'ఆ క్రెడిట్ అతడికే దక్కుతుంది'
ముంబై: తాను బాలీవుడ్ లో ఐదేళ్లు పూర్తి చేసుకోవడానికి సల్మాన్ ఖాన్ కారణమని నటి సోనాక్షి సిన్హా తెలిపింది. ఈ క్రెడిట్ అతడికే దక్కుతుందని పేర్కొంది. హిట్ సినిమాతో తన కెరీర్ కు బాటలు వేసినందుకు సల్మాన్ కు థ్యాంక్స్ చెప్పింది. దబాంగ్ సినిమా విడుదలయి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ట్విటర్ ద్వారా తన స్పందన వ్యక్తీకరించింది.
సల్మాన్ ఖాన్ కారణంగానే నటిగా నిలదొక్కుకున్నానని, తనకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యావాదాలు తెలిపింది. దబాంగ్ చిత్రయూనిట్ కు థ్యాంక్స్ చెప్పింది. 28 ఏళ్ల సోనాక్షి నటి కాకముందు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. దబాంగ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఐదేళ్ల కెరీర్ లో 13 సినిమాల్లో నటించింది. ప్రస్తుతం 'ఫోర్స్ 2' సినిమాలో నటిస్తోంది.
Dabangg to Force 2.. Owe it all to @BeingSalmanKhan and @arbaazSkhan! Thank u for showing me the way 😊
— Sonakshi Sinha (@sonakshisinha) September 10, 2015