సిలిండర్లను తూకం వేస్తున్న వినియోగదారులు
రెంజల్(బోధన్) : ప్రభుత్వం అందిస్తోన్న గ్యాస్ ప క్కదారి పడుతోంది. ఇద్దరు కుటుంబీకులకు 3 నె లలు రావాల్సిన గ్యాస్ నెలన్నరకే సరిపోతోంది. ఇ దేమని అనుమానం వచ్చిన వినియోగదారులు మూడు నెలల కిందట గ్యాస్ సిలిండర్‌ను తూకం వేయించారు. అప్పుడు తెలిసింది గ్యాస్ తక్కువ వస్తుందని. ఇదేమని డీలర్‌ను ప్రశ్నిస్తే తప్పు దొ ర్లకుండా చూస్తానని వినియోగదారులకు మాటిచ్చారు
అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. రెం జల్ మండలం వీరన్నగుట్టలో సోమవారం బోధన్‌లోని దీక్షిత్ హెచ్‌పీ గ్యాస్ వాహనం సిలిండర్లను తీసుకుని వచ్చింది అప్పటికే వాహనం కోసం ఎ దురు చూస్తున్న వినియోగదారులు ముగ్గురు సి లిండర్లు తీసుకుని సమీపంలోని కిరాణ షాపులోగ ల ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేయించారు. మూడు సిలిండర్లలో కిలో, కిలోన్నర, రెండు కిలో ల వరకు తక్కువ బరువు ఉన్నట్లు గుర్తించి వెంట నే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించా రు.
గ్యాస్ సిటిండర్‌పై గ్యాస్ బరువు 14.2 కిలో లు, సిలిండర్ బరువు ఒక్కోదానిపై 15.9, 14.8, 16.2 కిలోల బరువున్నట్లు ప్రింట్ ఉంది. గ్యాస్ బరువు, సిలెండర్ బరువు కలిపితే 30 కిలోల వరకు రావాల్సి ఉండగా ఒక్కో సిలెండర్‌లో 27 నుంచి 29 కిలోల బరువు వచ్చింది. ప్రతీ సిలిండర్‌పై రెండు నుంచి మూడు కిలోల బరువు తక్కువగా ఉన్నట్లు స్థానికులు డీటీ ఆనంద్ సమక్షంలో తూకం వేసి నిరూపించారు.
వెంటనే ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. జిల్లా అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేదిలేదని గ్రామస్తులు పట్టుబట్టారు. తనకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానని డీటీ భ రోసా ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment