Curfew lifted
-
కోవిడ్ కేసులు తగ్గుముఖం.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Delhi Covid Case Updates: దేశ రాజధానిలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆదేశించిన వారాంతపు కర్ఫ్యూలను ఎత్తివేయాలని ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సిఫార్సు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆమోదం కోసం ఈ ప్రతిపాదనను ఆయన కార్యాలయానికి పంపింది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులకు ఆఫీస్‌లకు వెళ్లి 50 శాతం సామర్య్ధంతో పనిచేసేలా అనుమతి ఇవ్వాలని ప్రతిపాదనలో పేర్కొంది. అంతేగాక షాపులు తెరవడానికి ఇప్పటివరకు అమలులో ఉన్న సరి, భేసి సంఖ్య విధానం రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో కేవలం అత్యవసర సేవల్లో పనిచేసే వారు, ఏదైనా అత్యవసరం అయిన వారు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఉండేది. కిరాణా, మందుల వంటి నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలు మినహా అన్ని దుకాణాలు మూసివేశారు. చదవండి: ఉగ్రరూపం దాల్చిన కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు.. కొత్తగా ఎన్నంటే! కాగా ఢిల్లీలో గురువారం 12,306 కొత్త కేసులు నమోదయ్యాయి. 43 మంది మరణించారు. అయితే ముందు రోజుతో పోలిస్తే 10.72 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి.గ్గుదల. అయితే, 43 మరణాలు ధృవీకరించబడ్డాయి - గత సంవత్సరం జూన్ నుండి అత్యధికంగా 44 మంది మరణించారు. ఇదిలా ఉండగా జనవరి 14న దాదాపు 30,000 గరిష్ట స్థాయి కేసులు వెలుగు చూడగా.. నిన్న 13,000 కంటే తక్కువగా నమోదయ్యాయి. ఢిల్లీలో ప్రస్తుతం 70,000 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. -
సడలింపులు: థియేటర్లు, పబ్బులకు అనుమతి లేదు!
బెంగళూరు: కర్ణాటకపై పంజా విసిరిన కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్న తరుణంలో ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించింది. వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శనివారం వెల్లడించింది. అన్‌లాక్ ప్రక్రియ మూడో దశలో భాగంగా జూలై 5 నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి తిరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా... తాజా నిబంధనల ప్రకారం.. జిల్లా యంత్రాంగాలు ఆయా చోట్ల ఉన్న కరోనా పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని సడలింపులు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. సడలింపులు.. నిబంధనలు ఇలా! 1. థియేటర్లు, సినిమా హాళ్లు, పబ్బులు తెరిచేందుకు అనుమతి లేదు. 2. క్రీడా శిక్షణకై ఉద్దేశించిన స్విమ్మింగ్‌పూల్స్ మాత్రమే ఓపెన్ చేయాలి. 3. ప్రాక్టీసు కోసం మాత్రమే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్టేడియాలు తెరవాలి. 4. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన, ఇతరత్రా వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం పూర్తిగా నిషిద్ధం. 5. వివాహాది శుభకార్యాలకు కేవలం 100 మంది అతిథులకు మాత్రమే అనుమతి. 6. అంత్యక్రియలకు అత్యధికంగా 20 మందికి అనుమతి. 7. మందిరాలు, ప్రార్థనా స్థలాల దర్శనానికి మాత్రమే అనుమతి. సేవల్లో పాల్గొనరాదు. 8. సామర్థ్యం ఉన్నంత మేర ప్రజా రవాణా సక్రమంగా నిర్వహించుకోవచ్చు. 9. షాపులు, రెస్టారెంట్లు, మాల్స్, ప్రైవేటు ఆఫీసుల్లో కరోనా నిబంధనలు పాటించనట్లయితే విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కఠిన చర్యలు. 10. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అన్ని విద్యాసంస్థలు మూసివేత. 11. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ప్యూ కొనసాగుతుంది. -
కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేత
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో అన్ని ప్రాంతాల్లో ఆదివారం కర్ఫ్యూ ఎత్తివేశారు. కాగా ప్రజలు గుమికూడకుండా ఆంక్షలు విధించారు. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్ లోయలో భద్రత బలగాలు పహారా కాస్తున్నాయి. కశ్మీర్‌లోయలో అల్లర్లు తగ్గుముఖం పట్టడం, పరిస్థితి అదుపులోకి రావడంతో కర్ఫ్యూ తొలగించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఆదివారం కశ్మీర్‌లోయలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. కాగా వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునివ్వడంతో వాణిజ్య సముదాయాలను తెరవలేదు. నిత్యవసర వస్తువుల మార్కెట్లను ఈ రోజు మధ్యాహ్నం నుంచి తెరుస్తారని భావిస్తున్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. 79 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లలో 82 మంది మరణించారు. -
52 రోజుల అనంతరం కర్ఫ్యూ ఎత్తివేత..
శ్రీనగర్ః సుదీర్ఘ కాలం తర్వాత కశ్మీర్ లో వాతావరణం కాస్త చల్ల బడింది. హిజ్బుల్ టెర్రరిస్ట్ బుర్హాన్ వాని మృతి అనంతరం మొదలైన ఆందోళనలతో కల్లోలంగా మారిన కశ్మీర్ లో.. 52 రోజుల తర్వాత కర్ఫ్యూ ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ మాత్రం కొనసాగనుంది. బుర్హాన్ వని మృతి అనంతరం కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనల కారణంగా సుమారు 70 మంది మృతి చెందారు. 11,000 మంది వరకూ గాయాలపాలయ్యారు. కర్ఫ్యూతో లోయలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ఆదివారం మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కశ్మీరీలకు చేరువయ్యేందుకు ఐకమత్యం, ప్రేమలే ప్రధాన మంత్రాలని పేర్కొన్నారు. లోయలో జరుగుతున్న అల్లర్లలో అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, వారంతా మనవారన్న విషయాన్ని మరచిపోవద్దని ఆయన గుర్తు చేశారు. మధ్యవర్తులు, వేర్పాటువాదులతో చర్చించిన అనంతరం మూడు అంశాల ప్రణాళికపై జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ సైతం ప్రధాని సమావేశంలో చర్చించిన విషయం తెలిసిందే. లోయలో రక్తపాతాన్ని ఆపాలని అంతా కోరుకుంటున్నారని, అయితే మాటలకే పరిమితం కాకుండా... హత్యలు ఆపేందుకు, కశ్మీర్ వీధుల్లో శాంతి తిరిగి పొందేందుకు తాను హురియత్ సహాయంకోరినట్లు ముఫ్తీ తెలిపారు. మరోవైపు కశ్మీర్ సమస్యకు ఓ శాశ్వత పరిష్కారం తెచ్చేందుకు గతవారం రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సైతం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వేర్పాటువాదులతో సహా అందర్నీ భాగస్వాములు చేసి చర్చలు జరపాలని వారంతా ప్రధానికి విన్నవించారు.