చిట్టి చుల్‌ బుల్‌ పాండే | Animation‌ Series For Chulbul Pandey From Dabangg Movie | Sakshi
Sakshi News home page

చిట్టి చుల్‌ బుల్‌ పాండే

Published Wed, Jul 22 2020 3:19 AM | Last Updated on Wed, Jul 22 2020 3:19 AM

Animation‌ Series For Chulbul Pandey From Dabangg Movie - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ సినిమా కెరీర్‌కి బూస్ట్‌ ఇచ్చిన సినిమాల్లో ‘వాంటెడ్‌’ (తెలుగు ‘పోకిరి’ రీమేక్‌), ‘దబాంగ్‌’కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ‘దబాంగ్‌’లో చేసిన చుల్‌ బుల్‌ అనే అల్లరి పోలీస్‌ పాత్రను సల్మాన్‌ ఫ్యాన్స్‌  మాత్రమే కాదు అందరూ తెగ ఎంజాయ్‌ చేశారు. ఇప్పుడు అదే చుల్‌ బుల్‌ పాండే పాత్ర చిన్న పిల్లలకు మరింత చేరువ కాబోతోందట. ప్రస్తుతం ఈ పాత్రకు యానిమేషన్‌ రూపం ఇవ్వబోతున్నారు.  చిన్న పిల్లలు ఆస్వాదించే విధంగా ఓ యానిమేషన్‌ సీరియల్‌ ప్రారంభించనున్నారు. సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ మరియు కాస్మోస్‌ మాయ యానిమేషన్‌ స్టూడియో సంయుక్తంగా ఈ సీరియల్‌ ను నిర్మించనున్నాయి. 52 ఎపిసోడ్ల ఈ సీరియల్‌ వచ్చే ఏడాది వేసవికి ప్రసారం కానుంది. చుల్‌ బుల్‌ పాండేతో పాటు ఈ సినిమాలో ముఖ్య పాత్రలయిన రాజ్జో, మఖ్ఖి, చెడ్డీ సింగ్‌ వంటి పాత్రలు కుడా ఈ సీరియల్లో ఉంటాయి. అయితే ఈ పాత్రలకు సల్మాన్‌ ఖాన్‌ వాయిస్‌ ఓవర్‌ ఉండదని స్పష్టం చేశారు అర్బాజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement