బంగారానికి ఉచితంగా మెరుగుపెడతామని చెప్పి దోచుకెళ్లిన ఘటన శుక్రవారం కంభం మండలకేంద్రంలోని గాంధీ బజార్‌లో చోటుచేసుకుంది.
కంభం (ప్రకాశం జిల్లా) : బంగారానికి ఉచితంగా మెరుగుపెడతామని చెప్పి దోచుకెళ్లిన ఘటన శుక్రవారం కంభం మండలకేంద్రంలోని గాంధీ బజార్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ఆభరణాలకు మెరుగు పెడుతామంటూ ఓ ఇంట్లోకి వెళ్లారు. వారి మాటలను నమ్మిన శ్వేత అనే మహిళ వారికి నాలుగు బంగారు గాజులను అప్పగించింది.
దాహంగా ఉందని, మంచి నీళ్లు కావాలని వారు అడగటంతో ఆమె లోపలికి వెళ్లింది. తిరిగి నీళ్లు తెచ్చేసరికి ఇద్దరు దుండగులు బంగారు గాజులతో పరారయ్యారు. సుమారు 6 తులాల విలువైన గాజులను ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.