి, నిజామాబాద్ : పాతాల గంగ పైపైకి వచ్చింది. ఆగస్టు మాసంలో కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జల మట్టం భారీగా పెరిగింది. జూలై మాసంతో పోల్చితే జిల్లాలో సగటున 3.31 మీటర్లు పైకి వచ్చింది. జూలైలో సగటున 12.28 మీటర్ల లోతులో ఉంటే., ఇప్పుడు 8.97 మీటర్లు పైకి వచ్చాయి. గత ఏడాది 2019 ఆగస్టు మాసంలో 11.64 మీటర్ల లోతులో ఉండగా, ఇప్పుడు 8.97 మీటర్ల వరకు పెరగడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెలలో జిల్లాలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. వారం రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. ప్రధానంగా రోజుల తరబడి ముసురు పెట్టడంతో వర్షం నీరు క్రమంగా భూమిలోకి ఇంకి పోయింది. ముప్కాల్, బాల్కొండ మండలాలు మినహా, మిగిలిన 23 మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది. వేల్పూర్, నవీపేట్, ఎడపల్లి, రెంజల్ మండలాల్లో ఎక్సెస్ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ నీటి మట్టం పైకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 49 చోట్ల ఏర్పాటు చేసిన ఫీజో మీటర్లలో తాజా నీటి మట్టాలను భూగర్భ జలశాఖ వారం రోజుల క్రితం లెక్కించింది. సిరికొండలో అత్యధికంగా.. జిల్లాలో సిరికొండ మండలంలో భూగర్భ నీటి మట్టం లోతులో ఉంటుంది. ఇలాంటి మండలాల్లో కూడా ఈసారి భూగర్భ జలాలు భారీగా పెరగడం గమనార్హం. చీమన్‌పల్లిలో ఏకంగా 12.9 మీటర్లు పైకి వచ్చాయి. ఇక్కడ జూలైలో 23.70 మీటర్ల లోతులో నీటి మట్టం ఉండేది. ఆగస్టు మాసానికి వచ్చేసరికి 10.80 మీటర్లపైకి నిళ్లు వచ్చాయి. అలాగే పాకాలలో కూడా 5.7 మీటర్లు పెరిగాయి. ఇక్కడ 20.55 మీటర్ల లోతులో ఉన్న నీరు.. నెల రోజుల్లో 14.85 మీటర్ల పైకి వచ్చాయి. ఎండా కాలంతో పోల్చితే.. ఎండా కాలంతో పోల్చితే జిల్లాలో స్వల్పంగానే పెరిగినట్లు భూగర్భ జలశాఖ తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం కాకముందు మే మాసంలో జిల్లాలో సగటున 11.95 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ఇప్పుడు 8.97 మీటర్లకు పెరిగింది. అంటే సగటున 2.98 మీటర్లు పెరిగింది. నివేదికల్లో గందరగోళం... భూగర్భ జల శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా వర్షాలు కురిస్తే భూగర్భ జల మట్టం పెరుగుతుంది. కానీ కొన్ని ఫీజో మీటర్ల పరిధిలో తగ్గినట్లు నివేదికలో పేర్కొనడం గమనార్హం. ⇔ భీంగల్ మండలం గోన్గొప్పులలో మే మాసంలో 29.55 మీటర్ల లోతులో నీటి మట్టం ఉందని పేర్కొనగా, ఆగస్టుకు వచ్చే సరికి మూడు నెలలు భారీ వర్షాలు కురిసినా.. ఇక్కడ 32.47 మీటర్లకు పడిపోయినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఇక్కడ నీటి మట్టం పెరగాల్సి ఉండగా, అధికారులు మాత్రం 2.92 మీటర్లు ఇంకా లోతుకు పడిపోయినట్లు చూపారు. తాళ్లపల్లిలో కూడా ఇలాగే ఎండా కాలం కంటే వర్షా కాలంలో నీటి మట్టం పడిపోయినట్లు చూపారు. ⇔ డిచ్పల్లి మండలం యానంపల్లిలో కూడా వర్షాలు కురిసాక భూగర్భ జల మట్టం తగ్గినట్లు పేర్కొన్నారు. అలాగే కోటగిరి మండలం కల్లూరులో కూడా ఎండాకాలం కంటే వర్షాకాలంలో నీటి మట్టం పడిపోయినట్లు తెలిపారు. అయితే కొన్ని ఫీజో మీటర్ల పరిధిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, ప్రత్యేక పరిశీలన చేస్తామని భూగర్భ జలశాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
కృష్ణా నది ముంపు బారిన కృష్ణలంక
-
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటిని తిలకిస్తున్న నగరవాసులు
-
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నది ఉగ్రరూపం కొనసాగిస్తోంది. మధ్య మధ్యన కొంత తెరపినిచ్చినా మళ్లీ అదే స్థాయిలో ఉరకలెత్తుతోంది. రెండు నెలల కింద మొదలైన కృష్ణా పరవళ్లు ఏమాత్రం విరామం లేకుండా పరుగులు పెడుతూనే ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, బేసిన్ పరిధిలో ఉప్పొంగుతున్న ఉపనదుల కారణంగా గురువారానికి ప్రవాహాలు 1.30 లక్షలకు పుంజుకున్నాయి. దీంతో ఆల్మట్టి మొదలు పులిచింతల ప్రాజెక్టు వరకు అన్ని ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి. రోజురోజుకూ పుంజుకుంటున్న ప్రవాహాలు.. గత 3, 4 రోజులుగా కృష్ణమ్మ కాస్త శాంతించినట్లు కనబడ్డా మళ్లీ ఉగ్రరూపమెత్తింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం ఆల్మట్టిలోకి 53 వేల క్యూసెక్కుల మేర మాత్రమే ప్రవాహం కొనసాగగా అది గురువారం సాయంత్రానికి మరో 80 వేల క్యూసెక్కుల మేర పెరిగి 1.30 లక్షల క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిస్థాయి మట్టాలకు చేరుకోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ఇక నారాయణపూర్‌కు ఈ వరదంతా చేరుతుండటంతో అక్కడి నుంచి 1.68 లక్షల క్యూసెక్కులను దిగువ జూరాలకు వదిలేశారు. జూరాలకు ప్రస్తుతం 1.07 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా శుక్రవారానికి అది మరింత పుంజుకునే అవకాశం ఉంది. మరోపక్క మహారాష్ట్రలోని ఉజ్జయిని నుంచి సైతం 55 వేల క్యూసెక్కులు దిగువకు వదలడంతో ఆ నీరంతా జూరాలకు వచ్చే అవకాశం ఉంది. ఇక తుంగభద్ర నుంచి వస్తున్న ప్రవాహం, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలానికి 1.77 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడి నుంచి విద్యుదుత్పత్తి, గేట్లు ఎత్తడం ద్వారా 2.51 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రవాహాలకుతోడు స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌లోకి 1.90 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టుల పూర్తిస్థాయి మట్టాలకు నిల్వలు చేరడంతో ఇక్కడి నుంచి 1.98 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ఆ నీరంతా పులిచింతల ద్వారా సముద్రంలో కలుస్తోంది. ఇప్పటిదాకా కృష్ణా బేసిన్ నుంచి 460 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. పదేళ్ల రికార్డులు బధ్దలు... ఇక కృష్ణా బేసిన్లో కొనసాగుతున్న వరద కొత్త రికార్డులు సృష్టించింది. విరామం లేకుండా కొనసాగిన వరద కారణంగా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వచ్చిన వరద పదేళ్ల రికార్డులను చెరిపేసింది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009–10లో గరిష్టంగా 1,218.55 టీఎంసీలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే శ్రీశైలం జలాశయంలోకి 1,220 టీఎంసీల మార్కును దాటింది. గత పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో ప్రస్తుతం కృష్ణా నదికి వరద కొనసాగుతుండటంతో ఇది మరింత పెరగనుంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలు, తుపానుల కారణంగా కృష్ణా బేసిన్లో మరో రెండు నెలలపాటు భారీ వర్షాలకు ఆస్కారం ఉంటుంది. గతంలో ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు కురవకపోయినా అక్టోబర్, నవంబర్లలో తుపానుల కారణంగా భారీ వరదలొచ్చాయి. ప్రస్తుత ఏడాదిలోనూ అదేమాదిరి వర్షాలు కురిస్తే శ్రీశైలానికి ఈ ఏడాది వచ్చే నీరు కొత్త రికార్డులు సృష్టించనుంది. ఇక జూరాల ప్రాజెక్టుకు సైతం ఈ ఏడాది ఏకంగా వెయ్యి టీఎంసీలకుపైగా వరద వచ్చింది. 2007–08లో 1,266.58 టీఎంసీల మేర వరద రాగా ఆ తర్వాత ఇప్పుడే 1,053.13 టీఎంసీల మేర వరద వచ్చింది. ఇక సాగర్‌కు సైతం ఎన్నడూ లేని రీతితో ఈ ఏడాది 799 టీఎంసీల మేర నీరు రావడం గమనార్హం. ఎస్సారెస్పీలోకి భారీ ప్రవాహాలు.. గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటి ప్రవాహాలు మరింత పుంజుకున్నాయి. గురువారం ఏకంగా 45,990 క్యూసెక్కుల మేర ప్రవాహాలు రావడంతో ప్రాజెక్టు నిల్వ 90 టీఎంసీలకుగాను 60.63 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మరో నాలుగైదు రోజులు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టులో నిల్వలు కనిష్టంగా 77 టీఎంసీలకు చేరే అవకాశాలున్నాయి. ఇక ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టుల్లోకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవాహాలు కొనసాగుతున్నాయి. -
జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తివేత
సాక్షి, మహబూబ్‌నగర్ : ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 5.85 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 5.87 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.097 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. పూర్తి నిల్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ మట్టం 317.20 మీటర్లు ఉండగా పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. -
పదేళ్ల తర్వాత ప్రకాశం బ్యారేజ్‌కు జలకళ
సాక్షి, విజయవాడ : నాగార్జున సాగర్ నుంచి భారీ ఎత్తున నీరు చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోంది. వరద ఉదృతి పెరిగేకొద్దీ నీటి విడుదల శాతాన్ని కూడా అధికారులు పెంచుతున్నారు. మంగళవారం రాత్రి వరకు ఐదు లక్షలకు పైగా ఇన్ ఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. పదేళ్ల తర్వాత ప్రకాశం బ్యారేజీకి జలకళ రావడం, మొత్తం 72 గేట్లు ఎత్తేయడంతో సందర్శకుల తాకిడీ పెరుగుతోంది. మరోపక్క చందర్లంపాడులో వరద నీటిలో గొర్రెల కాపర్లు చిక్కుకోవడంతో వారిని రెస్క్యూ టీం కాపాడుతున్నారు. -
గోదావరి వరద పోటు..
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం శనివారం కొంత శాంతించినప్పటికీ భద్రాచలం వద్ద గోదావరిలో మాత్రం నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు రెండు రోజులుగా జిల్లాలో పొంగిపొర్లి ప్రవహించిన వాగులు కొంత తగ్గుముఖం పట్టాయి. కాగా పలు చెరువుల్లోకి కొత్తనీరు వచ్చి చేరుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు శుక్రవారం రాకపోకలు నిలిచిపోగా, శనివారం ఆ పరిస్థితి కనిపించలేదు. చర్ల మండలంలోని చింతగుప్ప, బోధనెల్లి గ్రామాల సమీపంలో మాత్రం వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఎగువ ప్రాంతాల్లోని గ్రామాలకు రెండో రోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గత వారం రోజులుగా గోదావరి దోబూచులాడుతోంది. ఎగువన కురు స్తున్న వర్షాలకు ఇంద్రావతి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద పెరుగుతోంది. జిల్లాకు దిగువన శబరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరి ఎగపోటు వేస్తోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఇటీవల తగ్గుముఖం పట్టిన వరద మళ్లీ పెరిగింది. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సాయంత్రం 4 గంటలకు 46 అడుగులకు చేరింది. ఈ వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. వరద పరిస్థితులను సమీక్షిస్తున్న కలెక్టర్.. భద్రాద్రి కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ శనివారం భద్రాచలం చేరుకుని గోదావరి వరద పరిస్థితిని సమీక్షించారు. కరకట్ట వద్ద ఉన్న స్లూయీస్‌లను పరిశీలించారు. సాయంత్రం స్లూయీస్ గేట్ల ద్వారా పట్టణంలోకి గోదావరి నీరు రావడంతో అధికారులు భారీ మోటార్ల ద్వారా తిరిగి గోదావరిలోకి పంపింగ్ చేయించారు. వరద పరిస్థితులను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా కలెక్టర్ కార్యాలయంలో 08744–241950, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08743–232444 నంబర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 24 గంటలు ఈ కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తాయని, వరద సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రజలు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చని ప్రకటించారు. గ్రామాల్లో వరద పరిస్థితులను పరిశీలించేందుకు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సెక్టోరియల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. 3వ ప్రమాద హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముంపు ప్రాంతాల్లోని గర్భిణులను గుర్తించి ప్రసవ సమయంలోగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గోదావరి వరద ప్రవాహం పెరిగితే... కరకట్ట సమీపంలోని కొత్తకాలనీ, సుభాష్‌నగర్ వైపు స్లూయీస్‌లు ఉండడం, వరదనీరు లీకేజీ అవుతుండటంతో మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని తిరిగి గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నారు. కాగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటితే వాజేడు మండలంలోని 5 గ్రామాలు, వెంకటాపురం మండలంలోని 6 గ్రామాలు, చర్ల మండలంలో 2 గ్రామాలు, దుమ్ముగూడెం మండలంలోని 10 గ్రామాలు, భద్రాచలం మండలంలో కొన్ని కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు మండలంలో 2 గ్రామాలు, వీఆర్‌పురం మండలంలోని 6 గ్రామాలు వరద ముంపునకు గురవుతాయి. 50 అడుగులు దాటితే ఎటపాక వద్ద రాకపోకలు నిలిచిపోతాయి. అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లోని కొన్ని గ్రామాలు జల దిగ్బంధానికి గురయ్యే అవకాశం ఉంది. తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత... చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. అయితే శనివారం మాత్రం 24 గేట్లను పూర్తిగా ఎత్తి 1,18,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. చింతగుప్ప, బోధనెల్లి గ్రామాల సమీపంలోని వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఎగువ ప్రాంతాల్లోని గ్రామాలకు రెండోరోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌లో శనివారం సాయంత్రానికి 397.40 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 2,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 5.983 టీఎంసీల నీళ్లు కిన్నెరసాని రిజర్వాయర్‌లో నిల్వ ఉంది. -
పోటాపోటీగా వరద ప్రవాహం
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/రాయచూరు రూరల్ : కృష్ణా, గోదావరి నదులు వరద ఉధృతితో పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,93,400 క్యూసెక్కుల ప్రవాహంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే.. 7,39,745 క్యూసెక్కుల ప్రవాహంతో కడలి వైపు గోదావరి పరుగులు పెడుతోంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటం, ఎగువ నుంచి భారీ వరద వస్తోందన్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక సర్కార్ ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నీటి మట్టాన్ని తగ్గించుకుంటూ.. భారీ ఎత్తున వరద జలాలను దిగువకు విడుదల చేస్తోంది. ఆ వరద జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, గురువారం రాత్రి 7 గంటలకు నీటి మట్టం 823 అడుగులకు, నీటి నిల్వ 43.14 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం నిండాలంటే ఇంకా 169 టీఎంసీలు అవసరం. మరోవైపు బీమా నదిలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ఉజ్జయిని జలాశయంలోకి 79,861 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 74.64 టీఎంసీలకు చేరుకుంది. ఆ ప్రాజెక్టు నిండాలంటే 42 టీఎంసీలు అవసరం. వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే వారం రోజుల్లో ఉజ్జయిని నిండే అవకాశం ఉంటుంది. తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 34.24 టీఎంసీలకు చేరుకుంది. అది నిండాలంటే ఇంకా 72.46 టీఎంసీలు అవసరం. ఆ రెండు జలాశయాలు నిండితే శ్రీశైలానికి వరద మరింతగా పెరుగుతుంది. 822.30 అడుగులకు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తివేత గోదావరి నదిలో వరద ఉధృతి బుధవారంతో పోల్చితే గురువారం మరింతగా పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 7,39,745 క్యూసెక్కులను ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి గురువారం ఉదయం ఆరు గంటల వరకు 70 టీఎంసీల జలాలు సముద్రంలో కలిశాయంటే గోదావరి వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం రాత్రి నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు పడకపోతే.. శుక్రవారం గోదావరి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలవరం వద్ద అప్రమత్తం భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 35.50 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 27.54 అడుగులకు చేరుకుంది. కాఫర్ డ్యామ్ గ్యాప్‌ల గుండా.. పోలవరం స్పిల్ వే రివర్ స్లూయిజ్‌ల ద్వారా గోదావరి ప్రవాహం దిగువకు వెళ్తోంది. గోదావరిలో వరద ప్రవాహం 12 లక్షల క్యూసెక్కులకు చేరితే.. పోలవరం కాంటూర్ 41.15 మీటర్ల పరిధిలోని ముంపు గ్రామాలకు వరద జలాలు చేరుతాయని అధికార వర్గాలు తెలిపాయి. పోలవరం వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
ఉగ్రగోదావరి
సాక్షి, పోలవరం(పశ్చిమగోదావరి) : ధవళేశ్వరం గోదావరి నీటిమట్టం 9 అడుగులకు చేరింది. బుధవారం సుమారు ఏడు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఉభయగోదావరి జిల్లాల మధ్య పోలవరం కాఫర్ డ్యామ్ నిర్మాణంతో గిరిజన నిర్వాసిత గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఫలితంగా నిర్వాసిత గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలవరం నుంచి ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం జలమయమైంది. దీంతో పోలవరం కుక్కునూరు మండలాల్లోని 29 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీటికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల చుట్టూ వరదనీరు చేరడంతో ఆ గ్రామాల ప్రజలు కొండపైకి ఎక్కి తాత్కాలికంగా గుడారాలు వేసుకుంటున్నారు. ఇంట్లోని సామగ్రి, పశువులను వెంట పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యత్నించినా.. వరదలు వస్తే పోలవరం మండలంలోని 19 గ్రామాల నిర్వాసితులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం ముందుగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒక్కసారిగా వరదలు పెరగడంతో రోడ్డు మార్గాల్లోకి వరదనీరు చేరింది. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నిర్వాసితులను అత్యవసర పరిస్థితుల్లో మండల కేంద్రం పోలవరం చేర్చేందుకు టూరిజం బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోట్ల సింగన్నపల్లి రేవు నుంచి గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా పోలవరం, కుక్కునూరు మండలాల్లో 22 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏజెన్సీకి వెళ్లే ప్రధాన రహదారులు నీటమునిగాయి. పోలవరం ప్రాజెక్టు ప్రాంతమూ ముంపునకు గురైంది. వెళ్లే పరిస్థితి లేదు. ప్రాజెక్టు ప్రాంతం నుంచి సింగన్నపల్లి వెళ్లే రోడ్డు మార్గం కూడా వరదనీటిలో మునిగిపోయింది. ముందస్తుగా అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిర్వాసితులు రాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. నిర్వాసితుల కోసం పోలవరం, గూటాల, పట్టిసీమ, చేగొండిపల్లి ప్రాంతాల్లో షెల్టర్లను గుర్తించారు. వరదలు పూర్తిగా తగ్గి, రోడ్డు మార్గాలు బయటపడితే తప్ప నిర్వాసిత గ్రామాల ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. గోదావరి వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టు స్పిల్‌వేలోని రివర్స్ స్లూయిజ్ ద్వారా నీరు దిగువకు చేరుతోంది. గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చేందుకు ప్రయత్నించిన మార్గాల్లో పనులు చేపట్టి నీరు వెళ్లే విధంగా ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. 8 రివర్స్ స్లూయిజ్‌ల నుంచి నీరు స్పిల్వేలోకి చేరుతోంది. స్పిల్ ఛానల్ మీదుగా గోదావరిలోకి నీరు చేరేందుకు ఏర్పాటు చేశారు. కాఫర్ డ్యామ్ వద్ద 27.20 మీటర్ల నీటిమట్టం పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 27.20మీటర్లకు చేరింది. ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తోంది. 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దాటితే స్పిల్‌వే రివర్స్ స్లూయిజ్ నుంచి స్పిల్ ఛానల్ ద్వారా నీరు విడుదల చేయాలని సీడబ్ల్యూసీ అధికారులు సూచించినట్లు ప్రాజెక్టు ఈఈ డి.శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు స్పిల్ వే ఎగువ ప్రాంతం నుంచి దిగువకు నీరు వెళ్లే విధంగా మార్గాలు ఏర్పాటు చేశారు. రివర్స్ స్లూయిజ్ ద్వారా 50వేల క్యూసెక్కుల నీరు స్పిల్ ఛానల్ నుంచి గోదావరి నదిలోకి కలిసే పరిస్థితి ఉంది. నిర్వాసిత గ్రామాలకు రెవెన్యూ సిబ్బంది తరలింపు ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేసి నిర్వాసిత గ్రామాలకు రెవెన్యూ సిబ్బందిని పంపినట్లు పోలవరం ఇన్చార్జ్ తహసిల్దార్ జి.అర్జునరావు తెలిపారు. మూడు టూరిజం బోట్లు, ఒక స్పీడు బోటు, రెండు ఇంజిన్ పడవలు ఏర్పాటు చేశామన్నారు. వరద పరిస్థితిని పోలవరం సీఐ ఏఎన్‌ఎన్‌మూర్తి, ఎస్సై ఆర్.శ్రీను పరిశీలించారు. అవసరమైన చోట పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నామని సీఐ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా ఇన్‌ఫ్లో వరద నీటితో గోదావరి ఉరకలెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా 6,98,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లొ వచ్చి చేరుతోంది. వశిష్ట గోదావరిపై విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న కాటన్ బ్యారేజీ సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో మిగులు జలాలను ధవళేశ్వరం జలవనరుల శాఖ హెడ్‌వర్క్స్ అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ 175 గేట్లను 01 మీటరు వరకు ఎత్తి బుధవారం 6,87,362 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలలను సముద్రంలోకి వదిలారు. భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం నుంచి నీటి మట్టం తగ్గుతోందని, దీనివల్ల గురువారం 8 లక్షల క్యూసెక్కుల వరదనీటిని వదిలే అవకాశం ఉందని ధవళేశ్వరం హెడ్ వర్క్స్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సాయంత్రం 7 గంటలకు 9.00 అడుగుల నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద 38.80 అగుగుల నీటి మట్టం నమోదవగా రాత్రి నుంచి తగ్గుముఖం పట్టింది. పోలవరం వద్ద 11.70 మీటర్లు, రాజమహేంద్రవరం బ్రిడ్జి వద్ద 15.47 మీటర్లు నీటి మట్టాలు పెరుగుతూ వస్తున్నాయి. సముద్రంలోకి భారీగా వరద నీటిని వదలడంతో ప్రస్తుతం గోదావరి నది సరాసరి నీటి మట్టం 13.41 మీటర్లుగా నమోదైంది. డెల్టాలకు నీటి విడుదల తగ్గింపు ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. పశ్చిమడెల్టాకు 3,500 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2,000 క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 2,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలోని ఏలూరు కాలువకు 627 క్యూసెక్కులు, నరసాపురం కాలువకు 991 అత్తిలి కాలువకు 196, తణుకు కాలువకు 488 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
ప్రమాదకర స్థాయిలో గోదావరి..
