చింపేశారు...
...కట్ చేశారు... కట్ చేస్తూ స్లిట్స్ పెంచేశారు... స్టైల్లో ఓ అడుగు ముందుకేశారు... టోటల్‌గా ఫ్యాషన్‌ని చింపేశారు!
పొట్టి, పొడవాటి కుర్తాలు అటు క్యాజువల్‌గానూ, ఇటు అకేషనల్గానూ వయసు తేడా లేకుండా మగువలంతా ధరిస్తున్నారు. అనార్కలీ డ్రెస్సులను అందంగా అలంకరించుకుంటున్నారు. వీటిలో స్టైల్ అంటూ ఏమీ లేదు అనుకున్నారేమో! ఇప్పుడు సైడ్ స్లిట్ కట్స్‌తో ఓ స్టైల్‌ను క్రియేట్ చేస్తున్నారు.
కట్ చేస్తే...
షార్ట్, లాంగ్ కుర్తాలకు సైడ్ స్లిట్స్ మనకు తెలిసిందే. వీటినే ఇంకా నడుము పై దాకా కట్ చేస్తే.. ఇదే ఇప్పటి స్టైల్. ‘సన్నని నడుము, మంచి శరీరాకృతి గల వారికి ఈ కట్ సూపర్‌గా నప్పుతుంది’ అంటూ డిజైనర్లు చెబుతున్నారు.
అనార్కలీ సింగిల్ కట్...
అనార్కలీ అంబ్రెల్లా మాదిరి ఎంత అందంగా కుచ్చిళ్లతో ఉంటుందో మనకు తెలిసిందే. అన్ని రకాల సంప్రదాయ పద్ధతులకు సరిగ్గా నప్పే డ్రెస్‌గా అనార్కలీ ముందుంది. ఇప్పుడు దీన్ని సైడ్ ఫ్రంట్ సింగిల్ కట్‌తో వెడ్డింగ్ డ్రెస్‌గా రూపొందిస్తున్నారు.
ఈ కట్స్ కుర్తాను ఎంచుకునే ముందు...
షిఫాన్, జార్జెట్, క్రేప్, నెటెడ్, సిల్క్ మాత్రమే కాకుండా మంచి ఫాల్ ఉన్న బెనారస్, కాటన్ ... మెటీరియల్స్ కూడా వీటికి బాగా నప్పుతాయి. మల్ మల్ లేదా కాటన్ అయితే చాలా తక్కువ థ్రెడ్ వర్క్స్ ఉన్నవి ఎంచుకుంటే మేలు. కుట్టడానికి మెటీరియల్ ఇచ్చినప్పుడు మీ శరీరాకృతికి తగిన విధంగా మంచి కటింగ్‌తో కుర్తీ ఉండాలి. రెడీమేడ్ డ్రెస్ కొనుగోలు చేసేటప్పుడు మీ శరీరాకృతికి ఒక అంగుళం సైజ్ పెద్దది తీసుకుంటే చాలు అది లావుగా ఉన్నవారికి ఈ తరహా కుర్తాలు అంతగా నప్పువు. వీటి వల్ల చూడటానికి ఇంకా లావుగానూ కనిపిస్తారు. భారీ ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ ఎక్కువ ఉన్న వాటిని ఈ తరహా టాప్స్‌కి ఎంచుకోవద్దు. గంజి దట్టంగా ఉండే కాటన్, చందేరి మెటీరియల్స్ చూడటానికి గాడీగా కనిపిస్తాయి. అలాగే పెద్ద పెద్ద అంచులు, గోటా వర్క్, హెవీ ఎంబ్రాయిడరీల జోలికి వెళ్లకూడదు. సింపుల్‌గా, లైట్‌గా చూడటానికి కంటికి నప్పే విధంగా ఉండాలి. తక్కువ ఎంబ్రాయిడరీ, స్వరోస్కి-జరీ మెరుపులు చాలా తక్కువగా, చిన్న చిన్న అంచులు ఉన్న టాప్స్ చాలా బాగుంటాయి.
- ఎన్.ఆర్