d k satyaprabha
-
అక్కడ పోటీకి నో చెప్పిన డీకే సత్యప్రభ!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ శుక్రవారం భేటీ అయ్యారు. రాజంపేట ఎంపీ స్థానంనుంచి సత్యప్రభను పోటీ చేయించే విషయంపై చంద్రబాబు ఆమెతో చర్చించారు. అయితే సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేస్తానని సత్యప్రభ వెల్లడించారు. ఆలోచించి రాత్రికి నిర్ణయం ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. కాగా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆమెపై అధిష్టానం గత కొద్దిరోజులుగా ఒత్తిడి తెస్తోంది. ఈ ఎన్నికల్లో కీలకమైన ఎంపీ నియోజకవర్గాల్లో పోటీకి పార్టీ నేతలు ఎవరూ సంసిద్ధత తెలపకపోవడం గమనార్హం. టీడీపీ బలహీనంగా ఉన్న రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఇంతకుముందు రాజంపేట నుంచి చిత్తూరు ఎంపీ డీకే సత్యప్రభ కుమారుడు డీకే శ్రీనివాసులును పోటీ చేయించాలని చంద్రబాబు భావించినా ఆయన సానుకూలత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దీంతో డీకే సత్యప్రభను అక్కడినుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. కానీ ఆమె కూడా రాజంపేట ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవటంతో వేరే అభ్యర్థిని వెతుక్కోవల్సిన పని పడింది. టీడీపీ ఓడిపోయే నియోజకవర్గంలో తామెందుకు పోటీ చేయాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. -
ఎమ్మెల్యేకు చెందిన రూ.300 కోట్ల ఆస్తుల స్వాధీనం?
-
టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన రూ.300 కోట్ల ఆస్తుల స్వాధీనం?
చిత్తూరు: చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు చెందిన కంపెనీలపై ఆదాయపు పన్ను అధికారులు దాడి చేసి దాదాపు రూ.300 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. బుధవారం బెంగళూరులో ఐటీ అధికారులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో బెంగళూరులోని వైదేహీ, మాల్యా ఆసుపత్రుల్లో దాడులు చేయగా దాదాపు రూ.265 కోట్ల ఆస్తులకు సరైన ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు వారు తెలిపారు. సెప్టెంబర్ 23 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆమె కంపెనీలు, ఇళ్లలో జరిగిన సోదాల్లో ఎమ్మేల్యేకు సంబంధించిన విద్యా సంస్థల నుంచి దాదాపు రూ.43 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు పేర్కొన్నారు. 13 సంవత్సరాల ఆదాయ ఖర్చుల వివరాలు తెలపాల్సిందిగా అధికారులు ఆమెను ఆదేశించారు.