Cylinder explosion
-
రంగారెడ్డి: కోకాపేటలో పేలిన సిలిండర్
-
భారీ పేలుడు; ఇరవై మంది మృతి!
ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో సుమారుగా 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 22 మంది తీవ్ర గాయాలపాలు కాగా 70 మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ధూలే జిల్లాలోని వాఘాది గ్రామంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం సిలిండర్ పేలింది. దీంతో ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో అక్కడున్న వారంతా హాహాకారాలు చేస్తూ బయటికి పరుగులు తీశారు. కాగా ప్రమాద సమయంలో అక్కడ సుమారు వంద మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం చెల్లాచెదురుగా పడి ఉన్న ఎనిమిది మృతదేహాలను వెలికితీశామని, మిగతా వాటి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తు సహాయక సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. -
గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి మృతి
సాక్షి, రాయచోటి టౌన్ : పట్టణంలో మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలి తానిగుండ పెద్ద గుర్రన్న (35) మృతి చెందాడు. ఈ సంఘటనతో చుట్టు పక్కల వారు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నాకటలోని బళ్లారికి చెందిన తానిగుండ పెద్ద గుర్రన్న పాత రాయచోటికి చెందిన సుజాతను 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. గుర్రన్నకు టీబీ జబ్బు ఉండటంతో ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో భార్య వైద్యం చేయిస్తోంది. సోమవారం వైద్యులను సంప్రదించగా జబ్బు నయం అయినట్లు చెప్పారు. ఈ క్రమంలో రెండు రోజులు పుట్టింటిలో ఉండి వెళ్లాలని అనుకొని ఇక్కడే ఆగిపోయారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అర్థరాత్రి దాటాక ఒక్క సారిగా గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలింది. మంటల్లో నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో భార్య భర్తలకు నిప్పు అంటుకుంది. గుర్రన్నకు మంటలు ఎక్కువగా కావడంతో తలుపులు తెరుచుకొని వీధిలోకి దూసుకొచ్చాడు. భయాందోళనతో మిద్దిపైకి వెళ్లి వెనుక వైపు కిందకు దూకాడు. దీనిని ఎవరూ గమనించలేదు. స్థానికులు తలుపులు బద్ధలుకొడి ఇంట్లో ఉన్న మహిళను కాపాడారు. గుర్రన్న కోసం వెతకగా బలమైన గాయాలతో కిందపడి ఉన్నాడు. 108కు ఫోన చేసినా సమయానికి రాకపోవడంతో బాధితులను ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుర్రన్న మృతి చెందాడు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పానీపూరి బండిలో సిలిండర్ పేలుడు
సాక్షి, కడ్తాల్(కల్వకుర్తి): పానీపూరి బండిలో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ఫ గాయాలయ్యాయి. ఈ ఘటన కడ్తాల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలం–హైద్రాబాద్ జాతీయ రహదారిపై మండల కేంద్రంలోని బస్‌స్టాప్ పక్కన, మార్వాడీ కమలేష్ అనే వ్యక్తి కొంత కాలంగా పానీపూరి తోపుడుబండిని ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాడు. మంగళవారం సాయంత్రం పానిపూరిలు తయారు చేస్తుండగా, ఒక్కసారిగా సిలిండర్ పైపు నుంచి గ్యాస్ లీకై క్షణాల్లో ఆ బండి మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన సమీపంలోని చిరువ్యాపారులు పరుగులు పెట్టారు. గమనించిన స్థానికులు కొంత మంది సమీపంలోని పాలశీతలీకరణ కేంద్రం నుంచి నీళ్లు తీసుకువచ్చి వేంటనే మంటలపై నీళ్లు చల్లుతూ, బండి క్రింద ఉన్న సిలిండర్‌ను తొలగించారు. ఈ సంఘటనలో పానీపూరి బండి యాజమాని కమలేష్‌తో పాటు, అతని కుమారుడికి స్వల్ఫంగా గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు, సమీపంలోని చిరువ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఐఐఎస్సీలో పేలుడు: శాస్త్రవేత్త మృతి
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) ప్రయోగశాలలో బుధవారం శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 32 ఏళ్ల యువ శాస్త్రవేత్త మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏరోస్పేస్ విభాగానికి చెందిన హైపర్సోనిక్ షాక్ వేవ్ ప్రయోగశాలలో మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఒక హైడ్రోజన్ సిలిండర్ పేలిపోయింది. ఐఐఎస్సీతో ఒప్పందం చేసుకున్న సూపర్‌వేవ్ టెక్నాలజీస్ అనే స్టార్టప్‌కు చెందిన నలుగురు శాస్త్రవేత్తలు ఆ సమయంలో ప్రయోగాలు చేస్తున్నారు. పేలుడు ధాటికి మైసూరుకు చెందిన ఏరోస్పేస్ శాస్త్రవేత్త మనోజ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో సిలిండర్‌కు సమీపంలో ఉన్న మనోజ్ కుమార్ శరీరం పూర్తిగా కాలిపోయింది. గాయపడిన మిగిలిన ముగ్గురు శాస్త్రవేత్తలు కార్తీక్, అతుల్య, నరేశ్ కుమార్‌లను హుటాహుటిన స్థానిక ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం తెలియరాకున్నా భారీ స్థాయిలో హైడ్రోజన్ వాయువు విడుదల కావడం వల్లే పేలుడు జరిగి ఉండొచ్చని ఫోరెన్సిక్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై బెంగళూరులోని సదాశివనగర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ఐఐఎస్సీ చాన్నాళ్లుగా ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉంది. -
సిలిండర్ పేలి ఇద్దరు టెక్కీల మృతి
బనశంకరి : సిలిండర్ పేలిన ఘటనలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నదమ్ములు ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఇక్కడి కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరాస్వామిరెడ్డి లేఔట్లో నివాసం ఉంటున్న హరేంద్ర (34), నరేంద్ర (27) అన్నదమ్ములు. వీరు ఇద్దరు ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్కీలుగా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం వీరి ఇంటిలో సిలిండర్ పేలడంతో అన్నదమ్ములతో పాటు నరేంద్ర భార్య శిల్ప, వీరి కుమార్తె ఆర్య తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరేంద్ర, నరేంద్ర గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. నరేంద్ర భార్య శిల్పా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. చిన్నారి ఆర్యను ఢిల్లీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోరమండల్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి
-
కోరమండల్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి
కాకినాడ రూరల్ (తూర్పు గోదావరి) : కోరమండల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కోరమండల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఆదివారం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కూలీగా పని చేస్తున్న లోవరాజు(27) సిలిండర్లలో కెమికల్ మారుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అమోనియం గ్యాస్ సిలిండర్ పేలడంతో అక్కడికక్కడే మృతిచెందగా .. సమీపంలో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.