సాక్షి, తూర్పు గోదావరి : గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 10.90 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 70వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. దీంతో అధికారులు 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment