Cuttack oneday
-
బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా
కటక్: ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్ బ్యాటింగ్ చేస్తున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కటక్ బారాబతి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో ఒక్కో మార్పు చేశారు. టీమిండియాలో పేసర్ ఉమేష్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ ఆడుతున్నాడు. ఇంగ్లండ్ జట్టులో రషీద్ స్థానంలో ప్లంకెట్ వచ్చాడు. -
ఉమేష్ అవుట్, భువి ఇన్
-
ఉమేష్ అవుట్, భువి ఇన్
కటక్: టీమిండియాతో కీలక రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్ కటక్ బారాబతి స్టేడియంలో జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా సిరీస్‌లో 1-0తో ముందున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. టీమిండియాలో కేవలం ఓ మార్పు చేశారు. పేసర్ ఉమేష్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ జట్టులో కూడా ఒకే మార్పు జరిగింది. రషీద్ స్థానంలో ప్లంకెట్ జట్టులోకి వచ్చాడు. జట్లు: భారత్: రాహుల్, ధవన్, కోహ్లీ (కెప్టెన్), యువరాజ్, ధోనీ (కీపర్), జాదవ్, పాండ్య, జడేజా, అశ్విన్, బుమ్రా, భువనేశ్వర్ ఇంగ్లండ్: రాయ్, హేల్స్, రూట్, మోర్గాన్ (కెప్టెన్), బట్లర్ (కీపర్), స్టోక్స్, అలీ, ప్లంకెట్, వోక్స్, విల్లీ, బాల్ -
ప్రతీకారంతో రగులుతున్న ఇంగ్లండ్..
కటక్: ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో వన్డేలో నెగ్గి వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని విరాట్ కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు తొలివన్డే (పుణే) ఓటమికి కటక్ వన్డేలో ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ టీమ్ భావిస్తోంది. ఏ విధంగా చూసినా కటక్ టీమిండియాకు కలిసొస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఇప్పటివరకూ భారత్ 15 వన్డేలు ఆడగా అందులో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, నాలుగింట్లో ఓటమి పాలైంది. అయితే ఇక్కడ జరిగిన గత 5 మ్యాచుల్లో ఓటమనేది లేకుండా టీమిండియా దూసుకుపోతుండటం.. ఇంగ్లండ్ ఆటగాళ్లను కలవరపెడుతుంది. ఇంగ్లండ్ గత 5 మ్యాచుల్లో మూడింటిని నెగ్గింది. రూమ్స్ అడ్జస్ట్ మెంట్ అవకపోవడంతో తొలి వన్డే పూర్తయినా పుణేలోనే ఉన్న ఇరుజట్ల ఆటగాళ్లు బుధవారం కటక్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కటక్‌లోని బరాబతి స్డేడియంలో గురువారం జరగనున్న రెండో వన్డేలో టాస్ కీలకం కానుంది. ఎందుకంటే ఇక్కడ ఛేజింగ్ చేసిన జట్లకే అనుకూల ఫలితాలు వస్తాయి. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. భారత్ సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఛేజింగ్ స్టార్ కోహ్లీ తొలి వన్డే తరహాలో రెండో వన్డేలోనూ మరోసారి విజృంభిస్తే సిరీస్ భారత్ వశమవుతుంది. ఇరు జట్లలోనూ చేజింగ్ బ్యాటింగ్‌లో 64.30 సగటుతో కోహ్లీ అందరికంటే ముందున్నాడు. ధోనీ తరహాలోనే కోహ్లీ ఈ స్డేడియంలో విజయాలను కొనసాగిస్తాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగైనా సరే ఈ వన్డేలో గెలిచి సిరీస్ 1-1తో సమయం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది.