బెంగళూరు: కర్ణాటకపై పంజా విసిరిన కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్న తరుణంలో ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు సడలించింది. వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శనివారం వెల్లడించింది. అన్‌లాక్ ప్రక్రియ మూడో దశలో భాగంగా జూలై 5 నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి తిరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా... తాజా నిబంధనల ప్రకారం.. జిల్లా యంత్రాంగాలు ఆయా చోట్ల ఉన్న కరోనా పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని సడలింపులు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
సడలింపులు.. నిబంధనలు ఇలా!
1. థియేటర్లు, సినిమా హాళ్లు, పబ్బులు తెరిచేందుకు అనుమతి లేదు.
2. క్రీడా శిక్షణకై ఉద్దేశించిన స్విమ్మింగ్‌పూల్స్ మాత్రమే ఓపెన్ చేయాలి.
3. ప్రాక్టీసు కోసం మాత్రమే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్టేడియాలు తెరవాలి.
4. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన, ఇతరత్రా వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం పూర్తిగా నిషిద్ధం.
5. వివాహాది శుభకార్యాలకు కేవలం 100 మంది అతిథులకు మాత్రమే అనుమతి.
6. అంత్యక్రియలకు అత్యధికంగా 20 మందికి అనుమతి.
7. మందిరాలు, ప్రార్థనా స్థలాల దర్శనానికి మాత్రమే అనుమతి. సేవల్లో పాల్గొనరాదు.
8. సామర్థ్యం ఉన్నంత మేర ప్రజా రవాణా సక్రమంగా నిర్వహించుకోవచ్చు.
9. షాపులు, రెస్టారెంట్లు, మాల్స్, ప్రైవేటు ఆఫీసుల్లో కరోనా నిబంధనలు పాటించనట్లయితే విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కఠిన చర్యలు.
10. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అన్ని విద్యాసంస్థలు మూసివేత.
11. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ప్యూ కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment