dadisetty raja
-
బెదిరించారు.. బరితెగించారు
అసలు బలమే లేని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, కాకినాడ జిల్లా తుని, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవుల కోసం టీడీపీ అధికార బలంతో బరితెగించింది. సంఖ్యా బలం లేకపోయినా వాటిని బలవంతంగా తమ ఖాతాలో వేసుకునేందుకు కుయుక్తులు పన్నింది.పిడుగురాళ్ల మున్సి పాల్టీ లో టీడీపీ తరఫున ఒక్క కౌన్సిలర్ కూడా గెలవకపోయినా సోమవారం జరిగిన ఎన్నికలో వైస్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుందంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసైగ మేరకు పోలీసులు, రెవిన్యూ అధికారులు వేధించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు బలవంతంగా పచ్చ కండువా కప్పి.. మాదే మెజార్టీ అని నిస్సిగ్గుగా ప్రకటించడం విస్తుగొలుపుతోంది. తుని, పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులను కూడా అదే రీతిలో సొంతం చేసుకునేందుకు ప్రయత్నిం చినా వైఎస్సార్సీపీ అడ్డుకోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.సాక్షి, నరసరావుపేట/తుని/పాలకొండ: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి అరాచకం çసృష్టించారు. పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని మరచి ఎమ్మెల్యే ఆదేశాలతో కౌన్సిలర్లను భయాందోళనకు గురిచేసి టీడీపీ గూటికి వెళ్లేలా తమవంతు సాయం చేశారు. వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీ చేయడానికి టీడీపీ తరఫున కనీసం ఒక్క కౌన్సిలర్ సైతం లేకపోయినా పోటీలో నిలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువా కప్పి తెలుగుదేశంలో చేర్చుకున్నట్లు ప్రకటించి.. యరపతినేని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 స్థానాలకు 33 స్థానాలు వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైస్ చైర్మన్‌గా ముక్కంటి అనే వ్యక్తిని ఎన్నుకోగా ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్‌ని ఎంపిక చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా వైఎస్సార్సీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుపడటంతో మరుసటి రోజు.. అంటే ఈ నెల 4వ తేదీకి ఎన్నికను వాయిదా పడింది. అయితే రాత్రికి రాత్రే యరపతినేని ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పాత కేసులు పేరిట వేధించి ఎన్నికకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ ఈ నెల 17న సోమవారం మరోసారి వైస్ చైర్మన్ ఎన్నికలకు అవకాశం కల్పించింది. నాలుగో తేదీ నుంచి 17 వ తేదీ వరకు సుమారు రెండు వారాలు సమయం ఉండటంతో టీడీపీ నేతలు.. పోలీసు, రెవెన్యూ అధికారులను ఉపయోగించి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను వేధించడం మొదలుపెట్టారు. తునిలోనూ టీడీపీ బల ప్రయోగం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మూడోసారి టీడీపీ అడ్డుకోవడంతో వాయిదా పడింది. టీడీపీ లొంగదీసుకున్న కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతించి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 30 మందీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. మిగిలిన 28 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. టీడీపీ ముందస్తు వ్యూహంలో భాగంగా కౌన్సిల్ హాల్లోకి చొరబడి ఎన్నికను అడ్డుకుంది.మరుసటి రోజూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక జరగాల్సి ఉన్నా, టీడీపీ దౌర్జన్యం వల్ల మళ్లీ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్వో రవికుమార్ తెలిపారు. కాగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం చైర్పర్సన్ సుధారాణి నివాసం వద్ద నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకులు యత్నిం చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు.దీంతో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావులు రాజాపై దాడికి దిగారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడ నుంచి బయటకు పంపించి వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పంపించేస్తే ఓటింగ్‌కు వస్తామని కౌన్సిలర్లు చెప్పారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లక పోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. టీడీపీకి సొంతంగా ఒక్క సీటు లేకపోయినా అధికార మదంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకోవాలని చూస్తోందని, సంతలో పశువుల్లా కొనాలనుకుంటోందని మండిపడ్డారు. అయినా మెజార్టీ లేకపోవడంతో పోలీసులను వినియోగించారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి భర్త, కో ఆప్షన్ సభ్యుడు ఏలూరి బాలును హౌస్ అరెస్ట్ చేశారని, మరికొందరి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి భయాందోళనలు సృష్టించారన్నారు.మహిళా కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ గూండాలు, రౌడీ షీటర్లకు సహకరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం చలో తుని కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు.బెదిరింపుల పర్వం... వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్లకు పోలీసులను పంపించి స్టేషన్‌కు రావాలని పిలిపించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరింపులకు దిగారు. మరికొంతమందికి కాంట్రాక్టులు, బిల్లుల పేరుతో తాయిలాలు ఆశచూపే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు రోజూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి కచ్చితంగా మీరు పార్టీ మారాల్సిందేనని ఒత్తిడి చేశారు. యరపతినేని శ్రీనివాసరావు నిర్ణయించిన వైస్ చైర్మన్ అభ్యర్థికే మీరు ఓటు వేయాలంటూ బెదిరించారు. తెలుగుదేశం రౌడీల బెదిరింపులతో కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దీంతో పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల బంధువులను బెదిరించి భయపెట్టి వాళ్ల శిబిరంలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. ఇలా సుమారు 17 మందిని టీడీపీ వైపు లాగేశారు. వారితో వైస్ చైర్మన్ పదవిని దౌర్జన్యంగా లాగేసుకున్నారు. 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు వ్యాపారాలను అడ్డుకుంటామని బెదిరించి పార్టీ మారేలా చేశారని పట్టణంలోని ఆర్య వైశ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిడుగురాళ్ల 29వ వార్డు కౌన్సిలర్ మునీరా దంపతులు తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు లొంగక పోవడంతో నిర్మాణంలో ఉన్న వాళ్ల ఇళ్లను పొక్లెయినర్‌తో నేలమట్టం చేశారు. ఇలా బెదిరించి బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.పాలకొండలోనూ అదే తీరు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ కుర్చీ కోసం కూటమి నాయకులు వేస్తున్న ఎత్తులు పారడం లేదు. ముచ్చటగా మూడోసారి సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో పదవి దక్కించుకోవాలని కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డితో పాటు జేసీ శోభిక ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. కూటమికి చెందిన ముగ్గురు సభ్యులు, బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరంలేక ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.కాగా, పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 17 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 19వ వార్డు కౌన్సిలర్ ఉద్యోగ రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు కౌన్సిలర్లను టీడీపీ నేతలు బలవంతంగా వారి వైపు తిప్పుకున్నారు. ఈ లెక్కన టీడీపీ బలం ఐదుకు చేరిందనుకున్నా, వైఎస్సార్సీపీ బలం 14గా ఉంది. ఎలాగైనా సరే గెలవాలని మంత్రి సంధ్యారాణి ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచి్చనప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం
-
తనకు తాను గొప్పవాడిగా పోల్చుకోవడం పవన్ నైజం: దాడిశెట్టి రాజా
-
రహదారులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రహదారులపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, ఆర్ అండ్ బి మంత్రి దాడిశెట్టి రాజా, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో రోడ్లన్నింటినీ బాగు చేయడానికి ప్రభుత్వం చాలా ప్రణాళికబద్ధంగా పనిచేస్తోంది. ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ముందుకుసాగుతోంది. దీనికోసం ప్రభుత్వం, అధికారులు చాలా కష్టపడుతున్నారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా మనపై విమర్శలు చేస్తున్నారు, వక్రీకరణలు చేస్తున్నారు. వీటిని చాలెంజ్‌గా తీసుకుని ఎక్కడా గుంతల్లేని విధంగా రోడ్లను తయారు చేయాలి. ఏడాదిలోగా రోడ్ల విషయంలో గణనీయ ప్రగతి కనిపించాలి. ఆర్ అండ్ బీ రోడ్లను బాగుచేయడం కోసం దాదాపుగా రూ. 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పీఆర్ రోడ్ల కోసం సుమారు రూ.1072.92 కోట్లు ఖర్చుచేస్తున్నాం. రోడ్ల విషయంలో వక్రీకరించడానికి ప్రతిపక్షాలు, వాటికి సంబంధించిన మీడియా అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతీ జిల్లాలో గతంలో ఎంత ఖర్చు చేశారు? ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాం ? అన్నదానిపై వివరాలను ప్రజల ముందు ఉంచండి. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లు.. ఇలా అన్ని విషయాల్లో గతంలో ఎంత? ఇప్పుడు ఎంత ఖర్చు చేశామో ప్రజలకు వివరాలు అందించండి. గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగుచేసిన తర్వాత ఎలా ఉన్నాయి.. నాడు – నేడు పేరుతో ఫొటోగ్యాలరీ ఏర్పాటు చేయండి. బ్రిడ్జిలు పూర్తై అప్రోచ్ రోడ్లు లేనివి, పెండింగ్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు.. ఇవన్నీ కూడా పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. యుద్ధ ప్రాతిపదికిన దీని మీద దృష్టిపెట్టాలి. వచ్చే ఏడాదిలోగా ఇవి పూర్తికావాలి. రోడ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమైనది, నాణ్యత కచ్చితంగా పాటించాల్సిందే. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రోడ్లు వేయాలి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న బ్రిడ్జిలు, కల్వర్టుల శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని స్పష్టం చేశారు. ఏపీలో రోడ్ల సంబంధిత అభివృద్ధిపై వివరించిన అధికారులు.. 1. 7,804 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రోడ్లుకు మరమ్మతులు. దీనికోసం దాదాపుగా రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. 1,168 పనుల్లో రూ. 947 కోట్ల విలువైన 522 పనులు ఇప్పటికే పూర్తి. సుమారు రూ.900 కోట్ల బిల్లులు చెల్లింపు. వర్షాకాలంలోగా పూర్తిచేయడానికి యుద్ధప్రాతిపదికన పనులు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు. 2. నిడా –1 కింద 233 రోడ్లు, బ్రిడ్జిల పనులు. దీని కోసం రూ.2,479 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే రూ.2వేల కోట్లు ఖర్చు. ఆగస్టు నాటికి ఫేజ్–1 పనులు పూర్తిచేసేలా అడుగులు. నిడా–2 కింద 33 ఆర్వోబీ పనులు. దీని కోసం దాదాపు రూ.816.51 కోట్లు ఖర్చు చేయడానికి ప్రణాళిక సిద్ధం. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం. 3. కొత్తగా 38 ఆర్వోబీల పూర్తికి రూ. 2,661 కోట్లు ఖర్చుచేస్తున్న ప్రభుత్వం. 4. నివర్ తుఫాను కారణంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో దెబ్బతిన్న బ్రిడ్జిలు తదితర నిర్మాణాల కోసం దాదాపు రూ.915 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. దీని కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. 5. ఎన్డీబీలో ఫేజ్–1 కింద 1,244 కి.మీ.ల కోసం రూ. 3,014 కోట్లు ఖర్చు. ఫేజ్ –1 కింద పనులు మే నెలాఖరు నాటికి ప్రారంభించనున్న ప్రభుత్వం. – ఎన్డీబీలో ఫేజ్–2 కింద 1,268 కి.మీ. కోసం రూ.3,386 కోట్లు ఖర్చు. డిసెంబరులో ఫేజ్–2 పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం. మొత్తంగా ఎన్డీబీ రోడ్ల కోసం రూ.6,400 కోట్లు ఖర్చు. దీనికోసం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చే రోడ్లను 2 లేన్లుగా విస్తరిస్తున్న ప్రభుత్వం. 6. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా 99 పనులు. రాష్ట్రంలో ఉన్న అన్ని నేషనల్‌హైవేలను కనీసంగా 10 మీ. వెడల్పుతో అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం. మొత్తంగా 3079.94 కి.మీ. మేర విస్తరణకోసం రూ.రూ.30వేల కోట్లు ఖర్చు. ఇప్పటికే రూ.2041 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం. 7. రాష్ట్రాల అనుసంధానం కోసం మరో 6 ప్రాజెక్టులు. 2,157 కి.మీ నిడివి ఉన్న రోడ్ల ప్రాజెక్టుల కోసం రూ. 15,875 కోట్లు ఖర్చు. ఈ పనుల్లో భాగంగా బెంగుళూరు–చెన్నై, చిత్తూరు–చెన్నై, రాయ్‌పూర్–విశాఖపట్నం, షోలాపూర్ –కర్నూల్, హైదరాబాద్ –విశాఖపట్నం, నాగ్‌పూర్–విజయవాడ రహదారుల అభివృద్ధి. 8. రాష్ట్రంలో మరో 7 జాతీయ రహదారుల నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం. వీటికి ఏడాదిలోగా భూ సేకరణ పనులు పూర్తిచేసి పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్న అధికారులు. 3,004 కి.మీ. నిడివి ఉన్న ఈ రహదారుల కోసం దాదాపు రూ. 41,654 కోట్లు ఖర్చు. బెంగుళూరు – విజయవాడ, ఖమ్మం –దేవరపల్లి, మదనపల్లె–పీలేరు, రేణిగుంట– నాయుడుపేట, ముద్దనూరు–బి.కొత్తపల్లి–గోరంట్ల, తాడిపత్రి – ముద్దనూరు, మైదుకూరు–పోరుమామిళ్ల–సీతారాంపురం –మాలకొండ–సింగరాయకొండ రోడ్లు జాతీయ రహదారులగా అభివృద్ధి. ఇవికాక పంచాయతీరాజ్ రోడ్లను రూ.1072.92 కోట్లతో బాగుచేస్తున్న ప్రభుత్వం. 2019 నుంచి 2022 వరకూ మొత్తంగా 3,705 కి.మీ మేర పంచాయతీరాజ్ రోడ్ల కొత్త కనెక్టివిటీ, అపగ్రేడేషన్ కోసం రూ. 2131 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం. ఇవికాకుండా 444 కి.మీ మేర బీటీ అప్రోచ్ రోడ్ల కోసం ప్రభుత్వం రూ.308 కోట్లు ఖర్చు చేసింది. ఇది కూడా చదవండి: హై అలర్ట్‌గా ఉండాలి.. సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ -
మేము చెప్పిందే శాసనం!
తుని నియోజకవర్గంలోఅధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని తృణీకరించి, రాజ్యాంగేతర శక్తులుగా రెచ్చిపోతున్నారు. జనాభిమానంతో గెలుపొందిన విపక్ష ప్రజా ప్రతినిధి మాటకు విలువ లేకుండా చేస్తున్నారు. తాము ఓడినా.. తమ పార్టీ గద్దెనెక్కిందన్న మదంతో అహంకరిస్తున్నారు. తమ కనుసన్నల్లో మెలగని అధికారులపై కన్నెర్రజేస్తున్నారు. శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని హెచ్చరించడమే కాకుండా తక్షణం చేసి చూపిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : గెలిపించిన జనానికి ఎంతో కొంత మేలు చేయాలనుకోవడమే తుని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తప్పు అన్నట్టు అక్కడి అధికారపార్టీ ముఖ్యనేతలు వ్యవహరిస్తున్నారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను కలిసినా శిక్షార్హమైన నేరమని దురహంకారం ప్రదర్శిస్తున్నారు. దాడిశెట్టిని కలిసిన తుని రూరల్ ఎంపీడీఓ భానుప్రకాష్‌ను ఆగమేఘాలపై 24 గంటల్లో ఏజెన్సీలోని మారేడుమిల్లికి బదిలీ చేయడమే వారి అధికార మదానికి అద్దం పడుతోందని ఉద్యోగవర్గాలు మండిపడుతున్నాయి. టీడీపీకి చెందిన రాజ్యాంగేతరశక్తి దాష్టీకాన్ని భరించలేక, ఎదిరించలేక ఆ నియోజకవర్గంలోని అధికారులు, ఉద్యోగులు నలిగిపోతున్నారు. తుని నియోజకవర్గంలోని తొండంగి మండలంలో తహశీల్దార్, ఏఓ, ఈఓపీఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తుని మున్సిపాలిటీ సహా నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో కీలక పోస్టుల్లో పని చేసేందుకు అధికారులు వెనకడుగు వేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఎమ్మెల్యే రాజా ఇటీవల తుని మున్సిపల్ అధికారులతో సమీక్షకు సిద్ధమవగా మున్సిపల్ కమిషనర్, ఏఈ సహా ఇతర అధికారులెవరినీ హాజరు కానివ్వకుండా ఆ రాజ్యాంగేతరశక్తులేఅడ్డు తగిలారనే విమర్శలు వెల్లువెత్తాయి. తొండంగి మండల పరిషత్ సమావేశానికి ఆహ్వానం అందిన ఎమ్మెల్యే రాజా మండల పరిషత్ కార్యాలయంలోకి అడుగుపెడుతుండగా సమావేశాన్ని అర్థాంతరంగా ముగించేశారు. ఈఓపీఆర్డీ కె.శేషారత్నం సోమవారం వైఎస్సార్ సీపీకి చెందిన తుని ఎంపీపీ నీరజ చాంబర్‌ను టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు జె.వెంకటలక్ష్మికి అడ్డగోలుగా కేటాయించడం వివాదాస్పదమై చివరకు పోలీసు కేసు వరకు వెళ్లడం గమనార్హం. కక్షకట్టి ఎంపీడీఓను బదిలీ చేసిన రాజ్యాంగేతరశక్తులు ఆయన స్థానంలో శేషారత్నంకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో కృతజ్ఞతగానే ఇలా వ్యవహరించినట్టు భావిస్తున్నారు. పేట్రేగిపోతున్న రాజ్యాంగేతర శక్తులు.. తుని నుంచి 2009 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, 2014 ఎన్నికల్లో వరుసకు ఆయన సోదరుడు యనమల కృష్ణుడు ఓటమి పాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజాకు 19 వేల భారీ మెజార్టీ కట్టబెట్టారు. ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్నప్పటికీ సీనియర్ అనే ఉద్దేశంతో రామకృష్ణుడుకి ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవిని కట్టబెట్టారు. దాంతో ఆసరాగా తెలుగుతమ్ముళ్లు రాజ్యాంగేతర శక్తులుగా పేట్రేగుతూ అన్ని శాఖల ఉద్యోగులపై కర్ర పెత్తనం చెలాయిస్తున్నారు. తమ మాట వినకపోతే వేటు తప్పదని ఎంపీడీఓ భానుప్రకాష్‌ను బదిలీ చేయించడంతో చాటుకున్నారు. ఈ ఉదంతం కంటే ముందు తుని మండలం టి.తిమ్మాపురానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం విషయంలో వివాదం జరిగింది. ఆ గ్రామంలో 45 మంది సీనియర్ మేట్లు ఉన్నారు. వారంతా వైఎస్సార్ సీపీకి చెందిన మేట్ పేరును సిఫార్సు చేశారు. దీనికి భిన్నంగా మేట్ కాని వ్యక్తిని ఫీల్డ్ అసిస్టెంట్‌గా వేయాలని టీడీపీ వారు ఒత్తిడి తెచ్చారు. అయితే నిబంధనల ప్రకారం చేయమని ఉపాధి హామీ సిబ్బందికి ఎంపీడీఓ సూచించారు. దీనిని వ్యతిరేకించిన తెలుగుతమ్ముళ్లు ఉన్నతస్థాయిలో లాబీయింగ్ చేసి తాము కోరిన వ్యక్తిని నియమింపజేశారు. ఇవన్నీ చూసిన అధికారులు, ఉద్యోగులు ఏ క్షణాన ఆ రాజ్యాంగేతర శక్తులు ఎవరిపై ప్రతాపం చూపుతారోనని ఆందోళన చెందుతున్నారు. తుని నియోజకవర్గంలో పని చేృయడమంటే కత్తి మీద సాము చేయడమేనని బిక్కుబిక్కుమంటున్నారు.