మంబై : మహారాష్ట్రలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నాశిక్‌లో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి భారీగా వరద పోటెత్తింది. అంతేకాకుండా సోమవారం మహారాష్ట్ర జలవనరుల శాఖ గంగాపూర్ డ్యామ్ నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలింది. దీంతో నాశిక్ వద్ద గోదావరి ఉధృతి ప్రమాదకరస్థాయికి చేరింది. గంగాపూర్ నుంచి గోదావరిలోకి నీరు వదిలే సమయంలో నది ఒడ్డుకు సమీపంలోని కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, జూలై ప్రారంభం నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఇప్పటివరకు దాదాపు 1200 మి.మీ వర్షపాతం నమోదైంది. -
గోదావరి నది ఉగ్రరూపం
-
గోదావరిలో పెరుగుతున్న వరద ఉధృతి
సాక్షి, తూర్పు గోదావరి : గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 10.90 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 70వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. దీంతో అధికారులు 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. -
శ్రీరాం సాగర్‌కు జలకళ
సాక్షి, నిజామాబాద్ : భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులు, కుంటలు, చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. తెలంగాణతో పాటు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1071.9 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.912 టీఎంసీలు ఉంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టులోకి 14 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఆదివారం మధ్యాహ్నం వరద ఇన్ ఫ్లో 16,450 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిండుకుండలా మారడంపై ఆయకట్టు రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాం సాగర్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. -
సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతోంది. కృష్ణా, దాని ఉప నదుల నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 2,48,866 క్యూసెక్కుల వరద రాగా రాత్రి 7 గంటలకల్లా 1,28,460 క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం ఏడు గేట్లు ఎత్తి పోతిరెడ్డిపాడుకు 11 వేలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,054, హంద్రీ–నీవాకు 1,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దాంతో సాగర్‌లోకి 1,84,262 క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 548 అడుగుల్లో 204.305 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.045 టీఎంసీలు. అంటే సాగర్ నిండటానికి ఇంకా 98 టీఎంసీలు అవసరం. వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారంలో సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఆదివారం జలాశయానికి వరద పెరగడంతో నీటిమట్టం క్రస్ట్‌గేట్లను తాకింది. నీటిమట్టం రోజుకు ఏడు అడుగుల చొప్పున పెరుగుతోంది. సాగర్‌కు దిగువన నదీ పరీవాహకంలో కురిసిన వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులోకి కృష్ణా వరద ప్రవా హం నిలకడగా కొనసాగుతోంది. ఆదివారం 6,314 క్యూసెక్కులకు చేరడంతో పులిచింతల ప్రాజెక్టులో నీటినిల్వ 14.47 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర జలాశయంలోకి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం 14,756 క్యూసెక్కులు చేరడంతో తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 85.58 టీఎంసీలకు చేరింది. సోమశిలలోకి పెన్నా వరద ప్రవా హం శనివారంతో పోల్చితే ఆదివారం తగ్గింది. ఈ ప్రాజెక్టులో నీటినిల్వ 40.96 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణాలో అనూహ్యంగా నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు జలాల పంపిణీపై కృష్ణా బోర్డు కసరత్తు చేస్తోంది. నీటిలెక్కలు తేలాక శ్రీశైలం, సాగర్ ఆయకట్టులో రబీ పంటల సాగుకు నీటిని విడుదల చేయనున్నారు. -
పెద్దవాగుకు పోటెత్తిన వరద
అశ్వారావుపేట (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామం వద్ద ఉన్న పెద్దవాగుకు వరద నీరు విపరీతంగా చేరుతోంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు పోటెత్తడంతో ఆదివారం ఉదయం పెద్దవాగుకు చెందిన ఒకటవ నంబరు గేటు ఎత్తివేసి 2,820 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఇంజనీర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ఎక్కువైతే మళ్లీ గేటు తెరిచి నీటిని కిందికి వదలాలని నిర్ణయించారు. -
శ్రీశైలానికి పెరుగుతున్న వరద ఉధృతి
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల జలాశయానికి రోజు రోజుకు వరద ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం నుంచి శనివారం వరకు 5 టీఎంసీల నీరు జలాశయానికి వచ్చి చేరింది. జూరాల, తుంగభద్ర, హంద్రీల నుంచి 62,566 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం ప్రారంభమయ్యేనాటికి శ్రీశైలం డ్యాం నీటిమట్టం 801.90 అడుగులుగా ఉంది. శనివారం సాయంత్రం సమయానికి డ్యాం నీటిమట్టం 822.30 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 42.6064 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.