Dabangg movie
-
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన దబాంగ్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే?
దబాంగ్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తొలి చిత్రంతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా గారాల పట్టిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దహాద్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. సోనాక్షికి ఇది తొలి వెబ్ సిరీస్. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఈ దబాంగ్ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త బీటౌన్‌లో వినిపిస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!) సోనాక్షి సిన్హా ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. బాంద్రా ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం సముద్ర పక్కనే ఉండడంతో సినీ ప్రముఖులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. సోనాక్షి అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయడానికి దాదాపు రూ. 11 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. బాంద్రాలోని ఆరియాట్ భవనంలో ఓ లగ్జరీ ఫ్లాట్ కోసం రూ.55 లక్షల విలువైన స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించింది. ఈ ఏడాది ఆగస్టులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్ సౌకర్యాలు అపార్ట్మెంట్లో నాలుగు కార్లకు పార్కింగ్ సౌకర్యం, లాబీతో పాటు ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ కూడా ఉంది. 2020లో కూడా రూ. 14 కోట్లకు బాంద్రాలో విలాసవంతమైన ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సోనాక్షి రాబోయే సినిమాలు సోనాక్షి చివరిసారిగా విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య కలిసి నటించిన వెబ్ సిరీస్ దహాద్లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్‌లో నటించనుంది. దీనికి ఆమె సోదరుడు కుష్ సిన్హా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో సోనాక్షి కూడా కీలక పాత్రలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
చిట్టి చుల్ బుల్ పాండే
సల్మాన్ ఖాన్ సినిమా కెరీర్‌కి బూస్ట్ ఇచ్చిన సినిమాల్లో ‘వాంటెడ్’ (తెలుగు ‘పోకిరి’ రీమేక్), ‘దబాంగ్’కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ‘దబాంగ్’లో చేసిన చుల్ బుల్ అనే అల్లరి పోలీస్ పాత్రను సల్మాన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అదే చుల్ బుల్ పాండే పాత్ర చిన్న పిల్లలకు మరింత చేరువ కాబోతోందట. ప్రస్తుతం ఈ పాత్రకు యానిమేషన్ రూపం ఇవ్వబోతున్నారు. చిన్న పిల్లలు ఆస్వాదించే విధంగా ఓ యానిమేషన్ సీరియల్ ప్రారంభించనున్నారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ మరియు కాస్మోస్ మాయ యానిమేషన్ స్టూడియో సంయుక్తంగా ఈ సీరియల్ ను నిర్మించనున్నాయి. 52 ఎపిసోడ్ల ఈ సీరియల్ వచ్చే ఏడాది వేసవికి ప్రసారం కానుంది. చుల్ బుల్ పాండేతో పాటు ఈ సినిమాలో ముఖ్య పాత్రలయిన రాజ్జో, మఖ్ఖి, చెడ్డీ సింగ్ వంటి పాత్రలు కుడా ఈ సీరియల్లో ఉంటాయి. అయితే ఈ పాత్రలకు సల్మాన్ ఖాన్ వాయిస్ ఓవర్ ఉండదని స్పష్టం చేశారు అర్బాజ్. -
దబాంగ్.. ధమాకా
-
చుల్‌బుల్‌పాండే రిటర్న్స్
చుల్‌బుల్‌పాండే.. విలన్లకే విలన్. సీరియస్‌గా కనిపించే సరదా పోలీస్. అందుకే బాలీవుడ్ సినిమాల్లో కనిపించిన పోలీసులకు ప్రత్యేకం చుల్బుల్. 2010లో ‘దబాంగ్’ సినిమాలో చుల్బుల్ పాండేగా కనిపించారు సల్మాన్ ఖాన్. ‘దబాంగ్’ చిత్రం బ్లాక్‌బస్టర్. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘దబాంగ్ 2’ కూడా హిట్టే. ఈ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో ఇన్స్టాల్మెంట్ ‘దబాంగ్ 3’ చిత్రం ఏప్రిల్ 1న ప్రారంభమైంది. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఇండోర్‌లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ‘‘నేను, అన్నయ్య (అర్బాజ్ ఖాన్) ఇండోర్లోనేపుట్టాం. ‘దబాంగ్ 3’ చిత్రాన్ని ఇక్కడే మొదలుపెట్టడం సంతోషంగా ఉంది’’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. మొదటి రెండు భాగాల్లో హీరోయిన్గా కనిపించిన సోనాక్షి సిన్హా ఇందులోనూ హీరోయిన్గా కనిపిస్తారు. -
'ఆ క్రెడిట్ అతడికే దక్కుతుంది'
ముంబై: తాను బాలీవుడ్ లో ఐదేళ్లు పూర్తి చేసుకోవడానికి సల్మాన్ ఖాన్ కారణమని నటి సోనాక్షి సిన్హా తెలిపింది. ఈ క్రెడిట్ అతడికే దక్కుతుందని పేర్కొంది. హిట్ సినిమాతో తన కెరీర్ కు బాటలు వేసినందుకు సల్మాన్ కు థ్యాంక్స్ చెప్పింది. దబాంగ్ సినిమా విడుదలయి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ట్విటర్ ద్వారా తన స్పందన వ్యక్తీకరించింది. సల్మాన్ ఖాన్ కారణంగానే నటిగా నిలదొక్కుకున్నానని, తనకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యావాదాలు తెలిపింది. దబాంగ్ చిత్రయూనిట్ కు థ్యాంక్స్ చెప్పింది. 28 ఏళ్ల సోనాక్షి నటి కాకముందు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. దబాంగ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఐదేళ్ల కెరీర్ లో 13 సినిమాల్లో నటించింది. ప్రస్తుతం 'ఫోర్స్ 2' సినిమాలో నటిస్తోంది. Dabangg to Force 2.. Owe it all to @BeingSalmanKhan and @arbaazSkhan! Thank u for showing me the way 😊 — Sonakshi Sinha (@sonakshisinha) September 10, 2015