
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ముంబై నుంచి చెన్నై వెళ్లున్న దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కడప స్టేషన్‌కు రైలు చేరుకున్న సమయంలో ఎస్2 బోగీలో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో భయభ్రాంతులకు లోనైన ప్రయాణికులు రైలు నుంచి దిగిపోయారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. సదరు బోగీలోని వీల్ వద్ద సాంకేతిక లోపం కారణంగా పొగలు వచ్చినట్లు గుర్తించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత మరమత్తుల అనంతరం రైలు చెన్నైకి బయల్దేరింది. దీంతో పెను ప్రమాదం తప్పిందంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment