Cylinder gas business
-
తగ్గిన సిలిండర్ బరువు
రెంజల్(బోధన్) : ప్రభుత్వం అందిస్తోన్న గ్యాస్ ప క్కదారి పడుతోంది. ఇద్దరు కుటుంబీకులకు 3 నె లలు రావాల్సిన గ్యాస్ నెలన్నరకే సరిపోతోంది. ఇ దేమని అనుమానం వచ్చిన వినియోగదారులు మూడు నెలల కిందట గ్యాస్ సిలిండర్‌ను తూకం వేయించారు. అప్పుడు తెలిసింది గ్యాస్ తక్కువ వస్తుందని. ఇదేమని డీలర్‌ను ప్రశ్నిస్తే తప్పు దొ ర్లకుండా చూస్తానని వినియోగదారులకు మాటిచ్చారు అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. రెం జల్ మండలం వీరన్నగుట్టలో సోమవారం బోధన్‌లోని దీక్షిత్ హెచ్‌పీ గ్యాస్ వాహనం సిలిండర్లను తీసుకుని వచ్చింది అప్పటికే వాహనం కోసం ఎ దురు చూస్తున్న వినియోగదారులు ముగ్గురు సి లిండర్లు తీసుకుని సమీపంలోని కిరాణ షాపులోగ ల ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేయించారు. మూడు సిలిండర్లలో కిలో, కిలోన్నర, రెండు కిలో ల వరకు తక్కువ బరువు ఉన్నట్లు గుర్తించి వెంట నే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించా రు. గ్యాస్ సిటిండర్పై గ్యాస్ బరువు 14.2 కిలో లు, సిలిండర్ బరువు ఒక్కోదానిపై 15.9, 14.8, 16.2 కిలోల బరువున్నట్లు ప్రింట్ ఉంది. గ్యాస్ బరువు, సిలెండర్ బరువు కలిపితే 30 కిలోల వరకు రావాల్సి ఉండగా ఒక్కో సిలెండర్లో 27 నుంచి 29 కిలోల బరువు వచ్చింది. ప్రతీ సిలిండర్‌పై రెండు నుంచి మూడు కిలోల బరువు తక్కువగా ఉన్నట్లు స్థానికులు డీటీ ఆనంద్ సమక్షంలో తూకం వేసి నిరూపించారు. వెంటనే ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. జిల్లా అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేదిలేదని గ్రామస్తులు పట్టుబట్టారు. తనకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానని డీటీ భ రోసా ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. -
పౌరసరఫరా శాఖాధికారుల దాడులు
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్ : జిల్లా పౌరసరఫరాల శాఖాధికారిణి జె. శాంతకుమారి నేతృత్వంలో అధికారులు స్టోన్‌హౌస్‌పేటలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల వ్యాపారం నిర్వహిస్తున్న దుకాణాలపై సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమ షాపులపై కూడా అధికారులు దాడులు నిర్వహిస్తారనే అనుమానంతో పలువురు వ్యాపారులు తలుపులు మూసివేసి పరారయ్యారు. స్థానిక పప్పుల వీధిలో రోజూ ఉదయం విపరీతమైన రద్దీగా ఉంటుంది. అటువంటిది అధికారుల దాడులతో గంట పాటు ఆ ప్రాంతం బోసిపోయింది. పప్పులవీధిలో సుమారు 40 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురాళ్ల వీధిలోని దుకాణాలపై దాడులు నిర్వహించారు. దీంతో అందరు తలుపులు ముసివేసి వెళ్లిపోయారు. చివరకు పంచనామ నిర్వహించి ఇళ్లను తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించడంతో ఒక్కొక్కరుగా వచ్చి తలుపులు తీశారు. ముందు గదిలో ఇతర వస్తువుల విక్రయం.. లోపలికి పోతే గ్యాస్ సిలిండర్ల వ్యాపారం చేస్తున్నారు. బాత్రూమ్లు, బెడ్రూమ్లు, మంచాల కింద సిలిండర్లను దాచి పెట్టారు. కింద సిలిండర్ల ఉంచి పైన గోతాలు వేసి దాచారు. అధికారులు విస్తృతంగా గాలించి అక్రమంగా ఉన్న 42 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 82 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 20 మందికి పైగా 6ఏ కేసులు నమోదు చేశారు. డీఎస్ఓ శాంతకుమారి మాట్లాడుతూ గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిలిండర్లను పూర్తిస్థాయిలో పరిశీలించి ఏ ఏజెన్సీల నుంచి వచ్చాయో పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏజీపీఓ లక్ష్మణబాబు, సీఎస్డీటీలు పుల్లయ్య, నిరంజన్, లాగరస్ పాల్గొన్నారు.