జేఎన్టీయూకేకు కొత్త సాఫ్ట్వేర్
మెయిన్‌రోడ్(కాకినాడ): జేఎన్‌టీయుకే వర్సిటీలో విద్యార్ధుల అవసరార్ధం ‘మినిమలిస్టిక్ అబ్జెక్ట్ ఓరియంటేడ్ లెనైక్స్ సాఫ్ట్వేర్’ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు జేఎన్‌టీయుకే అధికారులు సోమవారం వర్సిటీ సెన్ట్ హాల్లో సమావేశమై సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడీఏసీ) అండ్ ఐఐటీ చెన్నై వారితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఒప్పంద పత్రాలపై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.వి.ఆర్.ప్రసాదరాజు, చెన్నై ఐఐటీకి చెందిన సీఎస్ఈ ప్రొఫెసర్ డాక్టర్ డి.జానకిరామ్‌లు సంతకాలు చేసి మార్చుకున్నారు.
లెనెక్స్ సాఫ్ట్వేర్ సహాయంతో విద్యార్థులు ప్రాజెక్ట్స్‌ను చేపట్టడానికి, పరిశోధనలను కొత్తపుంతలతో ముందుకు తీసుకువెళ్ళడానికి, ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ ద్వారా ఇతర సాఫ్ట్వేర్ల రూపకల్పనకు కృషి చేయొచ్చని ప్రొఫెసర్ దాసు వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌కు లెసైన్స్ ఫీజు వసూలు చేయబోమని, విద్యార్థులు మధ్య ఓపెన్‌సోర్స్ సాఫ్ట్వేర్ ప్రోత్సహించవచ్చన్నారు. జేఎన్టీయూకే వెబ్సైట్లో దీన్ని పొందుపరుస్తామని, ఆసక్తిగల కళాశాలల మేనేజ్మెంట్ దీన్ని విద్యార్థులకు అందించవచ్చన్నారు.
కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ బి.ప్రభాకర్‌రావు, డీఏపీ డాక్టర్ పి.ఉదయభాస్కర్, డెరైక్టర్ సీఈ అండ్ ఓఆర్డీ డాక్టర్ వి.రామచంద్రరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె పద్మరాజు, ఆర్ అండ్ డీ కో-ఆర్డినేటర్, ఐఐటీ, చెన్నై డాక్టర్ మధుసూధనరావు, విభాగాధిపతులు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి డెరైక్టర్ డాక్టర్ జె.వి.ఆర్.మూర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు.