ప్రతీకారంతో రగులుతున్న ఇంగ్లండ్.. | Cuttack stadium is good ground for Team India | Sakshi
Sakshi News home page

ప్రతీకారంతో రగులుతున్న ఇంగ్లండ్..

Published Wed, Jan 18 2017 8:07 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

ప్రతీకారంతో రగులుతున్న ఇంగ్లండ్..

ప్రతీకారంతో రగులుతున్న ఇంగ్లండ్..

కటక్: ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో వన్డేలో నెగ్గి వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని విరాట్ కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు తొలివన్డే (పుణే) ఓటమికి కటక్ వన్డేలో ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ టీమ్ భావిస్తోంది. ఏ విధంగా చూసినా కటక్ టీమిండియాకు కలిసొస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఇప్పటివరకూ భారత్ 15 వన్డేలు ఆడగా అందులో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, నాలుగింట్లో ఓటమి పాలైంది. అయితే ఇక్కడ జరిగిన గత 5 మ్యాచుల్లో ఓటమనేది లేకుండా టీమిండియా దూసుకుపోతుండటం.. ఇంగ్లండ్ ఆటగాళ్లను కలవరపెడుతుంది. ఇంగ్లండ్ గత 5 మ్యాచుల్లో మూడింటిని నెగ్గింది. రూమ్స్ అడ్జస్ట్ మెంట్ అవకపోవడంతో తొలి వన్డే పూర్తయినా పుణేలోనే ఉన్న ఇరుజట్ల ఆటగాళ్లు బుధవారం కటక్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

కటక్‌లోని బరాబతి స్డేడియంలో గురువారం జరగనున్న రెండో వన్డేలో టాస్ కీలకం కానుంది. ఎందుకంటే ఇక్కడ ఛేజింగ్ చేసిన జట్లకే అనుకూల ఫలితాలు వస్తాయి. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. భారత్ సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఛేజింగ్ స్టార్ కోహ్లీ తొలి వన్డే తరహాలో రెండో వన్డేలోనూ మరోసారి విజృంభిస్తే సిరీస్ భారత్ వశమవుతుంది. ఇరు జట్లలోనూ చేజింగ్ బ్యాటింగ్‌లో 64.30 సగటుతో కోహ్లీ అందరికంటే ముందున్నాడు. ధోనీ తరహాలోనే కోహ్లీ ఈ స్డేడియంలో విజయాలను కొనసాగిస్తాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగైనా సరే ఈ వన్డేలో గెలిచి సిరీస్ 1-1తో సమయం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement