Dainik Bhaskar
-
మీడియాను భయపెడుతున్నారు: కేజ్రీవాల్
దైనిక్ భాస్కర్, భారత్ సంచార్‌లపై ఐటీ దాడులు మీడియాని భయపెట్టడమేనని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ విమర్శించారు. ఇలాంటి చర్యలు వెంటనే నిలిపివేయాలని, మీడియా స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణాన్ని కల్పించాలని ట్వీట్ చేశారు. ‘బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారు సహించలేరు. ఇలా దాడులకు దిగుతారు. ప్రతీ ఒక్కరూ కేంద్రం చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకించాలి’ అని కేజ్రివాల్ ట్వీట్‌చేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ దాడుల్ని అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ఈ దాడులు మీడియా గళాన్ని అణగదొక్కడానికేనని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర సంస్థల్ని బెదిరించడానికి వాడుకుంటోందని ధ్వజమెత్తింది. గంగానదిలో కరోనా రోగుల శవాలు తేలినట్టుగా కేంద్రం చేసిన తప్పిదాలు వెలుగులోకి రాకమానవని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. -
మీడియా సంస్థలపై ఐటీ దాడులు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణలతో మీడియా సంస్థలపై ఐటీ శాఖ కొరడా ఝళిపించింది. దైనిక్ భాస్కర్, భారత్ సంచార్ మీడియా సంస్థలకి చెందిన పలు నగరాల్లోని కార్యాలయాలపై దాడులకు దిగింది. భోపాల్, జైపూర్, అహ్మదాబాద్, నోయిడాతోపాటు దేశంలోని ఇతర నగరాల్లోని దైనిక్ భాస్కర్ కార్యాలయాలపై, ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యూస్ చానెల్ భారత్ సంచార్, ఆ సంస్థ ప్రమోటర్స్, సిబ్బందిపై లక్నోలో దాడులు నిర్వహించినట్టుగా ఐటీ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దైనిక్ భాస్కర్ గ్రూప్ టెక్స్టైల్స్, మైనింగ్ వ్యాపారాలూ ఉన్నాయని, వాటికి సంబంధించిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించినట్టుగా ఆ అధికారి చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దైనిక్ భాస్కర్ యాజమానుల నివాసాల్లోని సోదాలు నిర్వహించింది. ఈ రెండు మీడియా సంస్థలు కరోనా సెకండ్ వేవ్ ఎదుర్కోవడంలో కేంద్రం వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యల్ని హైలైట్ చేస్తూ పలు కథనాలు చేశాయి. దేశంలో 12 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న దైనిక్ భాస్కర్ 65 ఎడిషన్లను, 211 సబ్ ఎడిషన్లను హిందీ, గుజరాతీ, మరాఠీ భాషనల్లో ప్రచురిస్తోంది. 7 రాష్ట్రాల్లో 30 రేడియో స్టేషన్లు నిర్వహించడంతో పాటుగా వెబ్ పోర్టల్స్, ఫోన్ యాప్స్ ఉన్నాయి. భారత్ సంచార్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ బ్రజేశ్ మిశ్రా, స్టేట్ హెడ్ వీరేంద్ర సింగ్‌తో పాటు కొందరు ఉద్యోగుల ఇళ్లల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిందని ఆ టీవీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. తర్వాత దైనిక్ భాస్కర్ తన వెబ్సైట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలోని తమ కార్యాలయాల్లో సోదాలు చేసినట్టు వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వ అసమర్థతను తాము బహిర్గతం చేయడం వల్లే ఈ దాడులకు దిగిందని దైనిక్ భాస్కర్ ఆరోపించింది. రాజ్యసభలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ మీడియాపై దాడుల్ని రాజ్యసభలోనూ విపక్ష నేతలు ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకుడు దిగ్వి జయ్ సింగ్ సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతూ కేంద్రం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తుందని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ చేసిన విమర్శ ల్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తిప్పికొట్టారు. కేంద్ర సంస్థలు తమ పని తాము చేస్తున్నాయని అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని అన్నారు. ఎవరైనా పూర్తి సమాచారాన్ని తెలుసుకొని నిర్ధారణ చేసుకోవాలని, కొన్ని అంశాలు వాస్తవ దూరంగా ఉంటాయని వివరణ ఇచ్చారు. పాఠకులే సుప్రీం: దైనిక్ భాస్కర్ తమ కార్యాలయాలపై ఐటీ దాడులపై దైనిక్ భాస్కర్ మీడియా గ్రూపు స్పందించింది. ‘మేము స్వతంత్రులం. పాఠకుల అభీష్టమే మాకు పరమావధి’ అని తమ వెబ్సైట్లో పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్‌లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు పర్యవసానంగానే ఐటీ దాడులని తెలిపింది. తమ గ్రూపు ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయని, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని, నైట్‌షిఫ్ట్‌లో ఉన్న ఉద్యోగులను ఇళ్లకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. -
దైనిక్ భాస్కర్ ఆఫీసుల్లో ఐటీ సోదాలు
-
దైనిక్ భాస్కర్ గ్రూప్ కార్యాలయాలపై ఐటీ దాడులు
సాక్షి, న్యూ ఢిల్లీ: పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న దైనిక్ భాస్కర్ గ్రూప్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ఐటి అధికారులు గురువారం ఉదయం దేశవ్యాప్తంగా ఉన్న పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, న్యూఢిల్లీల్లోని కార్యాలయాల్లో సోదాలు జరిపారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ కరోనాను కట్టడి చేయటంలో మోదీ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు దైనిక్ భాస్కర్ మూల్యం చెల్లిస్తోంది. అరుణ్ శౌరీ చెప్పినట్లుగా ఇది ప్రకటించని ఎమర్జెన్సీ.. ఎమర్జెన్సీకి మరో రూపం’’ అని పేర్కొన్నారు. -
కారుతో ఢీకొట్టి ఇద్దరు జర్నలిస్ట్‌ల హత్య
పట్నా: దేశంలో రోజురోజుకు జర్నలిస్ట్‌ల హత్యలు పెరుగుతున్నాయి. తాజాగా బిహార్‌లో ఇద్దరు జర్నలిస్ట్‌లను స్థానిక నాయకుడొకరు కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. దైనిక్ భాస్కర్ దినపత్రికలో పనిచేస్తున్న నవీన్ నిశ్చల్, విజయ్ సింగ్ అనే ఇద్దరు పాత్రికేయులు దారుణ హత్యకు గురైయ్యారు. పట్నాకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోజ్‌పూర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ హర్సు అనే స్థానిక నాయకుడు, తన కొడుకుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నవీన్, విజయ్ బైకుపై ఆరా ప్రాంతానికి వెళుతుండగా వీరి వాహనాన్ని మహ్మద్ హర్సు అతడి కుమారుడు స్కార్ఫియోతో ఢీకొట్టించారు. నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పారు. మహ్మద్ హర్సు ఇంతకుముందే వివిధ క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. -
రాజస్థాన్ లో బీజేపీకే పట్టం: నీల్సన్ సర్వే
రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్, డైనిక్ భాస్కరన్, నీల్సన్ సర్వేలో వెల్లడించింది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది సర్వే తెలిసింది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి తిరిగి అధికారం కట్టబెట్టే అవకాశాలు కష్టమే అని సర్వేలో 50 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఒకవేళ అధికారంలోకి బీజేపీ వస్తే.. ఆ పార్టీ తరపున వసుంధర రాజే తగిన ముఖ్యమంత్రి అభ్యర్థి అని 56 శాతం మంది తెలిపినట్టు సర్వే రిపోర్ట్. బీజేపీకి 37 శాతం ఓట్లు రానున్నట్టు, అధికార కాంగ్రెస్ 75 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి లాంటి అంశాలు కాంగ్రెస్ పై ప్రతికూల ప్రభావం చూపనున్నయని సర్వేలో వెల్లడైంది.