cumbum
-
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం: సెల్ఫీ వీడియోతో
సాక్షి, ప్రకాశం: భర్తతోపాటు అతను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు వేధిస్తున్నారంటూ ఓ వివాహిత ఉరేసుకుని అర్ధంతరంగా తనువు చాలించింది. మరణించే ముందు సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమవుతూ తన ఆవేదనను వెలిబుచ్చింది. ఈ ఘటన మంగళవారం కంభం పట్టణంలోని కందులాపురం కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి సోదరుల కథనం మేరకు.. అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామానికి చెందిన దూదేకుల భాను(29)కు పదేళ్ల క్రితం కంభం పట్టణానికి చెందిన నాగూర్‌వలితో వివాహమైంది. వారికి ముగ్గురు కుమారులు. అయితే నాగూర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ వివాదం జరుగుతోంది. తరుచూ హింసిస్తుండటంతో భాను పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా నాగూర్వలి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో మనస్తాపం చెందిన భాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, తమ సోదరి చావుకు కారణమైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరులు కోరారు. చదవండి: వివాహేతర సంబంధం: భార్య తల నరికిన భర్త.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి.. -
వీడియోలు ఫ్రీ అంటూ అడల్ట్ వెబ్సైట్!
న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని వేల పోర్న్ వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ముఖ్యంగా చిన్నారుల వీడియోలు అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని ఆ సైట్లపై నిషేధం విధించారు. అయితే తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక్కో గ్రామానికి అమెరికాకు చెందిన పోర్న్ వెబ్సైట్ నిర్వాహకులు ఓ విచిత్ర ఆఫర్‌ను ప్రకటించారు. సైట్ లైఫ్ టైం ఫ్రీ మెంబర్ షిప్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. దీని ప్రకారం తమిళనాడు కంబం వ్యాలీ గ్రామస్తులు, అసోంలోని చుటియా, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన వారికి అమెరికన్ అడల్ట్ వెబ్సైట్ ఉచితంగా అశ్లీల వీడియోలు చూసేందుకు వీలుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లోని కొన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల ప్రజలకు వీడియోలు ఉచితంగా అందించాలని ఆ వెబ్సైట్ నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కంబం వ్యాలీ, చుటియా గ్రామాల వారికి ఈ సౌకర్యం కల్పించన్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమిళనాడు పశ్చిమ కనుమల్లో ఉన్న కంబం తియ్యని నీళ్లు, ప్రకృతి సౌందర్యానికి ఫేమస్. ఇక్కడి పేర్లు అంతర్జాతీయంగా అసభ్య అర్థాలు వచ్చేలా ఉన్నాయన్న కారణంగా వెబ్సైట్ నిర్వాహకులు కొన్ని గ్రామాల పేరున్న బోర్డుల వద్ద ఫొటోలు దిగి ప్రోమో వీడియో రూపొందించారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. నెదర్లాండ్‌లోని రెక్టమ్, ఇంగ్లండ్ లోని థాంగ్, షిట్టర్టన్, అమెరికాలోని క్లైమాక్స్, ఇతర ప్రాంతాల వారికి లైఫ్‌టైమ్ ఫ్రీ మెంబర్‌షిప్‌ను కల్పించారు. -
ఫ్రీగా అంటూ.. నగలతో మాయం
కంభం (ప్రకాశం జిల్లా) : బంగారానికి ఉచితంగా మెరుగుపెడతామని చెప్పి దోచుకెళ్లిన ఘటన శుక్రవారం కంభం మండలకేంద్రంలోని గాంధీ బజార్లో చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఆభరణాలకు మెరుగు పెడుతామంటూ ఓ ఇంట్లోకి వెళ్లారు. వారి మాటలను నమ్మిన శ్వేత అనే మహిళ వారికి నాలుగు బంగారు గాజులను అప్పగించింది. దాహంగా ఉందని, మంచి నీళ్లు కావాలని వారు అడగటంతో ఆమె లోపలికి వెళ్లింది. తిరిగి నీళ్లు తెచ్చేసరికి ఇద్దరు దుండగులు బంగారు గాజులతో పరారయ్యారు. సుమారు 6 తులాల విలువైన గాజులను ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ నేత కుమారుడి దారుణ హత్య
కంబం (ప్రకాశం జిల్లా) : కంబంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. కంబం అగ్రికల్చర్ మార్కెట్ యార్డు వద్ద వైఎస్సార్ సీపీ నేత చేగిరెడ్డి లింగారెడ్డి కుమారుడిని కిరాతకంగా హత్య చేశారు. దుండగులు హత్య అనంతరం ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంస్కృతిని కాపాడుతున్న పల్లెలు
కంభం రూరల్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు అవకుండా పల్లె సీమలు కాపాడుతున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. అర్ధవీడు మండలం కాకర్ల, నాగులవరం గ్రామాల సర్పంచ్‌లు యేరువ విజయకుమారి, ఈర్ల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేసి మాట్లాడారు. మహిళలు పోటీల్లో పాల్గొనడం సంతోషించదగ్గ విషయమన్నారు. కాకర్లలో కొప్పుల దుర్గా శైలజ ప్రథమ, యేరువ సావిత్రి ద్వితీయ, ఆర్.ఎల్లమ్మ తృతీయ బహుమతులు సాధించారు. వారికి యేరువ వెంకటరెడ్డి ఐదు తులాల వెండి, నారు బాలిరెడ్డి మూడు, బాసు వెంకటేశ్వరరె డ్డి రెండు తులాల వెండి బహూకరించారు. నాగులవరంలో గుడిసె విజయ, బొగ్గు రాజ్యలక్ష్మి, కనుమర్ల సునీతలకు సర్పంచ్ యేరువ వెంకటలక్ష్మి బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని బాసు వెంకటేశ్వరరెడ్డి ఘనంగా సన్మానించారు. అర్ధవీడు, గిద్దలూరు ఎంపీపీలు రవికుమార్‌యాదవ్, వంశీధరరెడ్డి, మండల కన్వీనర్ యేరువ రంగారెడ్డి , అర్ధవీడు ఎస్సై నాగమలేశ్వరరావు, కాకర్ల, నాగులవరం సర్పంచ్‌లు యేరువ విజయకుమారి, వీర్ల వెంకటలక్ష్మి, నారు అశోక్‌రెడ్డి, రమేష్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.