పేలుడు నుంచి తప్పించుకున్న లేడీ డైరెక్టర్
ముంబై: న్యూయార్క్ పేలుడు నుంచి బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్, ఆమె కొడుకు సీజర్ కుందర్ తృటిలో తప్పించుకున్నారు. న్యూయార్క్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సెంట్రల్ పార్క్ లో ఈ నెల 3న పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సెంట్రల్ పార్క్ లో బాణా సంచా/మరేదైనా పేలుడు పదార్థంపై ఓ యువకుడు కాలు పెట్టినప్పుడు పేలుడు జరిగిందని 'న్యూయార్క్ డైలీ న్యూస్' వెల్లడించింది. పేలుడు ధాటికి యువకుడి కాలు తెగిపోయింది. బాంబ్ స్వ్కాడ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది.
కాగా, పేలుడు జరిగినప్పుడు తాము ఐఎన్ సెంట్రల్ పార్క్ లోనే ఉన్నామని ఫరాఖాన్ ట్విటర్ ద్వారా తెలిపారు. తాము అక్కడ ఉండగానే పలుడు సంభవించడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము క్షేమంగా ఉన్నామని వెల్లడించారు.
Oh god can't believe v were IN Central Park whn the explosion happened!! pic.twitter.com/r04aJjo4eY
— Farah Khan (@TheFarahKhan) July 3, 2016