dadar express
-
దాదర్ ఎక్స్ప్రెస్లో పొగలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ముంబై నుంచి చెన్నై వెళ్లున్న దాదర్ ఎక్స్ప్రెస్లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కడప స్టేషన్కు రైలు చేరుకున్న సమయంలో ఎస్2 బోగీలో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో భయభ్రాంతులకు లోనైన ప్రయాణికులు రైలు నుంచి దిగిపోయారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. సదరు బోగీలోని వీల్ వద్ద సాంకేతిక లోపం కారణంగా పొగలు వచ్చినట్లు గుర్తించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత మరమత్తుల అనంతరం రైలు చెన్నైకి బయల్దేరింది. దీంతో పెను ప్రమాదం తప్పిందంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
దాదర్ ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు
వైఎస్సార్ కడప: రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు పాయింట్ బ్లాక్ వద్ద రైల్వే పట్టా బోల్ట్ ఊడి ఉండటాన్ని గుర్తించిన గేట్మెన్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందిచారు. దీంతో ముంబాయి నుంచి చెన్నై వెళ్తున్న దాదర్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. -
దాదర్ ఎక్స్ప్రెస్లో చోరీ
కడప: రైళ్లలో వరుస దొంగతనాలు ఆగటం లేదు. తాజాగా శనివారం దాదర్ ఎక్స్ ప్రెస్ లో చోరీ జరిగింది. పూణే నుంచి తిరుపతి వెళ్లే దాదర్ ఎక్స్ప్రెస్లో దుండగులు చొరబడి ప్రయాణికుల నగలు అపహరించుకుపోయారు. వైఎస్సార్ జిల్లా కర్ణాటక రాష్ర్ర్ట సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున ప్రయాణికులు నిద్రిస్తుండగా బ్యాగులను ఎత్తుకుపోయారని, అందులో 20 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్నాయని ఇద్దరు బాధితులు కడప రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.