curb
-
సోషల్ మీడియాపై అణచివేతలొద్దు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాను అణచివేయాలనుకోవడం సరైంది కాదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ చెప్పారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి అది ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తే ప్రభుత్వానికి చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిపారు. అతి తక్కువ కేసుల్లోనే సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు చేపడుతుందని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో బహిరంగ చర్చలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచి చేసే పరిణామమేనని వ్యాఖ్యానించారు. హద్దులు మీరితే తప్ప సాధారణంగా విమర్శలపై సుప్రీంకోర్టు పెద్దగా స్పందించబోదని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే చర్యలను ప్రారంభించకూడదని ప్రభుత్వానికి కె.కె.వేణుగోపాల్ సూచించారు. స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్యం, బహిరంగ చర్చలు అవసరమేనని తెలిపారు. సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకొని ట్వీట్లు చేస్తున్న వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని తనకు విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. అలాంటి విజ్ఞప్తులు త్వరలో ఆగిపోతాయని ఆశిస్తున్నట్లు పీటీఐకి తెలిపారు. ఎవరిపై అయినా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలంటే అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అంగీకారం తెలిపాల్సి ఉంటుంది. సెంట్రల్ విస్టా శంకుస్థాపనకు ఓకే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి 10వ తేదీన పునాది రాయి వేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం నుంచి నిర్ణయం వెలువడే వరకూ ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టబోమని సర్కారు హామీ ఇవ్వడంతో శంకుస్థాపన విషయంలో సానుకూలంగా స్పందించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన సముదాయం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవన నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలువురు పిల్లు చేశారు. వీటిపై తాజాగా జస్టిస్ ఎ.ఎం.ఖాన్వీల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ం హామీని పరిగణనలోకి తీసుకుని శంకుస్థాపనకు అనుమతి ఇచ్చింది. -
ఆన్లైన్ మోసాలకు కళ్లెం!
విజయనగరం పూల్‌బాగ్ : జిల్లాలో ఇటీవలి కాలంలో ఆన్లైన్ మార్కెటింగ్ విస్తృతమైంది. దుకాణాలకెళ్లి వెదకడం ఇష్టలేక కొందరు... ఆన్లైన్లో అందంగా చూపించే బొమ్మలకు ఆకర్షితులైన కొందరు ఎక్కువగా ఆన్లైన్లోనే డబ్బు చెల్లించి ఆర్డర్లు ఇవ్వడం ఎక్కువైంది. ఇదే అదనుగా కొన్ని ఆన్లైన్ కంపెనీలు వినియోగదారులను మోసగిస్తున్నాయి. వారు ఆర్డర్ ఇచ్చిన సరకు స్థానంలో వేరే ఏవో వస్తువులను పంపించి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటివాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం జీవో నెం.629ను విడుదల చేసింది. ఆన్లైన్లో జరిగే మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం ఈ బాధ్యతలను తూనికలు, కొలతలశాఖకు అప్పగించింది. ఈ-మార్కెట్‌పై నిఘా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తున్న నేపథ్యంలో ఈ-మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ఈ పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని తూనికల కొలతలశాఖకు అప్పగించింది. ఆన్లైన్లో వస్తువులను విక్రయించే సంస్థలు ఇప్పటి వరకు గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ) మాత్రమే ముద్రిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి తయారీ తేదీ, వినియోగదారుడికి అందజేసే గడువు, బరువు, పరిమాణం తదితర వివరాలతో పాటు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వినియోగదారులు సంప్రదించాల్సి చిరునామా, కస్టమర్ కేర్ ఫోన్ నంబర్‌ను స్పష్టంగా ముద్రించాలని, సంబంధిత ఉత్పత్తుల పూర్తి సమాచారం, కొలుగోలుదారులు సులభంగా చదువుకునేలా పెద్ద అక్షరాలతో ముద్రించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొనడంతో ఈ దిశగా మార్పులు ప్రారంభమయ్యాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 70 నుంచి 80 శాతంమంది సెల్ఫోన్లను వినియోగిస్తున్నారు. వీరిలో 40శాతం మందికి పైగా 4జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. ఫ్యాషన్‌కు అనుగుణంగా చొక్కాలు మొదలుకుని సెల్ఫోన్లు, కొత్తకొత్త మోడళ్లకోసం నిత్యం సెర్చ్ చేస్తున్నారు. ఇదే అదనుగా పుట్టగొడుగుల్లా కొత్త వ్యాపార సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి సెక్యూరిటీ లేని వాట్సాఫ్, ఫేస్బుక్, గూగుల్ వంటి మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాయి. వాటికి ఆకర్షితులై ఆన్లైన్లో వస్తువులు బుక్‌చేస్తే వారే బుక్‌అయిపోతున్నారు.∙ -
పెళ్లా..మజాకా...!
-
వివాహ వేడుకల్లో వృధా అవుతున్న డబ్బు
-
పాకిస్తాన్ లో 80 శాతం పోలియో కేసులు
ఇస్లామాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న పోలియోకేసుల్లో దాదాపు అధికశాతం కేసులు పాకిస్థాన్ లోనే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) పేర్కొంది. పాకిస్తాన్ లో 80శాతం పోలియో కేసులు నమోదు అవుతున్నాయని తాజాగా స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో వ్యాధి నిరోధక టీకా మందు పిల్లలకు సక్రమంగా అందుబాటులో లేకపోవడం, ఉత్తర, దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో వ్యాధి నిరోధక కార్యక్రమాలపై మిలిటెంట్ల నిషేధం కొనసాగడం, క్షేత్రస్థాయిలో పోలియో చుక్కల మందు వేసే పోలియో నిరోధక కార్యకర్తలను హతమార్చడం వంటి కారణాలవల్ల పోలియో నిరోధక కార్యక్రమం సరిగా అమలు కావడం లేదని తెలిపింది. వ్యాధి నిరోధక కార్యక్రమం పిల్లలకు అందుబాటులో ఉంచడం, వ్యాధినిరోధక కార్యక్రమంలో విధులు నిర్వహించే వారి భద్రత తదితర అంశాలను పరిష్కరించినపుడే పోలియో నిర్మూలన సంపూర్ణమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో సూచించింది.